Breaking News

'బిగ్‌బాస్‌'కే చుక్కలు చూపుతున్న కంటెస్టెంట్స్‌.. అందరూ నామినేట్‌

Published on Tue, 11/11/2025 - 10:46

బిగ్‌బాస్ సీజన్-9లో పదో వారం నామినేషన్స్ పూర్తి అయ్యాయి. సీజన్‌ కూడా అయిపోవస్తుంది. కానీ, హౌస్‌లోని కంటెస్టెంట్స్‌ మాత్రం నామినేషన్‌లో కూడా చెత్త పాయింట్లతోనే ముగించేశారు. దీంతో బిగ్‌బాస్‌కు కూడా చిరాకు అనిపించినట్లుంది. హౌస్‌లో వారి ఆటకు తిక్కరేగిన బిగ్‌బాస్ సూపర్ ట్విస్ట్‌తో అందరికీ షాకిస్తూ.. కెప్టెన్‌ ఇమ్మాన్యుయేల్ మినహా ఈ వారం అందరినీ ఎలిమినేషన్‌లో నిలబెట్టాడు.  9 వారాలుగా ఇమ్ము ఎలిమినేషన్‌లో లేడంటూ రీసెంట్‌ ఎపిసోడ్‌లో నాగార్జున గుర్తుచేశారు. ఇదే క్రమంలో అతన్ని నామినేషన్‌లో పెట్టమని పరోక్షంగా బిగ్‌బాస్‌ రంగంలోకి దిగి ఛాన్స్‌ ఇస్తే దానిని కూడా హౌస్‌లో ఎవరూ ఉపయోగించుకోలేదు. ఇలా చెత్తగా నామినేషన్‌ ప్రక్రియను ముగించేశారు. 

తనూజ కోసం భరణి అంటూ ఇమ్మూ ఫైర్‌
బిగ్‌బాస్ హౌస్‌లో ఆరు వారాల ఆట మాత్రమే ఉంది. ప్రస్తుతం హౌస్‌లో 11మంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఒక్కరిని మాత్రమే నామినేట్ చేయాలని.. అందుకోసం ఐదు నిమిషాల టైమ్‌ లిమిట్‌ ఇచ్చాడు.  నామినేట్ అయిన వారు అక్కడొక కుర్చీలో కూర్చుంటే బురదనీళ్లు వచ్చి వారి మీద పడుతాయి. మొదట ఇమ్మాన్యుయేల్ నామినేషన్‌ ప్రక్రియ మొదలుపెడుతాడు.   భరణిని నామినేట్‌ చేస్తూ.. కెప్టెన్సీ టాస్క్‌లో మీరు తనూజ కోసం గివప్ చేయడం నచ్చలేదనే పాయింట్‌ తెరపైకి తెస్తాడు. మీకంటే తనూజనే బెస్ట్ ప్లేయర్ అని ఒప్పుకోవడం ఏంటి అంటూ భరణిని ప్రశ్నిస్తాడు.  ఈసారి కొత్త భరణిని చూస్తారన్నారని రీఎంట్రీ ఇచ్చారు. కానీ, రోజురోజుకి ఆ ఫైర్ కనిపించడంలేదంటూ ఇమ్మూ ఫైర్‌ అవుతాడు. అయితే, భరణి సరైన సమాధానాలు చెప్పలేకపోయాడు. అయితే, ఎక్కువ మంది గౌరవ్‌, నిఖిల్‌ను నామినేషన్‌ చేస్తూ సేఫ్‌ గేమ్‌ ఆడారు.

దివ్యను నామినేషన్‌ చేసిన భరణి
ఈ వారం నామినేషన్‌లో ప్రత్యేకత ఏదైనా ఉందంటే.. దివ్యను భరణి నామినేట్‌ చేయడమని చెప్పాలి. ఈ క్రమంలో భరణి ఇలా చెప్తాడు. 'నా గేమ్ నీ వల్ల పాడవ్వలేదు.. నేను నీ వల్ల హౌస్‌ నుంచి బయటికి వెళ్లలేదనేది నాకు మాత్రమే తెలుసు. కానీ, హౌస్‌మేట్స్‌ మాత్రం దివ్య వల్లనే భరణి వెళ్లారు అనుకుంటున్నారు. అది తప్పని ప్రూ చేయాల్సిన బాధ్యత నీపైన కూడా ఉంది కదా.. కాబట్టి నువ్వు నామినేషన్‌కి వెళ్లి సేఫ్‌గా వచ్చి  ప్రూ చేసుకో..' అంటూ భరణి చెప్పాడు.  దీంతో దివ్య కౌంటర్‌ గట్టిగానే ఇస్తుంది. నా వల్ల మీ గేమ్ పాడైందా..? ఇది ఏ రకమైన కారణం..? అంటూ భరణిపై విరుచుకుపడింది. నా వల్ల మీరు హౌస్‌ నుంచి వెళ్లిపోలేదనే విషయంలో మీకు క్లారిటీ  ఉన్నప్పుడు నన్ను ఎందుకు నామినేట్‌ చేస్తున్నారు. మీరు వెళ్లిపోయింది నా వల్లే అని ఎవరూ అనలేదు బాండింగ్స్‌లో నేను ఒక్కదాన్నే ఉన్నానా.. అని దివ్య ఫైర్ అయింది. ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్దం గట్టిగానే నడిచింది.

భరణి మాత్రమే ప్రత్యేకం
నామినేషన్స్ తంతు ముగిసిన తర్వాత బిగ్ బాస్ ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తూ..  ఈ వారం హౌస్‌లో ఉన్న ప్రతి ఒక్కరినీ  నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే, కెప్టెన్ ఇమ్మాన్యుయేల్‌కి మినహాయింపు ఇవ్వాలా, వద్దా  అనేది సీక్రెట్ ఓటింగ్‌తో  నిర్ణయించమని కోరుతాడు. అప్పటికీ కూడా ఎవరూ ఇమ్మూను నామినేట్‌ చేయలేదు. కేవలం భరణి మాత్రమే ఇమ్మాన్యుయేల్‌ను నామినేషన్‌లో ఉంచాలని ఓట్‌ వేస్తాడు. మిగిలిన అందరూ ఇమ్మూకు మద్దతు తెలుపుతూ నామినేషన్స్‌ నుంచి తప్పిస్తారు. దీంతో  ఈ వారం ఇమ్మాన్యుయేల్‌ను మినహాయించి హౌస్‌లో ఉన్న  అందరూ నామినేషన్‌ లిస్ట్‌లోకి వచ్చారు.
 

Videos

అజిత్ దోవల్ తో మోదీ భేటీ.. టెర్రరిస్టులకు బిగ్ వార్నింగ్

మొయినుద్దీన్ విచారణలో బయటపడ్డ సంచలన నిజాలు

నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం

Red Fort: ప్రధాన నగరాల్లో హైఅలర్ట్ జారీ చేసిన కేంద్రం

సనాతన ధర్మం అంటూ పవన్ డబుల్ యాక్షన్

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం బాబు Vs జగన్ మధ్య తేడా ఇదే..

మహిళపై టీచర్ అత్యాచార యత్నం

తిరుపతిలో అయ్యప్ప భక్తులకు అవమానం

విలన్ గా ఉపేంద్ర... సౌత్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాక్..!

YSRCP నేత ఓబుల్ రెడ్డిపై హత్యాయత్నం

Photos

+5

'గత వైభవం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు (ఫొటోలు)

+5

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. ఓటేసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

ఢిల్లీ ఎర్రకోట సిగ్నల్‌ వద్ద భారీ పేలుడు (చిత్రాలు)

+5

తెలుగమ్మాయి ఆనంది గ్లామరస్ ఫొటోలు

+5

కిదాంబి శ్రీకాంత్-శ్రావ్య వర్మ పెళ్లిరోజు స్పెషల్ (ఫొటోలు)

+5

నాథ్‌ద్వారా కృష్ణుడి ఆలయంలో ముకేశ్‌ అంబానీ (ఫొటోలు)

+5

నా హ్యాపీ బర్త్‌డే.. ప్రేయసికి పృథ్వీ షా థాంక్స్‌ (ఫొటోలు)

+5

Ande Sri: ప్రజాకవి అందెశ్రీ అరుదైన (ఫొటోలు)