Breaking News

పదో సినిమా ఫిక్స్‌.. టైటిల్‌ విచిత్రంగా ఉండబోతోంది: అనిల్‌

Published on Thu, 01/22/2026 - 16:23

దర్శకుడిగా వరుస బ్లాక్‌బస్టర్లు కొడుతున్న అనిల్‌ రావిపూడి.. 10వ సినిమా ఎవరితో? అని ఇప్పటికే చర్చ మొదలైంది. కొంతకాలంగా మన శంకర వరప్రసాద్‌ విజయాన్ని ఆస్వాదిస్తున్న ఆయన తాజాగా తన నెక్స్ట్‌ సినిమాపై అప్‌డేట్‌ ఇచ్చాడు. చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రలో నటించిన మన శంకరవరప్రసాద్‌గారు మూవీ తాజాగా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరింది. 

సరైన నిర్ణయం తీసుకోకపోతే
ఈ సందర్భంగా అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ.. ఇది నాకు కాస్త కష్టమైన సమయం. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్‌బస్టర్‌ తర్వాత నేను చేసిన సినిమా ఒక ఎత్తయితే.. ఇప్పుడు రెండు భారీ హిట్స్‌ తర్వాత సినిమా అంటే కాస్త గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. ఏం చేయాలి? ఎలా చేయాలి? అనే ఆలోచనలు ఎక్కువైపోతాయి. ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోతే దారి తప్పిపోతాం. అందుకే పదిరోజులు గ్యాప్‌ ఇచ్చాను.

టైటిలే విచిత్రంగా ఉండబోతోంది
తాజాగా వైజాగ్‌ టూర్‌లో ఒక ఆలోచన వచ్చింది. ఈసారి టైటిల్‌ ప్రకటన నుంచే ఒక విచిత్రమైన జర్నీ మొదలుకాబోతోంది. ఇది చూసి చాలామంది వామ్మో, ఇదేంట్రా బాబూ అనుకుంటారు. మరికొందరు హమ్మయ్య, ఇంకో సినిమాతో వస్తున్నాడు అనుకుంటారు. కచ్చితంగా ఒక మ్యాజిక్‌ అయితే జరగబోతోంది. టైటిల్‌ మాత్రం విచిత్రంగా ఉంటుంది. త్వరలోనే ఆ టైటిల్‌ ప్రకటిస్తాను.

పవన్‌ కల్యాణ్‌తో కాదు!
ఈ సినిమాలో నటీనటులను ఎవర్నీ అనుకోలేదు. కథ లైన్‌ మాత్రమే ఫిక్స్‌ అయ్యాను. అందులో ఎవరు చేస్తే బాగుంటుంది? ఎవరి డేట్స్‌ దొరుకుతాయి? అన్నది చూడాలి. అన్నింటికంటే ముఖ్యం డేట్స్‌ దరకడం కదా! జూన్‌, జూలైలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. పవన్‌ కల్యాణ్‌ను నేను కలవలేదు, ప్రస్తుతానికైతే ఆయన్ను అయితే అనుకోలేదు అని చెప్పుకొచ్చాడు.

చదవండి: పెళ్లి ప్రపోజల్‌.. ముందు కెరీర్‌పై ఫోకస్‌ చేయ్‌: హీరోయిన్‌

Videos

విజయ్ కి గుడ్ న్యూస్ TVK పార్టీ గుర్తు ఇదే..

RK Roja: రెడ్ బుక్ అని తిరిగేవాళ్లకు వడ్డీతో ఇచ్చేద్దాం

బాబు భూ సెర్వే... చంద్రబాబుపై మధుసూదన్ రెడ్డి పంచులు

కేతిరెడ్డి పెద్దారెడ్డి పై దాడి చేసేందుకు స్కేచ్ తెగించిన జేసీ ప్రభాకర్ రెడ్డి

వైఎస్సార్‌సీపీ ఎంపీలతో వైఎస్‌ జగన్‌ కీలక సమావేశం

నువ్వు నాటిన విత్తనాలు వృక్షాలు అయితే ఎలా ఉంటుందో చూపిస్తా బాబుకు జగన్ స్ట్రాంగ్ వార్నింగ్

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సిట్ నోటీసులు ఇస్తారా?: హరీష్ రావు

కేటీఆర్ కు సిట్ నోటీసులు

విద్యుత్ చార్జీలు తగ్గించినట్టు ప్రభుత్వం తప్పుడు ప్రచారం

ట్రంప్ VS న్యూసమ్... సొంత దేశంలోనే గొడవలు

Photos

+5

వేకేషన్‌ ఎంజాయ్‌ చేస్తోన్న చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ (ఫోటోలు)

+5

స్టన్నింగ్‌ అవుట్‌ఫిట్‌లో టాలీవుడ్ హీరోయిన్ ఇషా రెబ్బా (ఫోటోలు)

+5

నిన్ను విసిగించడం నాకెంత ఇష్టమో!: భావన (ఫోటోలు)

+5

ఇప్పుడు స్టార్‌ సెలబ్రిటీస్‌.. పదేళ్ల కిందట ఎలా ఉన్నారంటే? (ఫోటోలు)

+5

బ్లాక్‌ & వైట్‌ డ్రెస్‌లో జిగేలుమంటున్న హీరోయిన్‌ (ఫోటోలు)

+5

మేడారం మహాజాతరలో తొలిఘట్టం...ఘనంగా మండమెలిగె పండుగ (ఫొటోలు)

+5

ఫుల్‌ జోష్‌లో బిగ్‌బాస్‌ విష్ణు ప్రియ (ఫోటోలు)

+5

ఎల్లే లిస్ట్ అవార్డులు 2026...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)

+5

కాలుదువ్వుతూ..రంకెలేస్తూ రంగంపేట జల్లికట్టు (ఫొటోలు)