10 నిమిషాల్లో 12 లక్షల కోట్లు ఆవిరి.... ఈ స్టాక్స్ మీ దగ్గర ఉంటే కొంప కొల్లేరే
Breaking News
రణ్‌వీర్ సింగ్ దురంధర్-2.. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఫిక్స్
Published on Mon, 03/09/2026 - 15:41
రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. కేవలం హిందీలోనే రిలీజైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది.
అయితే కొన్ని నెలల వ్యవధిలోనే ఈ మూవీకి సీక్వెల్‌గా దురంధర్ ది రివెంజ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. అంచనాలు మరింత పెంచేసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓటీటీ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ ఖరారైంది. ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ తర్వాత జియో హాట్‌స్టార్ వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ట్రైలర్‌లోనే వెల్లడించారు. థియేటర్లలో రిలీజైన తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు. కాగా.. ధురంధర్: ది రివెంజ్ మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది.
పోటీ నుంచి తప్పుకున్న టాక్సిక్..
ఈ మూవీతో మార్చి 19న యశ్ హీరోగా వస్తోన్న టాక్సిస్ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే బాక్సాఫీస్ పోటీ నుంచి యశ్ తప్పుకున్నారు. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన గ్యాంగ్‌స్టర్ మూవీ జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tags : 1