Breaking News

'రంగస్థలం' సినిమా.. కనీసం రాష్ట్ర అవార్డ్ కూడా ఇవ్వలేదు

Published on Sun, 02/22/2026 - 21:02

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'రంగస్థలం'. 2018లో రిలీజైంది. అప్పటివరకు చరణ్ యాక్టింగ్‌పై ట్రోల్స్ లాంటివి వచ్చేవి. ఈ మూవీ దెబ్బకు వాటన్నింటికి చెక్ పడిందనే చెప్పొచ్చు. అంతలా మెప్పించింది. ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా రామకృష్ణ.. తనకు ఎలాంటి అవార్డ్ రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం రాష్ట్ర అవార్డ్ కూడా రాకపోవడం బాధ కలిగించిందని చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇదంతా అన్నారు.

(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' రెండో పాట రిలీజ్)

'రంగస్థలం' చిత్రంలో నటనకుగానూ రామ్ చరణ్‌కి నేషనల్ అవార్డ్ వస్తుందని అందరం అనుకున్నాం. ఆయనకనే కాదు ఈ సినిమాలో చాలామందికి అవార్డ్స్ రావాలి కానీ ఎవరికీ రాలేదు. సౌండ్ డిజైనర్‌కి మాత్రమే వచ్చింది. లక్కీగా ఆయనకు రావడంతో మేమంతా హ్యాపీగా ఫీలయ్యాం. కనీసం రాష్ట్రస్థాయి అవార్డులు కూడా ఇవ్వలేదు. అయితే నేను పనిచేస్తూ ఎంజాయ్ చేసింది 'రంగస్థలం', 'అంతరిక్షం' సినిమాలకే. 'రంగస్థలం' వెరీ రూరల్, రియలస్టిక్ స్టోరీ. ఇది సెట్ అని అవార్డ్స్ ఇచ్చేవాళ్లకు తెలీదు. ఊరిలో షూటింగ్ చేశామని అనుకున్నారు. రాష్ట్ర అవార్డ్ ఇవ్వలేదు. నేషనల్ అవార్డ్ కూడా రాలేదు. రామ్ చరణ్ కూడా జాతీయ అవార్డ్ గెలుచుకుంటారని నాతో అన్నారు. కానీ జరగలేదు' అని ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈయన చెప్పింది కూడా నిజమేనేమో. ఎందుకంటే 2018కిగానూ తెలుగు ప్రేక్షకులు చాలామంది రామ్ చరణ్‌కి అవార్డ్ వస్తుందని భావించారు. కానీ అలాంటిదేం జరగలేదు. అప్పటికి ఇంకా ఈ పాన్ ఇండియా ట్రెండ్ కూడా పెద్దగా లేదు. ఒకవేళ ప్రస్తుత టైంలో 'రంగస్థలం' రిలీజయ్యుంటే కచ్చితంగా చరణ్‌కి అవార్డ్ వచ్చి ఉండేదేమో? అదే ఉద్దేశాన్ని ఈ చిత్రానికి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ ఇప్పుడు చెప్పుకొచ్చారు. అవార్డులు రాకపోతేనేం సుకుమార్, చరణ్.. ఎవరికి వాళ్లు ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. 

(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ బోల్డ్ సినిమా.. 'హాట్‌స్పాట్ 2 మచ్' తెలుగు రివ్యూ)

Videos

కల్తీపాలు తాగి పలువురు చిన్నారులకు అనారోగ్యం

పైన కుర్చీలు.. లోన మద్యం

సుబ్రమణ్యస్వామి పిటిషన్.. నేడు విచారణ జరపనున్న సుప్రీం కోర్టు ధర్మాసనం

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు బిగ్ షాక్

అతనితో పనైపోయింది.. అందుకే వాసుదేవరెడ్డి అరెస్ట్

కొంపముంచిన గంభీర్

తిరుమల క్యూలైన్‌లో భక్తురాలికి పాము కాటు

బ్రిడ్జిపై నుంచి వాగులోకి దూసుకెళ్లిన బస్సు

నారా లోకేష్ పక్కన ప్రమాదకర వ్యక్తులు

నాటి రాజుల విందులో ఫారిన్ ఫుడ్.. 130 ఏళ్ల నాటి మెనూ వైరల్!

Photos

+5

చిరంజీవికి సన్మానం.. టాలీవుడ్ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)

+5

అమలాపురంలో సందడి చేసిన 'రాకాస' మూవీ టీమ్ (ఫొటోలు)

+5

కొచ్చిలో 70వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌.. ట్రెండింగ్‌ ఫోటోలు చూశారా?

+5

వైభవంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఈకో రన్ 2.0లో బిగ్ బాస్ దివి వద్త్య సందడి (ఫొటోలు)

+5

లాంచనంగా మొదలైన రిషభ్ శెట్టి 'జై హనుమాన్' (ఫొటోలు)

+5

లక్కీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్‌ నంబర్‌-1 లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సరస్వతి మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

విశ్వక్ సేన్ కల్ట్‌ మూవీ టీజర్ లాంఛ్ (ఫొటోలు)

+5

హిందూ, క్రిస్టియన్‍ పద్ధతుల్లో బ్రిటీషర్‌ని పెళ్లాడిన నటి (ఫొటోలు)