Breaking News

ఓటీటీలో లేటెస్ట్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Published on Sat, 11/22/2025 - 12:53

తమిళ హీరో విష్ణు విశాల్‌ (Vishnu Vishal) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆర్యన్‌ (Aaryan Movie). తెలుగమ్మాయి మానస చౌదరి హీరోయిన్‌గా నటించింది. శ్రద్ధా శ్రీనాథ్‌ కీలక పాత్ర పోషించింది. ప్రవీణ్‌.కె దర్శకత్వం వహించిన ఈ ఇన్వెస్టిగేటివ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ అక్టోబర్‌ 21న విడుదలైంది. ఈ చిత్రాన్ని హీరో నితిన్‌ తండ్రి, నిర్మాత సుధాకర్‌ రెడ్డి తెలుగులో రిలీజ్‌ చేశారు. 

ఓటీటీలో ఆర్యన్‌
వారం ఆలస్యంగా నవంబర్‌ 7న తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. సినిమాకు టాక్‌ బాగున్నప్పటికీ కలెక్షన్స్‌ మాత్రం పెద్దగా రాలేదు. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది. నవంబర్‌ 28న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఆర్యన్‌ అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్‌ అయినవారు ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు!

కథేంటంటే?
ఆత్రేయ (సెల్వ రాఘవన్‌) అనే వ్యక్తి ఓ న్యూస్‌ ఛానెల్‌కి వెళ్తాడు. తాను ఫెయిల్యూర్‌ రచయితనని చెప్తూ రాబోయే ఐదు రోజుల్లో ఐదు హత్యలు చేస్తానని చెప్తాడు. అంతలోనే గన్‌తో కాల్చుకుని చనిపోతాడు. ఈ కేసును పోలీసు అధికారి నంది (విష్ణు విశాల్‌)కి అప్పగిస్తారు. ఆత్రేయ బతికి లేకపోయినా హత్యలు జరుగుతుంటాయి? అదెలా సాధ్యం? అన్నది తెలియాలంటే ఓటీటీలో ఆర్యన్‌ చూడాల్సిందే!

 

 

చదవండి: నిన్ను ఒక్కసారి ముట్టుకోవచ్చా?

Videos

పాకిస్థాన్ కు డిజిటల్ షాక్... హ్యాక్ అవుతున్న ప్రభుత్వ వెబ్ సైట్లు

Varudu: అయ్యో..ఏపీకి చివరి ర్యాంక్..! పోలీసుల పరువు తీసిన అనిత

తెలంగాణ DGP ముందు లొంగిపోనున్న మావోయిస్టు అగ్రనేతలు

జమ్మలమడుగులో ఎవరికి టికెట్ ఇచ్చినా YSRCPని గెలిపిస్తాం: సుధీర్రెడ్డి

టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డికి మాజీ మంత్రి కాకాణి సవాల్

Baba Vanga: మరి కొన్ని రోజుల్లో మరో తీవ్ర సౌర తుఫాను

మావోయిస్టు నేత హిడ్మా ఎన్ కౌంటర్ తరువాత బాడ్సె దేవాపై పోలీసుల ఫోకస్

Chittoor: ATM నగదు చోరీ కేసు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

ఏపీ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా

తెలంగాణ పంచాయతీరాజ్ జీవో విడుదల

Photos

+5

ప్రీమియర్ నైట్.. అందంగా ముస్తాబైన రాశీ ఖన్నా (ఫొటోలు)

+5

తెలుగు యాక్టర్స్ జోడీ మాలధారణ.. పుణ్యక్షేత్రాల సందర్శన (ఫొటోలు)

+5

‘3 రోజెస్’ సీజన్ 2 టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ HD మూవీ స్టిల్స్

+5

హైదరాబాద్ లో శబరిమల అయ్యప్ప ఆలయం..ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ చిత్రం సక్సెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

తెలంగాణ బిడ్డగా మెప్పించిన గోదావరి అమ్మాయి (ఫోటోలు)

+5

బాలయ్య ‘అఖండ-2 ’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హైటెక్స్ లో 'తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్' చిత్రోత్సవం (ఫొటోలు)

+5

వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)