Breaking News

నా ఓటు టీవీకే పార్టీకే వేశా.. విజయ్‌ సీఎం అవుతాడు: వీటీవీ గణేష్

Published on Thu, 04/23/2026 - 14:39

తమిళనాడులో పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. సినీ నటుడు విజయ్‌ పార్టీ టీవీకే కూడా ఈ సారి పోటీలో ఉండడంతో సినీ తారలంతా ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. రజనీకాంత్‌, ధనుష్‌, త్రిష, మణిరత్నం, అజిత్‌, శృతీహాజన్‌తో పాటు పలువురు తమిళ స్టార్స్‌ ఇప్పటికే తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. వీరితో పాటు సినీ నటుడు వీటీవీ గణేష్ కూడా తన ఓటు హక్కుని వినియోగించుకున్నాడు.  చెన్నై నందనంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్‌లో  ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్​లో ఓటు వేశాడు. అనంతరం పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు వస్తున్న ఆయనను మీడియా పలకరించగా, తాను టీవీకే పార్టీ అభ్యర్థికి ఓటు వేశానని.. విజయ్‌ సీఎం అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు.

‘ఇప్పుడే ఓటు హక్కు వినియోగించుకున్నాను. విజయ్‌ పార్టీ టీవీకేకు ఓటు వేశాను. సొసైటీని అప్‌గ్రేడ్ చేయడానికి విజయ్ పర్‌ఫెక్ట్ ఫిట్ అని నేను నమ్ముతున్నాను. సిస్టమ్, ప్రజలకు మంచి చేస్తారని బలంగా నమ్ముతున్నాను. నాకు ఇతర పార్టీల గురించి మాట్లాడటం ఇష్టం లేదు. ఎందుకంటే నేను టీవీకే పార్టీకి చెందిన వాడిని కాబట్టి ఆ పార్టీ గురించే మాట్లాడుతాను.

 టీవీకే పార్టీ గెలువాలని కోరుకొంటున్నాను. నిన్నటి వరకు విజయ్ పార్టీ గెలుస్తుందా? లేదా? అనే కొంత గందరగోళం ఉంది. ఓటింగ్ సరళిని చూస్తే ఈ రోజు మాత్రం విజయ్ పార్టీ విజయం సాధించడం ఖాయమని తేలిపోయింది. మే 4వ తేదీ వరకు వేచి ఉండండి. టీవీకే పార్టీ గెలుస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు’ వీటీవీ గణేష్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

  కాగా, విజయ్‌ టీవీకే పార్టీ తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. విజయ్‌ కూడా తిరుచురాపల్లి ఈస్ట్‌, పెరంబూర్‌ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. మే 4న తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

Videos

90 శాతం ఓటింగ్.. ఫుల్ జోష్ బెంగాల్ బీజేపీ

సెన్స్ లేదా..? జనసేన నేతలపై నాగబాబు సీరియస్

భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..?

జపాన్ లో మరి కొద్ది రోజుల్లో.. మెగా సునామీ...

నా కొడుకు తప్పేం మాట్లాడలేదు.. TDP పై MLA కోనేటి ఆదిమూలం సంచలన వ్యాఖ్యలు

ఓటు వేసిన సూర్య, జ్యోతిక

ప్రభుత్వం స్పందించడంలేదని డ్రైవర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం

బాబుగారి మరో క్రెడిట్ చోరీ.. కొంచమైనా సిగ్గుగా లేదా.. నీ ఖాతాలో వేసుకోవడానికి..

చంద్రబాబు నన్ను ఇంటికి పిలిచి బెదిరించారు

ఏపీలో మండిపోతున్న ఎండలు

Photos

+5

ప్రముఖ ఎగ్జిబిషన్‌లో టాలీవుడ్ యాంకర్‌ లాస్య సందడి (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో బుల్లితెర బ్యూటీ మంజుల సమ్మర్ చిల్ (ఫోటోలు)

+5

హీరో విష్ణు విశాల్, గుత్తా జ్వాల ఇంట డబుల్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో జయం రవి, సింగర్ కెనీషా (ఫోటోలు)

+5

సంజనా గల్రానీ కూతురు బర్త్‌డేలో పాపులర్‌ ఎమ్మెల్యే (ఫోటోలు)

+5

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. పొద్దుపొద్దున్నే ఓటేసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

జర్నీ జామ్‌ ఫుల్‌.. ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికుల నిలువు దోపిడీ, ఇక్కట్లు (ఫొటోలు)

+5

‘జెట్లీ’ మూవీ ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

రెడ్‌ రోజ్‌లా మెరిసిపోతున్న హీరోయిన్ మానస వారణాసి (ఫొటోలు)

+5

రానా సతీమణి మిహికా బజాజ్ ఆర్ట్‌ షో.. సందడి చేసిన టాలీవుడ్ తారలు (ఫొటోలు)