కీర్తనను చంపింది నిజమే.. శిక్ష వేయండి.. ఎన్ కౌంటర్ చేయొద్దు
Breaking News
రాత్రి 2 గంటలకు ఫోన్ చేశాడు.. నిద్రలేకుండా రిహార్సల్స్
Published on Sun, 04/12/2026 - 07:27
రీసెంట్ టైంలో దక్షిణాదిలో ఓవర్ నైట్ స్టార్డమ్ సంపాదించిన హీరోయిన్ ఎవరంటే చాలామంది కాయదు లోహర్ అని చెబుతారు. ఎందుకంటే ప్రదీప్ రంగనాథన్‌తో చేసిన 'డ్రాగన్' మూవీ ఈమెకు మంచి గుర్తింపు తెచ్చింది. కానీ అంతకుముందే తెలుగులో ఓ మూవీ చేసినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. ప్రస్తుతం నాని 'ప్యారడైజ్'లో హీరోయిన్గా చేస్తోంది. ఈమె నటించిన తొలి మలయాళ మూవీ 'పల్లి చట్టంబి' ఈ వీకెండే థియేటర్లలోకి వచ్చింది. దీని ప్రమోషన్లలో భాగంగానే తాను చేసిన తొలి ఆల్బమ్ సాంగ్ గురించి, అందులో అవకాశం రావడం గురించి కూడా మాట్లాడింది.
(ఇదీ చదవండి: శివాజీ సృష్టించిన చీర అంటూ అనసూయ కౌంటర్)
'డ్యూడ్' మూవీతో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సాయి అభ్యంకర్.. మరోవైపు ఆల్బమ్ సాంగ్స్ కూడా చేస్తున్నాడు. అలా ఇతడి నుంచి 'పవళ మల్లి' పేరుతో గత నెలలో ఓ సాంగ్ వచ్చింది. ఇందులోనే సాయికి జోడీగా కాయదు కనిపించింది. యూట్యూబ్‌లో హిట్ అయిన ఈ పాటకు ఇప్పటివరకు 8 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇందులో అవకాశం ఎలా వచ్చిందో కాయదు తాజాగా బయటపెట్టింది.
'పవళ మల్లి' పాటలో అనుకోకుండానే నాకు అవకాశమొచ్చింది. ఓ రోజు అర్థరాత్రి 2 గంటలకు సంగీత దర్శకుడు సాయి నుంచి నాకు కాల్ వచ్చింది. ఈ టైంలో ఫోన్ చేసేసరికి కంగారుపడ్డా. ఏమైందని అడిగితే.. తాను ఓ పాట కంపోజ్ చేశానని, చాలా బాగా వచ్చిందని చెప్పాడు. అందులో కచ్చితంగా ఉండాలని నన్ను అడిగాడు. తర్వాత పాట విన్నా, బాగా నచ్చేసరికి వెంటనే ఓకే చెప్పేశా. ఎంజాయ్ చేస్తూనే ఆ పాట పూర్తిచేశాం. ఇందుకోసం 2 రోజులు నిద్రలేకుండా రిహార్సల్స్ చేశాం. ఆడియెన్స్ కూడా పాటని ఎంజాయ్ చేస్తున్నందుకు మాకు సంతోషంగా అనిపించింది' అని కాయదు చెప్పుకొచ్చింది. ఈ పాటని సాయి, శ్రుతి హాసన్ కలిసి పాడారు.
(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)
#KayaduLohar Recent
- #Sai called me at 2 AM and said, #Kayadu, we have a beautiful song, and I really want you to be a part of it.
- I think it’s going to be a blast, and you’re the perfect one. When I heard it, I immediately fell for it.pic.twitter.com/UHWoT6824v— Movie Tamil (@_MovieTamil) April 11, 2026
Tags : 1