Breaking News

అమెరికా టెక్ కంపెనీలపై నిషేధం విధిస్తే..

Published on Thu, 11/06/2025 - 14:55

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో సర్వీసులు అందిస్తున్న యూఎస్‌ టెక్నాలజీ కంపెనీలపై నిషేధం విధించే అవకాశం ఉందనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో వ్యాపార వర్గాలు, టెక్ నిపుణుల్లో ఆందోళన మొదలైంది. ఈ ముప్పును దృష్టిలో ఉంచుకుని భారతదేశం తన సాంకేతిక స్వావలంబన (టెక్ రెసిలెన్స్)ను బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని ఆర్‌పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా, జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు నొక్కి చెప్పారు.

ఆర్‌పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లోని వివరాల ప్రకారం.. ‘అమెరికా టెక్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించకుండా ట్రంప్ ఇండియాలో ఎక్స్, గూగుల్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ చాట్‌జీపీటీ వంటి వాటిని నిషేధిస్తే.. పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించండి. దీనికన్నా భయంకరమైంది లేదు! ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌కు ప్లాన్ బీ ఏమిటో ఆలోచించండి’ అని తెలిపారు. గోయెంకా అభిప్రాయాన్ని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు సమర్థిస్తూ ‘నేను అంగీకరిస్తున్నాను. మనం అప్లికేషన్‌ స్థాయికి మించి అధికంగా టెక్నాలజీపై ఆధారపడుతున్నాం. ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, చిప్స్, ఫ్యాబ్స్.. అన్ని విభాగాల్లో యూఎస్‌ టెక్నాలజీపై ఆధారపడడం పెరుగుతోంది. దీని పరిష్కరించాలంటే 10 సంవత్సరాల నేషనల్ మిషన్ ఫర్ టెక్ రెసిలెన్స్ అవసరం’ అని చెప్పారు.

గోయెంకా పోస్ట్‌పై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వచ్చాయి. భారత్‌ నుంచి అమెరికా టెక్ కంపెనీలు అగ్రశ్రేణి ప్రతిభను ఆకర్షించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ సమస్యను కేవలం యాప్‌లపై ఆధారపడటంలా కాకుండా టాలెంట్‌ సప్లై చైన్‌గా చూడాలని ఒక యూజర్‌ అన్నారు. మరో యూజర్‌.. ట్రంప్ భారతదేశం వంటి పెద్ద టెక్ మార్కెట్‌పై ఆంక్షలు విధించేంత మూర్ఖుడు కాదని, ఇది జరిగే అవకాశం లేదన్నాడు.

ఇదీ చదవండి: మస్క్‌లాంటి వారు మాత్రమే సంపన్నులవుతారు!

Videos

న్యూయార్క్ ప్రజలు పారిపోవాల్సిందే.. ట్రంప్ బెదిరింపులు

YS Jagan: క్రెడిట్ చోర్ చంద్రబాబు

CBI చేతికి నకిలీ మద్యం కేసు.. AP డీజీపీకి హై కోర్టు నోటీసులు

Diabetes Care: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్

Sakshi Special: జయహో జగనన్న YSRCP చారిత్రక విజయానికి తొలి మెట్టు..

Garam Garam Varthalu: ఈ లీడర్ చేసిన డ్యాన్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

పులి కాదు, సింహం కాదు పరేషాన్ చేస్తున్న ఆఫ్రికన్ నత్తలు

Karumuri Venkat: మొగుడు పెళ్ళాం మధ్యలో నీకేంటి పని.. TV5 బ్రోకర్ మూర్తి నోరు జాగ్రత్త..

Gudivada: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు

యువతకు జగన్ మెసేజ్.. మీరంతా జెన్-Z తరంలో ఉన్నారు

Photos

+5

ఎన్నికల వేళ అరుదైన చిత్రాలు.. బిహార్‌ ఓటర్ల ప్రత్యేక (ఫొటోలు)

+5

#KotiDeepotsavam : ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విష్ణు విశాల్‌ ’ఆర్యన్‌‘ మూవీ ప్రీ రిలీజ్‌ (ఫొటోలు)

+5

ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు (ఫొటోలు)

+5

రష్మికా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన నారా రోహిత్ (ఫోటోలు)

+5

తిరుమలలో బుల్లితెర నటుడు ప్రభాకర్‌ (ఫోటోలు)

+5

వేయి స్తంభాల దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు (ఫోటోలు)

+5

జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు.. సింగర్‌ ఎమోషనల్‌ (ఫోటోలు)