ఇక అమెరికా పనైపోయింది..? ఈ యుద్ధం ఆగదు..
Breaking News
సైలెంట్‌గా వైష్ణవిని పెళ్లి చేసుకున్న షన్ను.. ఫొటోలు వైరల్
Published on Sat, 04/04/2026 - 16:46
యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ అలియాస్ షన్ను పెళ్లి చేసేసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరలో వైష్ణవి చోడిశెట్టి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నట్లు వెల్లడించిన ఇతడు.. ఇప్పుడు ఓ రిసార్ట్‌లో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు.
(ఇదీ చదవండి: హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?)
అయితే షన్ను పెళ్లి అయిన సంగతి అతడు గానీ, వైష్ణవి గానీ వెల్లడించలేదు. పెళ్లి ఫొటోలని షేర్ చేసిన ఫొటోగ్రాఫర్.. తన స్నేహితుడి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడని చెప్పుకొచ్చాడు. దీంతో షణ్ముఖ్-వైష్ణవి పెళ్లి అయిందనే విషయం తెలిసింది. ఈ ఫొటోల్లో వధూవరులిద్దరూ కనిపించారు గానీ తాళి కడుతున్న ఫొటోలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.
వైజాగ్‌కి చెందిన షణ్ముఖ్ జస్వంత్..యూట్యూబర్‌గా కెరీర్ మొదలుపెట్టాడు. 'వైవా' షార్ట్ ఫిల్మ్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత పలు తెలుగు సినిమాల్లో సహాయ పాత్రలు చేశాడు. కానీ సాఫ్ట్‌వేర్ డెవలపర్, సూర్య తదితర యూట్యూబ్ సిరీస్‌లతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. బిగ్‌బాస్ షోలో పాల్గొని రన్నరప్‌గా నిలిచాడు. ఈ షో నుంచి బయటకొచ్చిన తర్వాత అప్పటికే ప్రేమలో ఉన్న సహ యూట్యూబర్ దీప్తి సునైనాతో బ్రేకప్ అయింది. తర్వాత కొన్నాళ్లకు వైష్ణవి చోడిశెట్టితో ప్రేమలో పడ్డ షన్ను.. ఇప్పుడు ఆమెనే పెళ్లి చేసుకున్నాడు.
(ఇదీ చదవండి: నేను బెస్ట్ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా: షణ్ముఖ్ జస్వంత్)



Tags : 1