అరవ శ్రీధర్ మరో రెండు వీడియోలు రిలీజ్
Breaking News
సినిమాలు వర్కవుట్ కాకపోతే సీరియల్స్? చంద్రహాస్ ఆన్సరిదే!
Published on Sat, 01/31/2026 - 13:57
ప్రభాకర్ బుల్లితెరపై స్టార్ యాక్టర్‌గా రాణిస్తుంటే అతడి కొడుకు చంద్రహాస్ సినిమాల్లో తన అదృష్టాన్ని వెతుక్కుంటున్నాడు. రామ్‌నగర్ బన్నీ మూవీతో హీరోగా పరిచయమైన అతడు తన రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ మూవీయే బరాబర్ ప్రేమిస్తా. సంపత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది.
అది నా లక్ష్యం కాదు
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో చంద్రహాస్ సీరియల్స్‌పై ఆసక్తి ఉందా? లేదా? అన్న విషయంపై క్లారిటీ ఇచ్చాడు. చంద్రహాస్ మాట్లాడుతూ.. నేను సీరియల్స్ చేస్తాననాలే కానీ నాన్న ఇప్పటికిప్పుడు నాలుగైదు సీరియల్స్‌లో నన్నే హీరోగా పెట్టేస్తాడు. డబ్బు సంపాదించాలంటే సీరియల్స్ బెటర్. నాకు డబ్బు సంపాదించడం లక్ష్యం కాదు. ఒకవేళ 5, 10 ఏళ్ల తర్వాత నాకు సినిమాలు వర్కవుట్ కావడం లేదంటే టీవీకి వెళ్లిపోవచ్చు. యాంకర్‌గా రెండు షోలు ఇప్పిస్తాడు లేదంటే సీరియల్స్‌లో హీరోగా చేయిస్తాడు.
టీవీ చాలా ఈజీ
నాన్న వల్ల టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టడం, అవకాశాలు సంపాదించడం నాకు చాలా ఈజీ.. ఇది ఎప్పటికైనా నాకు బ్యాకప్‌లా పనిచేస్తుంది. కానీ, అంతవరకు రానివ్వను. టీవీని నేను లైట్ తీసుకుంటాను. ఎందుకంటే నాకు డబ్బుపై అంత ఆసక్తి, ఆశ లేదు. నాన్న బాగానే సంపాదించాడు. నేనేం పని చేయకపోయినా అది నాకు సరిపోతుంది అని చంద్రహాస్ చెప్పుకొచ్చాడు.
చదవండి: చిరంజీవి ఫేవరెట్ హీరో ఎవరంటే?
Tags : 1