Breaking News

చిరు 'మన శంకర వరప్రసాద్ గారు' విడుదల తేదీ ప్రకటన

Published on Sat, 12/13/2025 - 20:41

చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు'. అనిల్ రావిపూడి దర్శకుడు. సంక్రాంతికి రిలీజ్ అవుతుందని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. అయితే ఏ తేదీన వస్తుందనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తొలుత విడుదల ఎప్పుడనేది అధికారికంగా అనౌన్స్ చేశారు.

(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలిపాట రిలీజ్)

శనివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జనవరి 12న మూవీ థియేటర్లలోకి రానుందని ప్రకటించారు. అలానే దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తమ సినిమా షూటింగ్ నిన్నటితో(డిసెంబరు 12) పూర్తయిందని చెప్పాడు. అందుకే ఇవాళ్టి నుంచి ప్రమోషన్స్ మొదలుపెట్టామని అన్నాడు. నిన్న చిరంజీవిగారితో చివరి వర్కింగ్ డే అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ కాగా వెంకటేశ్ కీలక పాత్ర చేస్తున్నారు. భీమ్స్ సంగీత దర్శకుడు.

సంక్రాంతి బరిలో ఉన్నవాటిలో తొలుత ప్రభాస్ 'రాజాసాబ్' జనవరి 9న రానుంది. దీని తర్వాత చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' జనవరి 12న అంటే సోమవారం రిలీజ్ అవుతుంది. తర్వాత నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' 14వ తేదీన, శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' 14వ తేదీన రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' కూడా పోటీలో ఉందని చెప్పారు గానీ డేట్ మాత్రం ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు.

(ఇదీ చదవండి: రొమాంటిక్ కామెడీ.. ఫీల్ గుడ్ సినిమా.. ఓటీటీ రివ్యూ)

Videos

‘మధ్యలో ఏంటి బాసూ’ గజరాజుకు కోపం వచ్చింది

ఆరు నూరు కాదు.. నూరు ఆరు కాదు.. పెమ్మసానికి అంబటి దిమ్మతిరిగే కౌంటర్

సర్పంచ్ అభ్యర్థుల పరేషాన్

ఇకపై మంచి పాత్రలు చేస్తా

హోటల్ లో టమాటా సాస్ తింటున్నారా జాగ్రత్త!

ఘరానా మోసం.. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ.. 25 కోట్లు గోల్ మాల్

నేనింతే.. అదో టైప్.. నిజం చెప్పను.. అబద్దాలు ఆపను..

టెండర్లలో గోల్ మాల్.. కి.మీ.కు ₹180 కోట్లు !

మూసాపేట్ లో నవ వధువు ఆత్మహత్య

కోల్ కతాలో హైటెన్షన్.. స్టేడియం తుక్కు తుక్కు

Photos

+5

మెస్సీ మ్యాచ్‌.. ఫ్యాన్స్‌ జోష్‌! (ఫొటోలు)

+5

18 ఏళ్లుగా బెస్ట్ ఫ్రెండ్ 10 ఏళ్లుగా హస్బెండ్.. రోహిత్-రితిక పెళ్లిరోజు (ఫొటోలు)

+5

మ్యాచ్ ఆడ‌కుండానే వెళ్లిపోయిన మెస్సీ.. స్టేడియంలో ఫ్యాన్స్ ర‌చ్చ‌ (ఫోటోలు)

+5

రజనీకాంత్ బర్త్ డే.. వింటేజ్ జ్ఞాపకాలు షేర్ చేసిన సుమలత (ఫొటోలు)

+5

గ్లామరస్ మెరుపు తీగలా యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

చీరలో ట్రెడిషనల్‌ లుక్‌లో అనసూయ.. ఫోటోలు వైరల్‌

+5

కోల్‌కతాలో మెస్సీ మాయ‌.. (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ (ఫొటోలు)

+5

#RekhaNirosha : నటి రేఖా నిరోషా బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

ఇంద్రకీలాద్రి : రెండో రోజు దుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్ష విరమణలు (ఫొటోలు)