మెక్సికోలో మాఫియా గ్యాంగ్ బీభత్సం..
Breaking News
జీవితంలో ఎవర్నీ నమ్మననుకున్నా.. అలాంటిది రాజ్ వచ్చాక!
Published on Mon, 02/23/2026 - 15:55
'ఏమాయ చేసావె' సినిమాతో కథానాయికగా ప్రయాణం మొదలుపెట్టింది సమంత. తొలి సినిమా హీరో నాగచైతన్యతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది. కానీ తర్వాత విభేదాలు రావడంతో 2021లో విడాకులు తీసుకున్నారు. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత 2025 డిసెంబర్ 1న బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరును ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే జీవితంలో మరో వ్యక్తిని నమ్ముతానని అనుకోలేదంటోంది సామ్.
అతడి వల్లే ఇలా ఉన్నా
తాజాగా వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. నేను విడాకులు తీసుకున్నప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయాను. భవిష్యత్తులో మరో వ్యక్తిని నమ్ముతానని కలలో కూడా అనుకోలేదు. ఎందుకంటే అప్పుడు నేను మానసికంగా చాలా బలహీనంగా ఉన్నాను. ఎవరి ప్రేమ, స్నేహాన్ని స్వీకరించే పరిస్థితిలో లేను. అలాంటిది నా జీవితంలోకి రాజ్ రావడం సంతోషంగా ఉంది. అతడు వచ్చాకే నాలో తెలియని శక్తి వచ్చింది. రాజ్ వల్లే నేనిప్పుడు బెటర్ పర్సన్‌గా మారాను.
ఈ మధ్యే ఫ్రెండ్‌ను కలిశా..
ఇటీవలే నా పాత ఫ్రెండ్‌ను కలిశాను. ఆమె నాతో మాట్లాడి వెళ్లిపోయాక నాకు వాయిస్ మెసేజ్ పెట్టింది. ఒకప్పుడు నువ్వు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిపడేదానివి. చాలాకాలం తర్వాత మళ్లీ మామూలుగా కనిపిస్తున్నావ్ అని మెసేజ్ పెట్టింది (నవ్వుతూ) అని చెప్పుకొచ్చింది. మొత్తానికి రాజ్ వచ్చాక తన జీవితం సంతోషకరంగా మారిందంటోంది సామ్. ఈ ఆనందం తనకు జీవితాంతం వెన్నంటే ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
చదవండి: చేతిలో చిల్లిగవ్వ లేక.. ప్రతిరోజూ కన్నీళ్లే: బాలీవుడ్ నటుడు
Tags : 1