గుడివాడలో పచ్చ గూండాల ఉన్మాదం ఉప్పాల హారిక కారు పై దాడి
Breaking News
వర్జిన్ బాయ్స్ హీరోయిన్ గొప్పమనసు.. నల్గొండ కుర్రాడికి సాయం!
Published on Mon, 07/07/2025 - 18:58
బిగ్ బాస్ బ్యూటీ మిత్రా శర్మ ప్రస్తుతం వర్జిన్ బాయ్స్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా.. యూత్ ఆడియన్స్‌ను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించారు. దయానంద్ గడ్డం దర్శకత్వంలో రాజా దారపునేని నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ జూలై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో మిత్రా శర్మ తన మంచి మనసును చాటుకుంది. నల్గొండ నుంచి వచ్చిన ఓ దివ్యాంగుడు ఈవీ ఇప్పించాలని కోరడంతో మిత్రా శర్మ అతని వివరాలు అడిగి తెలుసుకుంది. నీకు 15 రోజుల్లోనే ఈవీ వాహనం అందజేస్తామని అతనికి హామీ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ హీరోయిన్ మిత్రా శర్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే ఈ సినిమా టికెట్ కొన్న 11 మందికి ఐఫోన్లు గిఫ్ట్ ఇస్తామని అనౌన్స్ చేశారు. మనీ రైన్ ఇన్ థియేటర్స్ అనే కాన్సెప్ట్‌తో కొన్ని థియేటర్లలో డబ్బు వర్షంలా కురిపిస్తామని.. ఆ డబ్బు ప్రేక్షకులు సొంతం చేసుకోవచ్చు అని బంపరాఫర్లు ప్రకటించారు. కాగా.. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతాన్ని అందించారు. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా, జేడీ మాస్టర్ కొరియోగ్రఫర్‌గా పని చేశారు.
Heroine @Mitraaw_sharma encounters a need boy at #VirginBoysTrailer Launch Event and extends her helping hand for an EV 👏#VIRGINBOYS IN THEATERS FROM JULY 11th ! pic.twitter.com/YYC6euA504
— Rajesh Manne (@rajeshmanne1) July 7, 2025
Tags : 1