థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు
Breaking News
ఓటీటీలోకి రొమాంటిక్ థ్రిల్లర్.. ప్రేమజంటని వెంటాడే మొసలి
Published on Fri, 04/03/2026 - 18:52
ఇప్పుడంతా ఓటీటీ జమానా. కంటెంట్ నచ్చితే భాషతో సంబంధం లేకుండా వాటిని చూస్తున్నారు. అలా ఇప్పుడు ఓ రొమాంటిక్ సర్వైవల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్దమైంది. భయంకరమైన మొసలి.. ఓ ప్రేమ జంటని వెంటాడే కాన్సెప్ట్‌తో ఈ సినిమాని తీశారు. ఇంతకీ ఇది ఎందులో ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుంది? ఈ మూవీ సంగతేంటి?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు మిస్టిక్ థ్రిల్లర్.. డైరెక్ట్ స్ట్రీమింగ్)
ఈ ఏడాది ఫిబ్రవరి 13న థియేటర్లలోకి వచ్చిన హిందీ మూవీ 'తు యా మై'. షనయ కపూర్, ఆదర్శ్ గౌరవ్ జంటగా నటించారు. బిజోయ్ నంబియార్ దర్శకుడు. 2018లో వచ్చిన థాయ్ సినిమా 'ద పూల్' ఆధారంగా దీన్ని తీశారు. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ అందుకుంది గానీ యాక్టింగ్, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ చిత్రం వచ్చే శుక్రవారం(ఏప్రిల్ 10) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. హిందీలో మాత్రమే అందుబాటులోకి రానుంది.
'తు యా మై' విషయానికొస్తే.. అవని(షనయ కపూర్) మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. బాగా డబ్బున్న అమ్మాయి. మారుతి కడమ్ అలియాస్ ఆలా ఫ్లోపరా(ఆదర్శ్ గౌరవ్) ఓ ర్యాపర్. గల్లీలో పెరుగుతుంటాడు. ఓ వీడియో చేసేందుకు వీళ్లిద్దరూ కలుస్తారు. తర్వాత ప్రేమలో కూడా పడతారు. కలిసి గోవా వెళ్లిన టైంలో ఓ పాడుబడిన హోటల్‌లో చిక్కుకుపోతారు. అక్కడి స్మిమ్మింగ్ పూల్‌లో రొమాంటిక్‌గా ఎంజాయ్ చేద్దామనుకుంటే వీళ్లని ఓ మొసలి వెంటాడుతుంది. దీని నుంచి ప్రేమజంట బయటపడ్డారా లేదా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన శర్వానంద్.. విడాకులు నిజమేనా?)
Tags : 1