Breaking News

రవితేజతో సమంత.. ఓ క్రైమ్ థ్రిల్లర్!

Published on Mon, 11/17/2025 - 17:20

ఫలితంతో సంబంధం లేకుండా వరస సినిమాలు చేసే టాలీవుడ్ హీరో రవితేజ.. కొన్నిరోజుల క్రితమే 'మాస్ జాతర'తో వచ్చాడు. కంటెంట్ మరీ తీసికట్టుగా ఉండేసరికి బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. ప్రస్తుతం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే ఫ్యామిలీ మూవీ చేస్తున్నాడు. ఇది సంక్రాంతికి రిలీజ్ కానుంది. రీసెంట్‍గానే గ్లింప్స్ వీడియో రిలీజ్ చేయగా.. ఈసారి హిట్ కొట్టేలా ఉన్నాడనిపిస్తుంది.

ఇప్పుడు రవితేజ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్‌గా సమంతని తీసుకోబోతున్నారనే రూమర్ తెగ వైరల్ అవుతోంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం టాలీవుడ్‌లో ఇది ఫ్రెష్ కాంబో అవుతుంది. ఇకపోతే ఈ ప్రాజెక్టుకు 'నిన్ను కోరి', 'మజిలీ' ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తారని అంటున్నారు.

(ఇదీ చదవండి: 'ఐ బొమ్మ' క్లోజ్.. మరి మిగతా వాటి సంగతి?)

శివ నిర్వాణ సినిమాలు అనగానే దాదాపు ఫ్యామిలీ సబ్జెక్టులే గుర్తొస్తాయి. చివరగా తీసిన 'ఖుషి' లవ్ స్టోరీనే. అందులో హీరోయిన్ సమంతనే. అయితే శివ ఈసారి ఓ క్రైమ్ థ్రిల్లర్ కథ రాసుకున్నాడని.. దీనికి రవితేజ ఓకే చెప్పారని తెలుస్తోంది. ఇప్పుడు సమంత హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయిందని అంటున్నారు. ఈ నెలలోనే లాంచ్ ఉండొచ్చని టాక్.

ఈ మధ్యే సమంత.. 'మా ఇంటి బంగారం' అనే సినిమా మొదలుపెట్టింది. హీరోయిన్ కమ్ నిర్మాత ఈమెనే. నందినీ రెడ్డి దర్శకురాలు. ఇ‍‍ప్పుడు రవితేజతోనూ మూవీ చేయనుందని టాక్ వచ్చిందంటే.. హీరోయిన్‍‌గా చేసేందుకు ఆసక్తి చూపిస్తుందనమాట. మరి వస్తున్న పుకార్లలో నిజమెంత అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

Videos

ఢిల్లీ ఉగ్రదాడి కేసులో వీడని మిస్టరీ ఆ మూడు బుల్లెట్లు ఎక్కడివి?

TS: ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు

Saudi Bus : మృతుల కుటుంబాలకు రూ .5 లక్షల చొప్పు న పరిహారం

సౌదీ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి

Kurnool: తగలబడ్డ లారీ తప్పిన పెను ప్రమాదం

BIG BREAKING : షేక్ హసీనాకు మరణశిక్ష

Sabarimala; వైఎస్ జగన్ ఫొటోతో స్వాముల యాత్ర

హిందూపురంలో వైఎస్ఆర్సీపీ ఆఫీస్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసనలు

కోర్టు ధిక్కర పిటిషన్‌పై తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

ఐ బొమ్మ వెబ్సైట్ నుంచి మెసేజ్ రిలీజ్

Photos

+5

చిన్నశేష వాహనంపై పరమ వాసుదేవుడు అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి అభ‌యం

+5

బ్లాక్ లెహంగాలో రాణిలా మిస్ ఇండియా మానికా విశ్వకర్మ..!

+5

తిరుప‌తిలో పుష్ప, శిల్పకళా ప్రదర్శన

+5

సీపీ సజ్జనార్‌ను కలిసిన టాలీవుడ్‌ ప్రముఖులు.. ఫోటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ స్టార్స్ (ఫొటోలు)

+5

రింగుల జుట్టు పోరి.. అనుపమ లేటెస్ట్ (ఫొటోలు)

+5

కుమారుడు, సతీమణితో 'కిరణ్‌ అబ్బవరం' టూర్‌ (ఫోటోలు)

+5

విజయవాడ : భవానీ ద్వీపంలో సందడే సందడి (ఫొటోలు)

+5

రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

కార్తీక మాసం చివరి సోమవారం..ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు (ఫొటోలు)