క్రూర మృగాల్లా వెంట పడుతున్న వీధి కుక్కలు
Breaking News
యుద్ధం ఆగదు.. వాళ్లంతా నష్టపోక తప్పదు: కియోసాకి
Published on Mon, 03/30/2026 - 14:48
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్థిక నిపుణుడు, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత రోబర్ట్ కియోసాకి మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సంచలన హెచ్చరికలు చేశారు. తాజా ‘ఎక్స్’ పోస్ట్‌లో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు అడ్డగోలుగా ముద్రిస్తున్న డబ్బును 'ఫేక్ మనీ'గా అభివర్ణించిన ఆయన (Robert Kiyosaki), రాబోయే రోజుల్లో సంప్రదాయ పెట్టుబడులు నష్టపోక తప్పదని హెచ్చరించారు.
డాలర్ విలువ పతనం - పెరుగుతున్న అప్పులు
ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం కరెన్సీని ముద్రిస్తుండటం వల్ల దేశాల జాతీయ అప్పులు (National Debt) విపరీతంగా పెరుగుతున్నాయని కియోసాకి పేర్కొన్నారు. దీనివల్ల ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతుందని, డాలర్లను పొదుపు చేసేవారు కాలక్రమేణా తమ సంపదను కోల్పోతారని ఆయన విశ్లేషించారు. ముఖ్యంగా అమెరికా బాండ్లు సురక్షితమైనవనేది ఒక "పెద్ద అబద్ధం" అని ఆయన కుండబద్దలు కొట్టారు.
చమురు సెగ.. అంతం లేని యుద్ధం
ప్రస్తుతం ఇరాన్ కేంద్రంగా సాగుతున్న ఉద్రిక్తతలను ఆయన ఒక 'పవిత్ర యుద్ధం'గా అభివర్ణించారు. ఈ వివాదాలు త్వరలో ముగిసేవి కావని, దీని ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయని, అది మరింత ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పాత పద్ధతులకు కాలం చెల్లింది!
సాధారణంగా ప్రజలు నమ్మే "చక్కగా చదువుకో, మంచి ఉద్యోగం సంపాదించు, పన్నులు కట్టు, 401k లేదా మ్యూచువల్ ఫండ్లలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయి" అనే సూత్రం ఇప్పుడు పనికిరాదని కియోసాకి కొట్టిపారేశారు. ఈ పద్ధతిని అనుసరించేవారే భవిష్యత్తులో ఎక్కువగా నష్టపోతారని ఆయన అభిప్రాయపడ్డారు. చివరికి ఎంబీఏ (MBA) వంటి ఉన్నత డిగ్రీలు కూడా ప్రస్తుత ఆర్థిక సంక్షోభం ముందు పనికిరావని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
2026కు సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్‌లు ఇవే..
ఏవైతే ముద్రించడానికి వీలుపడవో అవే నిజమైన ఆస్తులని కియోసాకి నమ్ముతారు. ఆయన ప్రకారం 2026లో పెట్టుబడిదారులను కాపాడేవి బంగారం, వెండి (Real Gold & Silver), చమురు (Oil), ఆహార ధాన్యాలు (Food), క్రిప్టో కరెన్సీ (Bitcoin & Ethereum) మాత్రమే.
"మీ మెదడులో మీరు నింపుకునే ఆర్థిక విద్య (Financial Education) మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. దేనిని నమ్మాలో మీరే ఆలోచించుకోండి" అంటూ ఆయన ఇన్వెస్టర్లకు సూచించారు.
INVESTOR SECRET: “lf you want to be a rich investor you have to see the future.”
Seeing the future today is EASY for two reasons.
1: The National Debt will only go up because governments will only keep printing fake money.
That means inflation will keep going up which…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 30, 2026
Tags : 1