Breaking News

ప్రతి రోజు ఏడ్చేవాడిని.. వదిలేద్దామనుకున్నా: నవీన్ పొలిశెట్టి ఎమోషనల్

Published on Mon, 01/19/2026 - 16:47

ఈ  సంక్రాంతి టాలీవుడ్ సినీ  ప్రియులను అలరించిన ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ అనగనగా ఒక రాజు. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. జనవరి 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఆడియన్స్‌ను విపరీతంగా అలరిస్తోంది. తాజాగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డ్ సాధించింది.

ఈ సినిమా రిలీజైన ఐదు రోజుల్లో వంద కోట్ల మార్క్‌ను చేరుకుంది. ఈ విషయాన్ని హీరో నవీన్ పొలిశెట్టి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది చూస్తుంటే నా హృదయం ఆనందంతో నిండిపోయిందని నవీన్‌ రాసుకొచ్చారపు. ఇంతటి ఘన విజయం అందించిన ప్రేక్షకులను ధన్యవాదాలు తెలిపాడు.  ఈ క్షణం కోసం చాలా సంవత్సరాలు పట్టిందని ఎమోషనల్ ట్వీట్ చేశారు.

నవీన్ పొలిశెట్టి తన ట్వీట్‌లో రాస్తూ..'ముంబైలో నేను ఇచ్చిన ఆడిషన్లన్నింటి గురించి ఆలోచిస్తున్నా. ఎన్నోసార్లు వదిలేయాలనిపించింది.  నా ప్రమాదం తర్వాత ఈ సినిమాలో ఎలా నటిస్తాను అని ప్రతిరోజూ ఏడ్చేవాడిని. కానీ ఈ రోజు అనగనగా ఒకరాజు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. నా కళ్లలో ఆనంద భాష్పాలు తిరుగుతున్నాయి. ఈ క్షణం కోసం చాలా ఏళ్లు పట్టింది. నన్ను నమ్మి టికెట్ కొన్నందుకు ధన్యవాదాలు. థియేటర్లలో మేము చూస్తున్న మీ ప్రేమకు, ఉత్సాహానికి ధన్యవాదాలు. ఈ బ్లాక్‌బస్టర్ అందించిన మా నిర్మాతలకు నా హృదయపూర్వక అభినందనలు. మా లాంటి వారికి మీ మద్దతు, ప్రోత్సాహం ప్రాణం లాంటిది. ఈ విజయం మనందరిది. మీ ప్రేమ, మద్దతు ఇలాగే అందిస్తూ ఉండండి. మీకు మరింత వినోదాత్మక చిత్రాలను అందించడానికి నేను మరింత కష్టపడతా' అంటూ రాసుకొచ్చారు 

 

 

 

 

 

 

 

 

Videos

Ravi Teja: ప్రేమ పేరుతో యువతిని మోసం 10 ఏళ్ల జైలు శిక్ష

Palnadu: సిగ్గులేకుండా రికార్డింగ్ డ్యాన్స్ లు పైగా లోకేష్, పవన్ ఫోటోలు

Guntur : కోట్ల భూమికి.. 30 లక్షలా? చెత్త ప్యాకేజీ..

Kannababu : మెడికల్ కాలేజీలకు డబ్బులేవ్ కానీ NTR విగ్రహం కోసం రూ. 1750 కోట్లు

చలో విజయవాడ.. మేమేంటో చూపిస్తాం

ఏపీలో పేకాటలపై కారుమూరి ఫైర్

BRS నాయకుడిపై ఎమ్మెల్యే రాజాసింగ్ PA దాడి

Jada Sravan: మీరు టీడీపీకే హోం మంత్రి, డిప్యూటీ సీఎంలా

Karanguda : రోడ్లు వేయడం లేదంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు

Karnataka : ఆఫీస్ లోనే ముద్దులు, కౌగిలింతలు అడ్డంగా దొరికిన DGP..

Photos

+5

హీరోయిన్స్ నయనతార, త్రిషల స్నేహ బంధం... ఫోటోలు

+5

రాతివనం.. అపురూపం

+5

రెడ్ డ్రెస్ లో మెరిసిన ధురంధర్ మూవీ హీరోయిన్ సారా అర్జున్ (ఫొటోలు)

+5

మేడారంలో గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి (ఫొటోలు)

+5

జపాన్ లో పుష్ప 2 ప్రమోషన్స్ లో అల్లు అర్జున్, రష్మిక (ఫొటోలు)

+5

మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)

+5

హీరోయిన్ హల్దీ వేడుక.. ఫోటోలు షేర్ చేసిన బ్యూటీ

+5

హీరోయిన్‌ సంఘవి కూతురి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

2016లో అనసూయ ఎలా ఉందో చూశారా? (ఫోటోలు)