మున్సిపల్ రిజల్ట్స్ 2026 పెద్దపల్లిలో చక్రం తిప్పిన మంత్రి శ్రీధర్
శ్రీ విష్ణు లేటేస్ట్ మూవీ.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్
Published on Fri, 02/13/2026 - 21:48
శ్రీవిష్ణు హీరోగా వస్తోన్న తాజా చిత్రం విష్ణు విన్యాసం. ఈ మూవీలో నయన్ సారిక హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు యదునాథ్ మారుతిరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్లో జి సుమంత్ నాయుడు నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజైంది.
మొదలే మొదలే అంటూ సెకండ్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజైన ఈ క్రేజీ సాంగ్ లవర్స్‌ను అలరిస్తోంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్ అందించగా..నరేశ్ అయ్యర్, మధుశ్రీ ఆలపించారు. కాగా.. ఈ చిత్రంలో సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి రాధన్ సంగీతమందిస్తున్నారు.
#
Tags : 1