Breaking News

ఫ్యాక్టరీ కార్మికుడి నుంచి ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌ రేంజ్‌కి..!

Published on Sun, 01/04/2026 - 10:41

ఏ చిన్న ఉద్యోగం చేసినా..అక్కడే ఉండిపోకూడదు..దినదినాభివృద్ధి చెందాలన్నా ఆర్యోక్తిని బలంగా నమ్మాడు ఈ వ్యక్తి. శ్రమతో కూడిన ఉద్యోగం చేస్తూ..కూడా మంచి ఉన్నతోద్యోగిగా మారాలన్న ఆశయాన్ని బలంగా ఏర్పరుచకున్నాడు. ఆర్థిక పరిస్థితి చదువు కొనసాగనివ్వకపోయినా..తనను తాను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలనుకున్నాడు. అనుకున్నది సాధించి..పరిమితులు, ఆర్థిక వనరులు అనుకూలంగా లేకపోయినా..ఉవ్వెత్తిన ఎగిసిపడే కెరటంలా అనితర సాధ్యమైన లక్ష్యాన్ని చేధించగలమని నిరూపించి.. స్ఫూర్తిగా నిలిచాడు. 

అతడు పూణేకు చెందిన యువకుడు. అతడి కథ నెట్టింట వైరల్‌గా మారండంతో అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. అతడు యూఎస్‌ ఆధారిత కూరగాయల ప్రాసెసింగ్‌ ఫ్యాకర్టీలో రోజుకి పదిగంటల షిప్ట్‌లో పనిచేస్తుండేవాడు. నిజానికి ఈ ఉద్యోగం శారీరకంగా, మానసికంగా చాలా శ్రమతో కూడిన ఉద్యోగం. అతనికి కోడింగ్‌పై ఎలాంటి ముందస్తు నేపథ్యంగానీ, అవగాహన గానీ లేదు. కానీ స్నేహితుడు చెప్పిన ఎలోనమస్క్‌ సూచన అతడిని ఎంతగానే ప్రేరేపించింది. 

ఆ సూచననే కార్యరూపంలోకి తీసుకొచ్చేలా..ప్రోగ్రామింగ్‌ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎలాన్‌ మస్క్‌ అన్నట్లుగా ప్రతీది ఇంటర్నెట్‌లో ఉచితంగా లభిస్తుంది కాబట్టి అదే మీ అభ్యున్నతికి అద్భుతమైన వనరు అన్న మాటలు తూచతప్పకుండా ఫాలో అయ్యాడు అతడు. డబ్బు ఆదా చేసుకుని మరి తల్లిదండ్రుల మద్దతుతో ఓ ల్యాప్‌టాప్‌ కొనుకున్నాడు. దాని సాయంతో ఆన్‌లైన్‌ వనరులను ఉపయోగించుకుని హెచ్‌టీఎంఎల్‌, సీఎస్‌ఎస్‌, జావాస్క్రిప్ట్‌, రియాక్ట్‌ను అధ్యయనం చేశాడు. 

ఖరీదైన కోర్సులు లేకుండా డాక్యుమెంటేషన్‌ చదవడం ప్రారంభించాడు. అలా ప్రాజెక్టులు నిర్మించడం, ఆ క్రమంలో  జరిగే తప్పుల నుంచి నేర్చుకోవడం వంటివి చేస్తున్నాడు. జస్ట్‌ 18 నెలల్లో తనను తాను ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌గా తీర్చిదిద్దుకుని యువతరానికి స్ఫూర్తిగా నిలిచాడు. నేర్చుకోవాలనే తప్పన, మంచి స్ధాయిలో ఉండాలన్న అభిలాష, ఆర్థిక వనరులు, పరిస్థితులు వెనక్కిలాగలేవు, ఆపలేవు అని నిరూపించాడు. 

 

ఫుల్-స్టాక్ డెవలపర్ అంటే 
వెబ్‌సైట్ లేదా అప్లికేషన్ ముందు భాగం (యూజర్ చూసేది), వెనుక భాగం (డేటాబేస్‌లు, సర్వర్లు) రెండింటినీ నిర్మించగల సామర్థ్యం ఉన్న వ్యక్తి. వీరికి HTML, CSS, JavaScript (ఫ్రంట్-ఎండ్ కోసం), Python, Java, Node.js వంటి భాషలు, డేటాబేస్ మేనేజ్‌మెంట్ (బ్యాక్-ఎండ్ కోసం) వంటి విస్తృత నైపుణ్యాలు అవసరం. ఇది ఎండ్-టు-ఎండ్ ప్రాజెక్ట్‌ను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. 

(చదవండి: 52 ఏళ్ల మహిళ యూట్యూబ్‌ రీల్స్‌తో మొదటి సంపాదన..!)
 

Videos

క్లోజ్డ్ రూమ్ లో కన్నింగ్ ప్లాన్.. అసెంబ్లీ సాక్షిగా అంతా బాబే చేశాడు..

'బేబి' వైష్ణవి చైతన్య క్యూట్ ఫొటోలు

Gadikota Srikanth : రాయలసీమ ప్రాంతంపై ఎందుకింత ద్వేషం చంద్రబాబు

NEW RECORD: రూ.3 లక్షల కోట్లు దాటేసిన చంద్రబాబు అప్పులు

TVK అధినేత విజయ్ కు సీబీఐ నోటీసులు..

Tirumala: చిరంజీవి సతీమణి సురేఖకు అవమానం...పవన్ రియాక్షన్!

Mayor Rayana: మీది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం

Konasema: బయటపడుతున్న సంచలన విషయాలు..

ఏపీ-తెలంగాణ జల వివాదంపై స్పందించిన ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్

YSRCP Leaders: ఇది చేతగాకే.. ఓయబ్బో అని చేతులెత్తేశావ్..

Photos

+5

గోవాలో బీచ్ ఒడ్డున హీరోయిన్ రాశీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

కత్రినా కైఫ్ చెల్లిని ఎప్పుడైనా చూశారా? (ఫొటోలు)

+5

జపనీస్ చెఫ్ స్పెషల్.. చరణ్ ఇంట్లో బిర్యానీ పార్టీ! (ఫొటోలు)

+5

ఎ.ఆర్. రెహమాన్ బర్త్‌డే వేడుకలు.. సందడిగా సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

జగజ్జేతలకు సన్మానం.. ప్రత్యేక ఆకర్షణగా రోహిత్‌, హర్మన్‌

+5

Sankranti 2026 : పల్లె గాలిలో రుచుల పండుగ (ఫొటోలు)

+5

కోనసీమ గుండెల్లో బ్లో అవుట్‌ మంటలు (ఫోటోలు)

+5

సందడిగా సాక్షి ముగ్గుల పోటీలు (ఫొటోలు)

+5

'వామ్మో వాయ్యో' సాంగ్.. తెర వెనక ఆషిక ఇలా (ఫొటోలు)

+5

దీపికా పదుకోణె బర్త్‌డే స్పెషల్‌.. వైరల్‌ ఫోటోలు ఇవే