నేను మెచ్యూర్ అయ్యానని ఒప్పుకోను.. హీరో చంద్రహాస్

Published on Sat, 02/21/2026 - 17:52

హీరోగా రెండు సినిమాలు చేసినప్పటికీ ఒక్కటీ సక్సెస్ కాలేదు. అయినా సరే వరస వివాదాలతో వార్తల్లో నిలిచాడు చంద్రహాస్. ఈ నెల ప్రారంభంలో 'బరాబర్ ప్రేమిస్తా' మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. ఇదొక సినిమా ఉందని కూడా తెలియనంతగా ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. దీని రిలీజ్ టైంలోనే 'గుంజీ గుంజీ' అనే బూతు పాట పాడి వివాదానికి కారణమయ్యాడు. ఓ జర్నలిస్టుకి వార్నింగ్ ఇచ్చి హాట్ టాపిక్ అయిపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇతడు.. తన గురించి మరిన్ని ఆసక్తికర విషయాల్ని బయటపెట్టాడు.

ఇప్పటికీ తాను ఇంకా పూర్తిగా మెచ్యూర్ కాలేదని చెప్పిన చంద్రహాస్.. అప్పట్లో ఏ మాత్రం కోపం వచ్చినా సరే ఎవరనేది చూడకుండా చేయెత్తి కొట్టేసేవాడినని చెప్పుకొచ్చాడు. అలానే ప్రదీప్ రంగనాథన్ తీసిన 'డ్రాగన్' సినిమా తన బయోపిక్ అని అన్నాడు. అందులో చూపించినట్లే.. తాను కూడా నిజజీవితంలో చివరి సెమిస్టర్‌లో ఒకేసారి 26 సబ్జెక్టులు క్లియర్ చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు.

(ఇదీ చదవండి: 'స్క్విడ్ గేమ్' గుర్తుచేసిన విశ్వక్ సేన్ 'కల్ట్'.. టీజర్ రిలీజ్)

అప్పట్లో తన తండ్రి స్పైడర్ మ్యాన్ డ్రస్ కొనిస్తే.. దాన్ని వేసుకుని కింద ఇంటిలో ఉన్న పిల్లలకు చూపిస్తే.. డ్రస్ వేసుకుంటే సరిపోదు. స్పైడర్ మ్యాన్‌లా ఎగరాలి అని చెప్పేసరికి రెండో ఫ్లోర్ నుంచి కిందకు దూకేశానని కూడా చంద్రహాస్ చెప్పుకొచ్చాడు. అవకాశం లభిస్తే దర్శకులతో రాజమౌళి, సందీప్ రెడ్డి వంగాతో పనిచేయాలని అనుకుంటున్నట్లు కూడా చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ ఈ వీడియో బిట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చంద్రహాస్ విషయానికొస్తే టీవీ నటుడు ప్రభాకర్ కొడుకు. తొలుత 'రామ్‌నగర్ బన్నీ' అనే మూవీ చేశాడు. 2024లో ఇది థియేటర్లలోకి వచ్చింది. ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీని ప్రమోషన్ల టైంలోనే కాస్త వింతగా ప్రవర్తించడం, మాట్లాడటంతో యాటిట్యూడ్ స్టార్ అని ట్రోల్ చేశారు. ఈ పేరుని తనకు ట్యాగ్‌గా పెట్టేసుకున్న చంద్రహాస్.. తొలి రెండు మూవీస్‌కి అదే ట్యాగ్ వేసుకోవడం విశేషం.

(ఇదీ చదవండి: లెస్బియన్ కాన్సెప్ట్ సినిమా.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్)

Videos

రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..

బాబుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టులో లడ్డూ వివాదంపై సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్

ఆఫ్ఘనిస్తాన్ పై పాక్ వైమానిక దాడి.. 17 మంది మృతి

దేవుడి సన్నిధిలో దందా.. ప్రక్షాళన అంటే ఇదేనా!

నా భర్త అలాంటోడే.. ఆయన ఫ్రెండ్ తో కలిసి లైంగికంగా..

AP: 8వ తరగతి బాలుడిపై ముగ్గురు తోటి విద్యార్థుల లైంగిక దాడి..

విజయ్ & రష్మిక పెళ్లిపై నటుడు ప్రమోద్ శెట్టి కీలక వ్యాఖ్యలు

మీ బెదిరింపులకు భయపడను.. నోటీసులపై పూజిత రియాక్షన్

అది ఏక సభ్య కమిషన్ కాదు.. తెలుగుదేశం పార్టీ కమిషన్

Dharmavaram: నా భర్త అలాంటోడే ఆయన ఫ్రెండ్ తో కలిసి లైంగికంగా..

Photos

+5

సోఫీ షైన్‌ను పెళ్లాడిన టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

పళని మురుగన్‌ని దర్శించుకున్న హీరో నిఖిల్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అంబానీ ఇంద్రభవనానికి హిల్లరీ క్లింటన్‌ (ఫోటోలు)

+5

నరేశ్‌కు ఎంతో ప్రత్యేకమైన రోజు.. ఎందుకంటే? (ఫోటోలు)

+5

సింగర్ మంగ్లీ 'ఇషా' ట్రిప్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

రాధిక, శివకార్తికేయన్‌ కోసం వచ్చిన కమల్‌ హాసన్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : అభినయం..అనన్యం (ఫొటోలు)

+5

గ్రాండ్‌ పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్‌.. ఫుల్‌ జోష్‌లో హీరోయిన్స్‌ (ఫోటోలు)

+5

వైభవంగా శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)