ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు

Published on Sat, 11/08/2025 - 21:25

ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా అలానే బ్యాడ్ గర్ల్, చిరంజీవ, కిస్, మిత్రమండలి, బారాముల్లా తదితర తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ బొమ్మలు.. డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు జారన్ అనే సినిమా తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలోకి వచ్చేసింది. వీటితోపాటు ఇప్పుడు మరో రెండు తెలుగు చిత్రాలు కూడా అందుబాటులోకి వచ్చేశాయి.

(ఇదీ చదవండి: సౌండ్‌తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ)

కొన్నాళ్ల క్రితం తమిళంలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రం హౌస్‌మేట్స్. జీ5లో అందుబాటులో ఉండేది. ఇప్పటివరకు తమిళంలో మాత్రమే ఉండగా.. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ కూడా తీసుకొచ్చినట్లు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దెయ్యమే లేకుండా ఈ హారర్ సినిమా తీయడం విశేషం. ఒకే అపార్ట్‌మెంట్‌లో రెండు వేర్వేరు కాలాల్లో రెండు కుటుంబాలు ఉంటాయి. దీంతో ఒకరి గురించి మరొకరు తెలుసుకుని భయపడతారు. చివరకు ఏమైందనేదే స్టోరీ.

మరోవైపు 2023 అక్టోబరులో రిలీజైన 'ధీమహి' అనే తెలుగు సినిమా.. దాదాపు రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ విషయానికొస్తే.. అమెరికాలో సర్జన్‌గా కార్తీక్(సాహస్) పనిచేస్తుంటాడు. ఇతడికి మేనకోడలు ధీమహి అలియాస్ మహి(ఆషిక పగడాల) అంటే పంచప్రాణాలు. కొన్నిరోజులకు మహి అనూహ్యంగా కిడ్నాప్ అవుతుంది. తర్వాత చంపేస్తారు కూడా. మేనకోడలు చావుకి తానే కారణమని బాధపడే కార్తీక్.. నెక్రోమాన్సీ అనే పద్దతితో ఆమె ఆత్మతో మాట్లాడి ఆమె మరణానికి కారణమైన వ్యక్తిని చంపాలని అనుకుంటాడు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: రష్మిక 'గర్ల్‌ఫ్రెండ్' కలెక్షన్స్ ఎంత? మరి మిగతా సినిమాలకు)

Videos

సాక్షి సాక్షిగా.. నాగార్జునకు ఇచ్చే వెళ్తా..!

పశువులను చంపి.. పిఠాపురంలో నకిలీ నెయ్యి కలకలం

జోగి రమేష్ త్వరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తారు

న్యాయం అడిగితే కేసులు పెడతారా ? అండగా ఉన్న అందరికీ ధన్యవాదాలు

ఏపీలో ఫ్రీ బస్సు పథకానికి మంగళం?

ఇదీ నా కాలే.. అదీ నా కాలే.. లైవ్ లో ఇచ్చిపడేసిన RGV

జల్సా టైటిల్ కరెక్ట్ గా సరిపోద్ది.. అధికారం ఏపీలో కానీ..

ప్రభుత్వ వైద్యానికి చంద్రగ్రహణం

చేపల వర్షం..ఇదేందయ్యా, ఇది!

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు

Photos

+5

చీరలో కిక్‌ ఇచ్చే ఫోజులతో బిగ్‌బాస్‌ 'అశ్విని శ్రీ ' (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : పెట్‌ షో అదరహో (ఫొటోలు)

+5

అను ఇమ్మాన్యుయేల్ 'ద గర్ల్‌ఫ్రెండ్' జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ పెళ్లిలో అనన్య సందడే సందడి (ఫొటోలు)

+5

'జగద్ధాత్రి' సీరియల్ హీరోయిన్ దీప్తి పెళ్లి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రోజా, ప్రియ (ఫోటోలు)

+5

వీకెండ్‌ స్పెషల్‌.. హైదరాబాద్‌ సమీపంలోని బెస్ట్‌ పిక్నిక్ స్పాట్‌లు (ఫొటోలు)

+5

రష్మికా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టీమిండియా టీ20 మ్యాచ్‌లో కాజల్ అగర్వాల్ సందడి (ఫొటోలు)

+5

ముద్దమందారం అంతా క్యూట్‌గా బ్రిగిడ (ఫొటోలు)