ఓటీటీలోకి 'కోర్ట్' జంట కొత్త సినిమా.. అధికారిక ప్రకటన

Published on Fri, 04/17/2026 - 12:39

'కోర్ట్' సినిమాతో గతేడాది అద్భుతమైన హిట్ కొట్టిన రోషన్-శ్రీదేవి జంట మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరిని పెట్టి తీసిన మరో మూవీ 'బ్యాండు మేళం'. ఇప్పుడిది నెలలోనే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఈ మేరకు అధికారిక ప్రకటించారు. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుందనేది చూద్దాం.

(ఇదీ చదవండి: వైరల్‌ ఫోటోపై క్లారిటీ ఇచ్చిన అన్నా లెజినోవా)

రోషన్-శ్రీదేవి నటించిన టీనేజీ ప్రేమకథా సినిమా 'బ్యాండుమేళం'. తెలంగాణలోని పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో బావామరదళ్ల మధ్య జరిగే స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. విడుదలకు ముందు ప్రమోషన్లతో చాలా హడావుడి చేశారు గానీ థియేటర్లలో తేలిపోయింది. ఫ్లాప్ అయింది. ఇప్పుడీ చిత్రాన్ని వచ్చే శుక్రవారం(ఏప్రిల్ 24) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు.

'బ్యాండు మేళం' విషయానికొస్తే.. గిరి(హర్ష్ రోషన్) స్కూల్‌లో పెద్దగా చదవడు. దీంతో ఫెయిల్ అవుతాడు. ఇతడి మరదలు రాజి(శ్రీదేవి) మాత్రం టాప్ ర్యాంకర్. గిరికి ఈమెంటే ప్రాణం. అలానే పాటలు కంపోజ్ చేయడం, పాడటం అన్నాసరే ఇష్టం. ఓ సొంత బ్యాండ్ ట్రూప్‌తో ఊరిలో జరిగే పెళ్లిళ్లల్లో పాటలు అవీ పాడుతుంటాడు. ఎప్పటికైనా రహమాన్ అంత పెద్ద సంగీత దర్శకుడు కావాలనేది ఇతడి కల. ఇదలా ఉంటే ఇతడి మరదలు రాజి.. ఇంజనీరింగ్ కాలేజీమేట్‌తో లేచిపోతుంది. అతడు మోసం చేశాడని తిరిగి వెనక్కి వచ్చేస్తుంది. అప్పుడు ఆమెని గిరి ఒప్పుకొన్నాడా లేదా అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా)

Videos

లోక్ సభలో పరువుపాయే.. TDP MLAల రాసలీలల వీడియోలపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్..

శ్రీరాముడు వలస కూలి.. నటుడు ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఈ రోజు దేశ చరిత్రలోనే గొప్ప రోజుగా మిగిలిపోతుంది

లవ్ జీహాద్.. పెళ్లి చేసుకుంటాడు.. మతం మారుస్తాడు.. కడుపు చేస్తాడు..

పాక్ లో ‘దురంధర్' రిపీట్.. నడిరోడ్డులో హమ్జాను లేపేశారు

ఇంటర్ లో అదరగొట్టిన వంటలక్క కూతురు.. 470కి 459 మార్కులు..!

ఎక్కడపోయావ్ సనాతని.. గుడిని కూల్చడమా నీ సనాతన ధర్మం

జగన్ టూర్ సక్సెస్.. బాబులో ఫస్ట్రేషన్

33 గంటలు ఏం ప్రశించారంటే..?

రామోజీ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్న జర్నలిస్ట్ శ్రీహరి.. చెరుకూరి కిరణ్ కు తెలియదా?

Photos

+5

భూత్‌ బంగ్లా మూవీతో పంజాబీ బ్యూటీ వామికా గబ్బి ట్రెండింగ్‌ (ఫోటోలు)

+5

కోహ్లీ లైక్‌ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)

+5

ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి పుట్టినరోజు వేడుక (ఫోటోలు)

+5

భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)

+5

ఏపీలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దివ్యక్షేత్రం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

వైట్‌ డ్రెస్‌ ఔట్‌ఫిట్‌లో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

మహేశ్‌బాబు బ్యానర్‌ సినిమా ‘రావు బహదూర్‌’.. సాంగ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఆర్య కొత్త సినిమా.. ‘మిస్టర్‌ ఎక్స్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

‘శ్రీనివాస మంగాపురం’ మూవీ HD స్టిల్స్

+5

‘పాపం ప్రతాప్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)