భారీ అగ్నిప్రమాదం.. పక్కనే పెట్రోల్ బంకు..
Breaking News
పెద్ది పహిల్వాన్ లుక్.. రామ్ చరణ్ అంతలా కష్టపడ్డారా?
Published on Sun, 03/29/2026 - 17:08
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం పెద్ది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చారు.
ఈ గ్లింప్స్‌లో రామ్ చరణ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. పహిల్వాన్‌గా చెర్రీ లుక్ అదిరిపోయింది. ఈ లుక్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయ్యారు. అయితే ఇలా రెజ్లర్‌గా కనిపించేందుకు గ్లోబల్ స్టార్ కఠినంగా డైట్ తీసుకున్నారు. పహిల్వాన్‌లా కనిపించేందుకు దాదాపు 8 నెలల పాటు కేవలం కఠోర నియమాలు పాటించారు. అయ్యప్ప దీక్షలో ఉన్న రామ్ చరణ్ ఈ లుక్ కోసం తీవ్రంగా శ్రమించారని ఇటీవల డైరెక్టర్ బుచ్చిబాబు రివీల్ చేశారు.
కఠినమైన డైట్..
పహిల్వాన్ ఫిజిక్ రావాలంటే ప్రత్యేక డైట్ పాటించాల్సి ఉంటుంది. కేవలం జిమ్‌లో వర్కౌట్స్ చేయడం మాత్రమే కాదు..కఠిన ఆహార నియమాలు కూడా ఫాలో కావాల్సిందే. ఈ ట్రైనింగ్ జరుగుతున్న సమయంలో రామ్ చరణ్ అయ్యప్ప దీక్షలో ఉంటూ కఠిన నియమాలు పాటించారు. ఎక్కడా కూడా తన ఫిట్‌నెస్ రూల్స్ బ్రేక్ చేయలేదని బుచ్చిబాబు సనా తెలిపారు. కాగా.. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
Tags : 1