Breaking News

అనిల్ రావిపూడికి 'రేంజ్ రోవర్' గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి

Published on Sun, 01/25/2026 - 20:37

రెండో ఇన్నింగ్స్‌లో చిరంజీవి సినిమాలైతే చేస్తున్నాడు గానీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ ఈసారి సంక్రాంతికి మాత్రం చిరు ఫుల్ జోష్ చూపించాడు. 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీతో ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే రూ.300 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించుకున్నారు. ఈ క్రమంలోనే చిరు.. దర్శకుడు అనిల్ రావిపూడికి ఖరీదైన బహుమతి ఇచ్చాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సైక్ సిద్ధార్థ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

గత పదేళ్ల కాలంలో 9 సినిమాలు చేసిన అనిల్ రావిపూడి.. ప్రతి దానితోనూ సక్సెస్ అందుకున్నాడనే చెప్పొచ్చు. 'ఎఫ్ 3'కి యావరేజ్ టాక్ వచ్చింది. ఇతడి సినిమాల్లో ఉండేది క్రింజ్ కామెడీ అని ట్రోల్స్ వస్తుంటాయి. కానీ ప్రతిసారి ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి అనిల్ చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతూనే ఉంది. ఈసారి కూడా అదే ప్రూవ్ అయింది. దీంతో చిరు ఆనందంతో.. రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారుని అనిల్‌కి గిఫ్ట్ ఇచ్చారు.

అనిల్ రావిపూడి బహుమతిగా అందుకున్న ఈ కారు ధర హైదరాబాద్ మార్కెట్‌లో దాదాపు రూ.2 కోట్ల పైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలని నిర్మాణ సంస్థ.. సోషల్ మీడియాలో పంచుకోగా అవి వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో చిరు సరసన నయనతార హీరోయిన్ కాగా, వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. భీమ్స్ అందించిన పాటలు జనాల్ని బాగానే ఎంటర్‌టైన్ చేస్తున్నాయి.

(ఇదీ చదవండి: పవన్‌ ఫ్యాన్స్‌ని అన్‌బ్లాక్‌ చేసిన హరీష్‌ శంకర్‌!)

Videos

రీల్స్ చేయను క్షమించండి..

టీడీపీ గూండాల బరితెగింపు.. డెయిరీ ఫామ్ ను కూల్చేసి.. 26 గేదలను..

20 వేలకే కారు.. లక్కీ డ్రా పేరుతో మోసం.. కార్లను తుక్కు తుక్కు చేసిన జనం

తిరుమల లడ్డూపై జడ శ్రవణ్ సంచలన ప్రెస్ మీట్

కామారెడ్డిలో విషాదం.. ఆటో నుండి దూకిన ముగ్గురు అమ్మాయిలు..

సొమ్మొకడిది సోకొకడిది.. తండ్రీకొడుకుల భజన చూసి నవ్వుతున్న నెటిజన్లు

11 మంది తెలుగు వారికి పద్మ అవార్డులు

మోత మోగిస్తున్న వెండి.. భయపెడుతున్న బంగారం

100 కోట్ల భూమిపై కన్నేసిన టీడీపీ నేత

థ్రిల్లింగ్ ట్విస్ట్ కు వెంకీ రెడీ!

Photos

+5

Medaram Jatara 2026 : మేడారం జాతరలో భారీ భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

‘మనశంకర వరప్రసాద్‌ గారు’ మూవీ బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

గాజులరామారం : ఘనంగా చిత్తారమ్మ జాతర (ఫొటోలు)

+5

అనిల్‌ రావిపూడికి ఒక రేంజ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి (ఫోటోలు)

+5

తెలుగు సీరియల్ నటి కూతురి బారసాల (ఫొటోలు)

+5

కాంతార బ్యూటీ 'సప్తమి గౌడ' పదేళ్ల సినీ జర్నీ స్పెషల్‌ ఫోటోలు

+5

మ్యాడ్‌ నటి 'రెబా జాన్‌' ట్రెండింగ్‌ ఫోటోలు

+5

తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి లేటేస్ట్ పిక్స్ (ఫొటోలు)

+5

కొండల్లో తిరిగేస్తున్న తేజస్విని (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జనవరి 25- ఫిబ్రవరి 01)