బిజినెస్ మ్యాన్ తో పెళ్లైంది... నలుగురు పిల్లలు ఉన్నారు
Breaking News
'దురంధర్-2 స్క్రిప్ట్ కాపీ కొట్టారు'.. డైరెక్టర్‌కు బిగ్ రిలీఫ్
Published on Wed, 04/08/2026 - 17:43
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన దురంధర్ ది రివెంజ్ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. రిలీజైన వారం రోజుల్లోనే రూ.1000 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. రూ.1600 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ రెండు సినిమాలకు బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు.
స్క్రిప్ట్ కాపీ కొట్టారు..
దురంధర్ చిత్రాలు సూపర్ హిట్ కావడంతో ప్రముఖ డైరెక్టర్ సంతోశ్ కుమార్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. దురంధర్ స్క్రిప్ట్ తనదేనని.. ఆదిత్య ధర్ నా స్క్రిప్ట్‌ను దొంగిలించారంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై డైరెక్టర్ ఆదిత్య ధర్ బాంబే హైకోర్టు ఆశ్రయించారు. సంతోశ్ కమార్ తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని.. పరువు నష్టంతో పాటు, తన ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆదిత్య ధర్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు సంతోశ్ కుమార్‌ను హెచ్చరించింది. ఇకపై ఆదిత్య ధర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని చిత్రనిర్మాత సంతోష్ కుమార్‌కు సూచించింది. ఇలాంటివీ పునరావృతం కాకుండా చూసుకోవాలని బాంబే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 16న జరగనుంది. దీంతో ఈ కేసులో దర్శకుడు ఆదిత్య ధర్‌కు ఉపశమనం లభించింది.
కాగా.. 'ధురందర్ 2' రిలీజ్ తర్వాత తన రిజిస్టర్డ్ స్క్రిప్ట్ 'డి సాహెబ్' నుండి కాపీ కొట్టారని ఫిల్మ్ మేకర్ సంతోశ్ కుమార్ ఆరోపణలు చేశారు. తన స్క్రిప్ట్ స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SWA)లో రిజిస్టర్ చేశానని సంతోశ్ తెలిపారు. ఆదిత్య ధర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
దీంతో దర్శకుడు సంతోశ్ కుమార్ వ్యాఖ్యలను ఆదిత్య ధర్ తప్పుబట్టారు. ఇకపై ఇలాంటి ఆరోపణలు చేయవద్దని కోరుతూ కుమార్‌కు లీగల్ నోటీసులు జారీ చేశారు. వాటికి ఆయన స్పందించకపోవడంతో దురంధర్ డైరెక్టర్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. పదేపదే తనపై చేస్తున్న ఆరోపణలు.. ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆదిత్య ధర్ తరఫు న్యాయవాది బీరేంద్ర సరఫ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Tags : 1