ఎవరిది గోల్డ్.. ఎవరిది రోల్ గోల్డ్..?
Breaking News
సమంత మెచ్చిన ఇన్‌స్టా రీల్.. ఆమె టాలెంట్‌కు ఫిదా..!
Published on Wed, 04/01/2026 - 11:11
ఇప్పుడంతా సోషల్ మీడియా హవా నడుస్తోంది. మనం ఏదైనా ప్రత్యేకంగా చేస్తే చాలు.. అది క్షణాల్లోనే వైరలైపోతుంది. ఇప్పుడున్న జమానాలో ఇన్‌స్టా రీల్స్‌లో మునిగిపోతున్నారు జనాలు. కొంచెం గ్యాప్ దొరికితే ఇన్‌స్టా ఓపెన్ చేసిన రీల్స్ తెగ చూసేస్తున్నారు. కేవలం చూడడమే కాదు.. తమ క్రియేటివిటీని అంతా బయటికి తీస్తున్నారు. ఇప్పుడు ఇన్‌స్టా ప్రపంచం పచ్చని పల్లె ప్రజల టాలెంట్‌ను కూడా అందరికీ పరిచయం చేస్తోంది.
తాజాగా ఓ మహిళ టైలర్ చేసిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. అచ్చం హీరోయిన్ సమంతతో మాట్లాడుతున్నట్లుగా చేసిన ఈ రీల్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇటీవల సమంత-యాంకర్ సుమ ఉగాది సందర్భంగా చేసిన వీడియోను సింక్ చేస్తూ ఆ మహిళ టైలర్ చేసిన ప్రమోషన్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె హీరోయిన్‌తో నేరుగా మాట్లాడుతున్నట్లుగా అద్భుతంగా ఎడిట్ చేసి ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఆ మహిళ క్రియేటివిటీని మెచ్చుకుంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఆమె ప్రతిభను మెచ్చుకుంటూ సమంత సైతం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. అదేంటో మీరు కూడా చూసేయండి.
సమంతను మెప్పించిన రీల్
సోషల్ మీడియాలో నెటిజన్ల క్రియేటివిటీకి అద్దం పట్టేలా ఓ మహిళా టైలర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. గతంలో యాంకర్ సుమతో సమంత మాట్లాడిన వీడియో కాల్ క్లిప్‌ను వాడుకుని, హీరోయిన్ నేరుగా తనతోనే మాట్లాడుతున్నట్లుగా ఆమె అద్భుతంగా ఎడిట్ చేశారు. ఈ వీడియో చూసి… pic.twitter.com/xMtp5jsGXs— ChotaNews App (@ChotaNewsApp) April 1, 2026
Tags : 1