Breaking News

ఆ హాలీవుడ్ మూవీ చూస్తుంటే 'జెర్సీ' గుర్తొచ్చింది

Published on Wed, 07/16/2025 - 10:40

రీసెంట్ టైంలో మూవీ లవర్స్‌ని ఆకట్టుకున్న హాలీవుడ్ సినిమా 'ఎఫ్ 1'. రేసింగ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమాలో బ్రాడ్ పిట్ హీరోగా నటించాడు. రేసింగ్ తరహా మూవీస్‌ని ఇష్టపడే వాళ్లకు ఇది పిచ్చిపిచ్చిగా నచ్చేస్తోంది. అంతెందుకు ప్రభాస్-ప్రశాంత్ నీల్ కూడా ఈ చిత్రాన్ని థియేటర్‌లో వీక్షిస్తూ నెటిజన్ల కంటికి చిక్కారు.

ఈ మూవీ గురించి ఇప్పుడు టాలీవుడ్ నిర్మాత నాగవంశీ కూడా స్పందించారు. కాకపోతే మిగతా వాళ్లతో పోలిస్తే కాస్త డిఫరెంట్‌గా తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. విజయ్ దేవరకొండతో 'కింగ్డమ్' నిర్మించిన ఈయన.. జూలై 31న ఈ చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో 'ఎఫ్ 1' గురించి ప్రస్తావిస్తూ.. ఇది తనకు 'జెర్సీ' మూవీలా అనిపించిందని చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్)

'ఈ కంపేరిజన్ చెప్తే ఆడియెన్స్ నన్ను తంతారు ఏమో, కాంట్రవర్సీ కూడా అవుద్ది. ఎఫ్ 1 సినిమా నాకు పిచ్చిపిచ్చిగా నచ్చింది కానీ ఎండ్ పొజిషన్ చూస్తుంటే 'జెర్సీ' గుర్చొచ్చింది. రేస్‌కి వెళ్తాడా లేదా మెడికల్ కండీషన్ కానీ జెర్సీ చూసినట్లు అనిపించింది' అని నాగవంశీ చెప్పారు.

నాని హీరోగా నటించిన ఈ క్రికెట్ డ్రామా సినిమాని నాగవంశీనే నిర్మించారు. ఆ మూవీ తీసిన గౌతమ్ తిన్ననూరి.. ఇప్పుడు విజయ్ దేవరకొండతో 'కింగ్డమ్' తీశాడు. దీనిపై ఓ మాదిరి అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే విజయ్ దేవరకొండకు గత కొన్నేళ్లుగా సరైన హిట్ అనేదే లేదు. అందుకే ఈ మూవీపై సదరు హీరోతో పాటు ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు.

(ఇదీ చదవండి: సైలెంట్‍‌గా ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ మూవీ)

Videos

మా మామను ఆపుతారా? పెద్దారెడ్డి కోడలు మాస్ వార్నింగ్

CAG Report: ఏపీ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం.. బాబు పాలనపై కాగ్ నివేదిక

ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

సీఎంను చంపేసిన Facebook

కూటమి ప్రభుత్వంలో వైద్యానికి నిర్లక్ష్య రోగం!

హత్య కేసును తమిళనాడులోనే విచారించాలి.. ఏపీలో న్యాయం జరగదు

జగన్ 2.0.. ఎలా ఉండబోతుందంటే రోజా మాటల్లో...

మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా.. ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్

వణికిన మహానగరం

Big Question: నా పిల్లల్ని కూడా.. డిబేట్ లో రోజా కంటతడి

Photos

+5

ట్రైలర్ లాంచ్ ఈవెంటో మెరిసిన నటి డింపుల్ హయాతీ (ఫొటోలు)

+5

విజయవాడ : సారె తెచ్చి..మనసారా కొలిచి..కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

జడివానకు హైదరాబాద్‌ అతలాకుతలం.. ట్రాఫిక్‌ జామ్‌తో చుక్కలు చూసిన వాహనదారులు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన..చెరువుల్లా మారిన రోడ్లు (ఫొటోలు)

+5

‘నా సీతా సీమంతం’ శ్రీమతి సీమంతంపై బిగ్‌బాస్‌ ఫేం పోస్ట్‌ (ఫొటోలు)

+5

‘నేను నా శివయ్య’ అంటున్న ఈ భక్తురాల్ని చూశారా?

+5

చందమామలా.. చీర సింగారించుకుని క్యూట్‌గా తెలుగు బ్యూటీ!

+5

ఆంధ్రా సరిహద్దులో.. ఉరకలేస్తున్న జలపాతాలు(చిత్రాలు)

+5

కుమారుడితో తొలిసారి తిరుమలలో హీరోయిన్ ప్రణీత (ఫొటోలు)

+5

'పరదా' సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)