Breaking News

తమన్నా లాంటి భార్య దొరికిందని అతడు ఆనందపడాలి

Published on Fri, 09/12/2025 - 13:49

దాదాపు 20 ఏళ్లుగా సినిమాలు చేస్తున్న తమన్నా.. ఇప్పటికీ అదే ఊపు, జోష్ చూపిస్తూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. కొత్త చిత్రాలు, వెబ్ సిరీసులు అంతే ఉత్సాహంతో ప్రమోషన్లలో పాల్గొంటూ ఆకట్టుకుంటోంది. నటన పరంగా ఈమె దూసుకుపోతున్నప్పటికీ.. ప్రేమ పరంగా ఈమె జీవితంలో ఓ బ్రేకప్ ఉంది. హిందీ నటుడు విజయ్ వర్మతో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన ఈమె.. కొన్నాళ్ల క్రితం బ్రేకప్ చెప్పేసుకుంది. ప్రస్తుతానికైతే సింగిల్‌గానే ఉంటోంది.

అయితే త్వరలోనే తనకు కాబోయే అదృష్టవంతుడిని చూస్తారని తమన్నా ఇప్పుడు చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే విజయ్ వర్మతో బ్రేకప్ అయి ఎన్నాళ్లు కాలేదు ఇప్పుడు తమన్నా ఈ తరహా కామెంట్స్ చేయడం కొత్త సందేహాలు రేకెత్తిస్తోంది. ఈమె నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'డూ యూ వాన్నా పార్ట్‌నర్' ఈరోజు(సెప్టెంబరు 12) నుంచే స్ట్రీమింగ్ కానుంది. దీని ప్రమోషన్లలోనే మాట్లాడుతూ తన కాబోయే భాగస్వామి గురించి చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: ‘మిరాయ్‌’ మూవీ రివ్యూ)

'మంచి జీవిత భాగస్వామిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం నా ఆలోచన అదే. గత జన్మలో ఎంత పుణ్యం చేసుంటే నాకు తమన్నా లాంటి భార్య దొరికిందని నా భర్త ఆనందపడాలి. దానికోసమే నా ప్రయత్నం. అయితే ఆ లక్కీ పర్సన్ ఎవరనేది నాకు తెలియదు. త్వరలోనే మీరు అతడిని చూస్తారేమో?' అని తమన్నా చెప్పింది. ఈమె మాట్లాడిన దానిబట్టి చూస్తుంటే మళ్లీ ప్రేమలో పడిందా అనే డౌట్ వస్తోంది. ఒకవేళ రిలేషన్‌లో ఉంటే అతడెవరా అనేది తెలియాల్సి ఉంది.

2005 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తున్న తమన్నా ఇప్పటివరకు దాదాపు 90 సినిమాలు చేసింది. అలానే పలు వెబ్ సిరీసులు కూడా చేసింది. వయసు పెరుగుతున్నా సరే అదే అందాన్ని మెంటైన్ చేస్తూ అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తూ యూత్‌ని అలరిస్తోంది. మరి పెళ్లెప్పుడు చేసుకుంటుందో చూడాలి?

(ఇదీ చదవండి: ఏడాదిన్నర గ్యాప్.. హీరోయిన్ చేతిలో ఇప్పుడు 8 సినిమాలు)

Videos

మంత్రి నారాయణకు బిగ్ షాక్ డయేరియా బాధితుల ఫ్యామిలీ నిలదీత

YSRCP ఎప్పుడూ విజన్ తో ఆలోచిస్తుంది..విజయవాడ-గుంటూరు మధ్య పెడితే..: సజ్జల

రాజధానిపై చంద్రబాబు హాట్ కామెంట్స్

బరువెక్కుతున్న అమీర్..! కారణం అదేనా..?

RK Roja: మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది

ఈ వయసులో నీకెందుకు బాబు.. జూ.ఎన్టీఆర్ కి పార్టీ పగ్గాలు ఇచ్చేయ్

Diarrhea Cases: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 106 మంది

'మిరాయ్’ మూవీ రివ్యూ

చంద్రబాబుకి ఆ రెండంటే గుర్తొచ్చేది వ్యాపారమే

Haryana: కానిస్టేబుల్ ను గంట జైల్లో పెట్టిన కోర్టు

Photos

+5

రూ.2,700 కోట్ల విలాసం... కానీ తక్కువ ధరకే!! (ఫొటోలు)

+5

మాల్దీవుస్‌లో 'డిజే టిల్లు' బ్యూటీ.. నేహా శెట్టి ఫోటోలు చూశారా?

+5

హైదరాబాద్‌లో తప్పక సందర్శించాల్సిన ఆలయాలు ఇవిగో (ఫొటోలు)

+5

‘అందెల రవమిది’ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ఆరెంజ్‌ డ్రెస్‌లో అందంగా ఐశ్వర్య రాజేశ్‌ (ఫోటోలు)

+5

యాపిల్ సీఈఓతో అమితాబ్ బచ్చన్ మనవరాలు (ఫొటోలు)

+5

'మిరాయ్'తో మరో హిట్.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా? (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ నటి సుధ, అనిరుధ్, సప్తగిరి (ఫొటోలు)

+5

మతిపోగొడుతున్న అనుపమ అందం (ఫొటోలు)