పాకిస్థాన్ కు డిజిటల్ షాక్... హ్యాక్ అవుతున్న ప్రభుత్వ వెబ్ సైట్లు
Breaking News
చెత్త రీల్స్ ఒక్కచోట చేర్చితే డ్యూడ్.. దర్శకుడి రిప్లై ఇదే!
Published on Sat, 11/22/2025 - 15:43
దీపావళికి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సినిమా డ్యూడ్ (Dude Movie). ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమాపై భిన్నాభిప్రాయాలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఏకంగా రూ.100 కోట్లు రాబట్టింది. ఈ చిత్రంతోనే కీర్తిశ్వరన్ అనే యువకుడు దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇటీవల ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోకి అందుబాటులోకి వచ్చింది.
అది నార్మల్ కాదు
దీంతో ఓటీటీలో సినిమా చూసిన జనాలు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఒక ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా సినిమా గురించి నేరుగా దర్శకుడికే మెసేజ్ చేసింది. బ్రో.. మీ ఇంటర్వ్యూ క్లిక్ కూడా చూశాను. మమిత మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేసే సన్నివేశాన్ని నార్మలైజ్ చేశారు. అలాంటివి చాలా మామూలు విషయం అన్నట్లు చూపించకండి.
చెత్త రీల్స్
నిజమైన స్నేహితులెప్పుడూ అలా మాట్లాడుకోరు. సినిమా మొత్తం అర్థంపర్థం లేకుండా ఉంది. సన్నివేశాల మధ్య కనెక్షన్ మిస్ అయింది. చెత్త రీల్స్‌ను ఒకచోట చేర్చినట్లుగా ఉంది. ఇకనుంచైనా కాస్త మంచి సినిమాలు తీయు అని సలహాచ్చింది. దీనికి కీర్తిశ్వరన్ స్పందిస్తూ... నాకు మెసేజ్‌లు చేసే బదులు నీ బతుకేదో నువ్వు చూసుకో.. అని వెటకారంగా బదులిచ్చాడు.
విమర్శించే హక్కు
ఈ చాటింగ్‌ను స్క్రీన్‌షాట్ తీసిన ఇన్‌ఫ్లుయెన్సర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. డ్యూడ్ సినిమాతో పాటు దర్శకుడి ఇంటర్వ్యూ క్లిప్ చూశాను. నా జేబులో నుంచి డబ్బు ఖర్చు పెట్టి మరీ సినిమా చూసినప్పుడు దాన్ని విమర్శించే హక్కు నాకుంది. నా అభిప్రాయాన్ని దర్శకుడితో పంచుకున్నాను. కొత్త డైరెక్టర్.. నా విమర్శను స్వీకరిస్తాడనుకున్నాను.. కానీ, ఇదిగో ఇలా రిప్లై ఇచ్చాడు.
దమ్ము లేదు
ఇక్కడే అతడి మైండ్‌సెట్ ఏంటో తెలిసిపోతుంది. ఫీడ్‌బ్యాక్‌ను తీసుకునే దమ్ము లేదని రుజువవుతోంది అని రాసుకొచ్చింది. ఈ వ్యవహారంపై నెటిజన్లు భిన్నవిధాలుగా స్పందిస్తున్నారు. డ్యూడ్ సినిమా ప్రదీప్‌తో కాకుండా వేరే హీరోతో చేసుంటే కచ్చితంగా ఫ్లాప్ అయ్యేది.. విమర్శలు తీసుకోవడం కూడా రావాలని దర్శకుడిని మందలిస్తున్నారు. మెజారిటీ జనాలు మాత్రం.. ఇది సినిమానా? చెత్త రీల్స్ అన్ని కలగలిసినట్లుగా ఉందని నానామాటలు అంటే ఇలాగే స్పందిస్తారని దర్శకుడిని వెనకేసుకొస్తున్నారు.
Dude Director “ Keerthishwaran “ reply to a influencer question about the worst scene in movie. It’s just a Audacity way of response :( pic.twitter.com/EdQKaI50eI
— Kolly Censor (@KollyCensor) November 21, 2025
చదవండి: చెల్లి పెళ్లయిన మూడున్నరేండ్లకు.. బుల్లితెర నటి ఎంగేజ్‌మెంట్
Tags : 1