Breaking News

శబరిమల యాత్రికుల భద్రతపై..కేరళ ప్రధాన కార్యదర్శికి లేఖ..

Published on Fri, 11/21/2025 - 13:56

శబరిమలలో భక్తుల భద్రతను నిర్థారించాలని కోరుతూ కేరళ ప్రధాన కార్యదర్శికి కర్ణాటక ప్రభుత్వం లేఖ పంపింది.  శబరిమల వచ్చే భక్తులకు తగిన భద్రత,రవాణా సౌకర్యాలు కల్పించాలని లేఖలో పేర్కొంది. లక్షలాదిమంది అయ్యప్ప భక్తులు కర్ణాటకకు వస్తున్నారని, అందువల్ల వారి భద్రత కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని కర్ణాట ప్రభుత్వం లేఖలో కోరింది. ఈ లేఖను కర్ణాటక కార్యదర్శి కేరళ ప్రధాన కార్యదర్శికి పంపారు. 

ఇదిలా ఉండగా, శబరిమల యాత్ర నిమిత్తమై దేవస్వం బోర్డుభక్తులకు ఎలాంటి ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించ లేదంటూ అఖిల భారతీయ అయ్యప్ప సేవా సంఘం విమర్శలు ఎక్కుపెట్టింది. అంతేగాదు భక్తుల భద్రతా విషయమై ముందస్తుగా ఎలాంటి ఏర్పాట్లు చేయలేపోయిందని దేవస్వం బోర్డుపై ధ్వజమెత్తింది. 

గతంలో అఖిల కేరళ అయ్యప్ప సేవా సంఘం దాదాపు 4 వేల మంది వాలంటీర్లతో శబరిమలలో తాగునీరు, ఉచిత ఆహారం ఇతర సేవలను అందించింది. అయితే, దేవస్వం బోర్డు కోర్టును ఆశ్రయించిన తర్వాత రెండేళ్లుగా ఇది నిలిపేశారు. అవినీతికి మార్గం సుగమం చేయడానికి అయ్యప్ప సేవా సంఘాన్ని అక్కడి నుంచి బహిష్కరించాలని కొంతమంది దేవస్వం బోర్డు అధికారులు కోర్టును ఆశ్రయించారని వాదనలు కూడా వినిపించాయి. అయితే అఖిల భారతీయ అయ్యప్ప సేవా సంఘం మాత్రం అవకాశం ఇస్తే..ఇప్పుడైనా అన్ని సేవలను ఉచితంగా అందిస్తామని పేర్కొనడం గమనార్హం.

(చదవండి: శబరిమలలో భక్తుల రద్దీ దృష్ట్యా..రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం..)

 

Videos

పాకిస్థాన్ కు డిజిటల్ షాక్... హ్యాక్ అవుతున్న ప్రభుత్వ వెబ్ సైట్లు

Varudu: అయ్యో..ఏపీకి చివరి ర్యాంక్..! పోలీసుల పరువు తీసిన అనిత

తెలంగాణ DGP ముందు లొంగిపోనున్న మావోయిస్టు అగ్రనేతలు

జమ్మలమడుగులో ఎవరికి టికెట్ ఇచ్చినా YSRCPని గెలిపిస్తాం: సుధీర్రెడ్డి

టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డికి మాజీ మంత్రి కాకాణి సవాల్

Baba Vanga: మరి కొన్ని రోజుల్లో మరో తీవ్ర సౌర తుఫాను

మావోయిస్టు నేత హిడ్మా ఎన్ కౌంటర్ తరువాత బాడ్సె దేవాపై పోలీసుల ఫోకస్

Chittoor: ATM నగదు చోరీ కేసు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

ఏపీ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా

తెలంగాణ పంచాయతీరాజ్ జీవో విడుదల

Photos

+5

ప్రీమియర్ నైట్.. అందంగా ముస్తాబైన రాశీ ఖన్నా (ఫొటోలు)

+5

తెలుగు యాక్టర్స్ జోడీ మాలధారణ.. పుణ్యక్షేత్రాల సందర్శన (ఫొటోలు)

+5

‘3 రోజెస్’ సీజన్ 2 టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ HD మూవీ స్టిల్స్

+5

హైదరాబాద్ లో శబరిమల అయ్యప్ప ఆలయం..ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ చిత్రం సక్సెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

తెలంగాణ బిడ్డగా మెప్పించిన గోదావరి అమ్మాయి (ఫోటోలు)

+5

బాలయ్య ‘అఖండ-2 ’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హైటెక్స్ లో 'తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్' చిత్రోత్సవం (ఫొటోలు)

+5

వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)