రేవంత్ తో చంద్రబాబు కుమ్మక్కు.. రాయలసీమ ప్రాజెక్టుపై సజ్జల డిమాండ్స్
Breaking News
'పెద్ది' మొదలుపెట్టేశాడు.. బుచ్చిబాబుని ఆడుకున్న చరణ్
Published on Sun, 03/01/2026 - 17:44
మెగాహీరో రామ్ చరణ్ లేటెస్ట్ సినిమా 'పెద్ది'. బుచ్చిబాబు దర్శకుడు. లెక్క ప్రకారం మార్చి 27న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అని ప్రకటించారు. కానీ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండేసరికి వాయిదా వేశారు. ఏప్రిల్ 30న థియేటర్లలో తమ మూవీ విడుదల కానుందని కొన్నిరోజుల క్రితం పోస్టర్ వదిలారు. తాజాగా ఓ వైపు చివరి దశ చిత్రీకరణ జరుగుతోంది. మరోవైపు డబ్బింగ్ కూడా మొదలుపెట్టేశారు. తాజాగా ఆ వీడియోని చరణ్.. తన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌తో సినిమా.. 15 రోజులు తినడం మానేశా)
'ఏమది' అనే డైలాగ్ చెబుతున్న వీడియోని పోస్ చేసిన చరణ్.. ఇందులో దర్శకుడు బుచ్చిబాబుని కూడా ఓ రేంజులో ఆటాడుకున్నట్లు కనిపించాడు. 'చికిరి చికిరి పాటలో మోహిత్ చౌహన్ వాయిస్‌కి నువ్వు ఎంత యాక్టింగ్ చేశావంటే ఆయనే పాడాడా అని డౌట్ వచ్చిందయ్యా. నా డబ్బింగ్లో అలా యాక్ట్ చేయకు' అని చరణ్ తెగ ఏడిపించేశాడు. ఈ వీడియో ఫన్నీగా అనిపిస్తూ అభిమానుల్ని ఎంటర్టైన్ చేస్తోంది.
'పెద్ది' నుంచి వచ్చిన తొలి పాట 'చికిరి చికిరి' అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సోమవారం(మార్చి 02) ఈ మూవీ నుంచి రెండో సాంగ్ రిలీజ్ కానుంది. ఇకపోతే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తీసిన ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. జగపతిబాబు, దివ్యేందు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు.
(ఇదీ చదవండి: శరత్ కుమార్ రెండో భార్యని తెగ పొగిడేసిన మొదటి భార్య)
Tags : 1