ఢిల్లీ ఉగ్రదాడి కేసులో వీడని మిస్టరీ ఆ మూడు బుల్లెట్లు ఎక్కడివి?
Breaking News
నన్ను తొక్కుతూనే ఉన్నావ్.. రీతూ ఫ్రస్టేషన్
Published on Mon, 11/17/2025 - 15:33
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)లో ఫైర్ స్ట్రామ్స్ అంటూ వచ్చిన ఆరుగురు వరుసగా ఎలిమినేట్ అయ్యారు. వీరికంటే ముందు వైల్డ్‌కార్డ్‌గా వచ్చిన దివ్య మాత్రం ఎలాగోలా నెట్టుకొస్తోంది. కానీ, ఈవారం ఆమెకు కష్టకాలంలాగే కనిపిస్తోంది. నేడు హౌస్‌లో నామినేషన్స్ జరగనున్నాయి. ఈ మేరకు రెండో ప్రోమో వదిలారు.
అన్నీ రివేంజ్ నామినేషన్స్
ఇందులో భరణి.. తాను బాగా ఆడలేదన్న ఇమ్మాన్యుయేల్‌ను నామినేట్ చేశాడు. టెడ్డీ బేర్ టాస్క్‌లో ప్రతి రౌండ్‌లో నువ్వు నాకంటే వెనకే ఉన్నావ్.. అని గుర్తు చేశాడు. కల్యాణ్ కూడా అదే పని చేశాడు. తనను నామినేట్ చేసిన పవన్ (Demon Pavan)ను తిరిగి నామినేట్ చేశాడు. ఇక రీతూ.. దివ్యను నామినేట్ చేసింది. నేను ఈ గేమ్‌లో గెల్చాను. నేను ఇందులో సూపర్.. అందులో సూపర్.. కానీ ఆమె ఏ గేమ్‌లో గెల్చింది? అంటూ నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నావ్ అంది.
రీతూ వర్సెస్ దివ్య
నీకంటే నేను ఎందుకు బెటరో చెప్తాను.. నీకు టాస్క్ అర్థమే కాదు. అలాంటిది నువ్వు గేమ్స్ గురించి మాట్లాడుతున్నావా? అని దివ్య ఇచ్చిపడేసింది. తర్వాత దివ్య రీతూని నామినేట్ చేసింది. ఈక్రమంలో 'ఇంకా ఎంతకాలం నన్ను తొక్కుతావ్?' అని రీతూ అసహనం వ్యక్తం చేసింది. మొత్తానికి ఈ వారం సంజన, దివ్య, పవన్, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, భరణి నామినేషన్స్‌లో ఉన్నారు.
డేంజర్ జోన్‌లో దివ్య
వీరిలో కల్యాణ్, ఇమ్మూలకు ఓట్లు భారీగా పడతాయి. అందులో డౌటే లేదు. పవన్, భరణి, సంజనకి కూడా ఈ మధ్యకాలంలో నెగెటివిటీ లేదు కాబట్టి కాస్త సేఫ్ జోన్‌లో ఉన్నారు. గత రెండు వారాలుగా దివ్య ఎక్కువ నెగెటివ్ అవుతూ వస్తోంది. ఈ వారం కూడా ఆ నెగెటివిటీ పాజిటివిటీగా మారకపోతే తను వెళ్లిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఫ్యామిలీ వీక్ కోసం సంజనాను ఇంతవరకు తీసుకొచ్చారు. ఈ వారం ఆ అవసరం తీరిందని ఆమెను పంపించేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
చదవండి: పుష్పను కాపీ కొట్టలేదు: మలయాళం హీరో
Tags : 1