పాకిస్తాన్ తో యుద్ధాన్ని ఎందుకు ఆపేశారు? కాంగ్రెస్ సూటి ప్రశ్నకు బీజేపీ రిప్లై ఏంటి?
Breaking News
సైడ్ యాక్టర్‌గా అజిత్.. నాకు నచ్చలేదు: విష్ణు
Published on Wed, 07/02/2025 - 12:11
మంచు విష్ణు (Vishnu Manchu) తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్‌తో తీశారు. టాలీవుడ్‌లో ఎవరూ దొరకలేదా? అంటే? వరుస ఫ్లాపులు అందుకున్న తనతో కన్నప్ప వంటి మైథాలజీ సినిమా తీసేందుకు ఎవరూ ముందుకు రారని అసలు విషయం చెప్పారు. అందుకే మహాభారత్ సీరియల్ తీసిన ముకేశ్‌తో కన్నప్ప సినిమాను తెరకెక్కించినట్లు వెల్లడించారు.
బాలీవుడ్‌లో ఛాన్స్
మరి హీరోగా బాలీవుడ్‌లో అడుగుపెట్టే ఆలోచనలేమైనా ఉన్నాయా? అంటే విష్ణు ఇలా స్పందించారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు మాట్లాడుతూ.. చాలాకాలం క్రితం హిందీలో సినిమా చేయమని కొందరు నన్ను సంప్రదించారు. కానీ వారు ఆఫర్ చేసినవేవీ నాకు నచ్చకపోవడంతో అక్కడ సినిమాలు చేయలేదు. పైగా నటుడిగా నాకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాను. అదే సమయంలో అభిమానుల ప్రేమను పొందాను. వారిని నేను గౌరవించాల్సిన అవసరం ఉంది. ఏవి పడితే అవి చేసి వారిని నేను బాధపెట్టలేను.
చిన్న రోల్.. నచ్చలేదు
ఉదాహరణకు స్టార్ హీరో అజిత్‌ను తీసుకుందాం. ఆయన ఇండియాలోనే పెద్ద సూపర్‌స్టార్స్‌లో ఒకరు. షారూఖ్ ఖాన్ అశోక మూవీలో ఆయన సైడ్ రోల్ చేశారు. అది నాకు నచ్చలేదు. అజిత్ అన్నతో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు.. మీరు ఇంత చిన్న పాత్ర చేసినందుకు నిరాశచెందాను అని చెప్పాను. అందుకాయన చిన్నగా నవ్వి సైలెంట్‌గా ఉండిపోయారు.
సెల్ఫిష్‌గా ఆలోచించలేను
కాబట్టి ఏదో ఒక రోల్.. అని లైట్ తీసుకుని సినిమా చేయలేను. జనాలకు నచ్చినా, నచ్చకపోయినా నా ఇష్టమొచ్చిన సినిమాలు చేస్తా అని సెల్ఫిష్‌గా ఆలోచించలేను అని విష్ణు చెప్పుకొచ్చారు. కన్నప్ప సినిమా విషయానికి వస్తే.. విష్ణు తిన్నడు/కన్నప్పగా నటించారు. అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్‌లాల్, శరత్‌కుమార్, కాజల్ ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 27న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది.
చదవండి: మమ్మల్ని చంపుకుతింటున్నారు.. ఇండస్ట్రీలో ఫ్లాపులే లేవా? దిల్ రాజు
Tags : 1