Breaking News

సైలెంట్‌గా ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమాలు

Published on Sun, 12/28/2025 - 16:13

ఈ వారం ఓటీటీల్లోకి చాలానే తెలుగు సినిమాలు వచ్చాయి. వాటిలో ఆంధ్ర కింగ్ తాలూకా, బాహుబలి ద ఎపిక్, అష్టదిగ్బంధనం, రివాల్వర్ రీటా తదితర స్ట్రెయిట్ చిత్రాలతో పాటు వృత్త అనే డబ్బింగ్ బొమ్మ,  ఏక్ దివానే కీ దివానియత్ అనే హిందీ మూవీ, స్ట్రేంజర్ థింగ్స్ ఐదో సీజన్ రెండో వాల్యూమ్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇ‍ప్పుడు వీటికి తోడుగా మరో రెండు తెలుగు సినిమాలు సడన్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి.

(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)

అమ్మరాజశేఖర్, ధనరాజ్, చమ్మక్ చంద్ర, సుమన్ శెట్టి తదితరులు నటించిన హారర్ కామెడీ మూవీ 'సుగుణ'. 2024లో రిలీజైంది. కాకపోతే ఎ‍ప్పుడు థియేటర్లలోకి వచ్చి వెళ్లిందనే సరైన సమాచారం లేదు. ఇప్పుడీ మూవీ సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది.

గతేడాది రిలీజైన 'బాగుంది' అనే సినిమా కూడా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతోంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. రామ్ కుమార్ దర్శకుడు కాగా కిశోర్ తేజ, భవ్యశ్రీ, పద్మిని, పద్మజయంతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వీటి ట్రైలర్స్ చూస్తే ఏమంత పెద్ద గొప్పగా లేవు. మరి ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటాయో చూడాలి?

(ఇదీ చదవండి: ఫ్రీగా సినిమాలు చేశా.. అడిగితే ఒక్కరు సపోర్ట్ చేయట్లేదు: సుదీప్)

Videos

పిడుగురాళ్ల CI వేధింపులకు మహిళ ఆత్మహత్యాయత్నం

చిరు, వెంకీ ఊరమస్ స్టెప్స్..!

ఆపరేషన్ సిందూర సమయంలో భారత్ దెబ్బకు పారిపోయి దాక్కున్నాం

హార్ట్ పేషెంట్స్ ఎవ్వరూ లేరు..! కేటీఆర్ కు పొన్నం కౌంటర్

అల్లాడిపోతున్నది అమ్మ మా అనిత.. పేర్నినాని ఊర మాస్ ర్యాగింగ్

ఎవడబ్బ సొమ్మని మా భూమిలోకి వస్తారు.. మీకు చేతనైతే..

ఒక్క బిడ్ రాలేదు.. జగన్ దెబ్బకు బొమ్మ రివర్స్.. పగతో రగిలిపోతున్న చంద్రబాబు

సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విజయ్

సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్

టీడీపీ, జనసేన నేతలే ఛీ కొడుతున్నారు.. అయినా మీకు సిగ్గు రాదు

Photos

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు

+5

ప్రభాస్ ది రాజాసాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ సందడి.. ఫోటోలు

+5

బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మహేశ్ బాబు 'మురారి' క్లైమాక్స్ ఇలా తీశారు (ఫొటోలు)

+5

చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్‌ కర్ణ్‌ శర్మ (ఫొటోలు)