వెన్నుపోటు దినం కేవలం ట్రైలర్ మాత్రమే.. రాచమల్లు శివప్రసాద రెడ్డి మాస్ కౌంటర్
Breaking News
జనవరిలో నిశ్చితార్థం.. పెళ్లి కూతురు కాబోతున్న ఆరెంజ్ నటి..!
Published on Tue, 06/03/2025 - 17:15
ప్రముఖ బాలీవుడ్ నటి షాజన్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనుంది. ప్రముఖ వ్యాపారవేత్తతో ఏడడుగులు వేయనుంది. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ ఈనెల 5న జరగనుంది. ఈనెల 3న హల్దీ వేడుకతో షాజన్ పదమ్సీ పెళ్లి సందడి మొదలు కానుంది. ఈ ఏడాది జనవరి 20న ఆశిశ్ కనకియాతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ముద్దుగుమ్మ.. తాజాగా పెళ్లి చేసుకోనుంది. ఇవాళ సాయంత్రం హల్దీ వేడుకలో పెళ్లి సందడి షూరూ కానుంది.
జూన్ 5న పెళ్లి వేడుక తర్వాత స్నేహితుల, సన్నిహితుల కోసం ముంబయిలో గ్రాండ్‌గా సంగీత్‌తో పాటు రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారు. కాగా.. షాజన్ పదమ్సీ, ఆశిశ్ కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారు. ఆ తర్వాత జనవరి 2025లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆమెకు కాబోయే భర్త ఆశిశ్ మూవీమాక్స్ సినిమాస్ సీఈవోగా పనిచేస్తున్నారు.
(ఇది చదవండి: ఐపీఎల్ ఫైనల్.. వార్-2 టీమ్ స్పెషల్ సర్‌ప్రైజ్!)
ఇక షాజన్ సినీ కెరీర్ విషయానికొస్తే హౌస్‌ఫుల్-2 చిత్రంతో బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. అంతకుముందు రాకెట్ సింగ్: సేల్స్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్, దిల్ తో బచ్చా హై జీ లాంటి చిత్రాల్లో నటించింది. అంతే కాకుండా తెలుగులో రామ్ చరణ్ నటించిన ఆరెంజ్, వెంకటేశ్ సినిమా మసాలాలోనూ కీలక పాత్రల్లో మెప్పించింది. ఆ తర్వాత తమిళంలోనూ కనిమొజి అనే సినిమాలో కనిపించింది. ఇటీవల జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన వెబ్ సిరీస్ హై జునూన్‌లో నటించింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించనుంది.
Tags : 1