ప్రధాని మోదీని కలిసిన క్రికెటర్ వైభవ్ సూర్యవంశి
Breaking News
పెళ్లి బరాత్‌తో దద్దరిల్లిన వాల్‌స్ట్రీట్
Published on Thu, 05/29/2025 - 10:57
మన దేశంలో ఏం రేంజ్‌లో వివాహ వేడుకలు జరుగుతాయో చెప్పాల్సిన పనిలేదు. అందుకోసం పెట్టే డీజేలు, బరాత్‌ల సందడితో ఊరు ఊరే హోరెత్తిపోతుంది. పైగా పెళ్లి వేడుక కావడంతో ఎవ్వరూ అభ్యంతరాలు చెప్పారు. ఓ వీధిలో పెళ్లి ఊరేగింపుతో కోలాహాలంగా ఉంటే..ఆటోమేటిగ్గా ఆ రోడ్డంతా బ్లాక్ అయిపోతుంది..వాహనదారులు, బాటసార్లు మరోదార్లో వెళ్తారు. అది సర్వసాధారణం. మరీ దేశం కానీ దేశంలో అదే రేంజ్‌లో ఆర్భాటంగా పెళ్లి చేయాలంటే.. కష్టమనే చెప్పాలి.
(చదవండి: క'రెంట్' ట్రెండ్..అద్దెకు అ'డ్రెస్'..! ప్రీ వెడ్డింగ్ షూట్స్ నుంచి రీల్స్ వరకు..)
ఎందుకంటే ఎన్నో పర్మిషన్లు కావలి. ముఖ్యంగా శబ్ద కాలుష్యం, ట్రాఫిక్‌కి అంతరాయం కలుగకుండా ఆయా అధికారుల నుంచి అనుమతి వంటివి ఎన్నో కావాలి. మరీ ఈ పెళ్లి సముహం అనుమతి తెచ్చుకుని మరీ ఏకంగా వాల్‌స్ట్రీట్‌లో వివాహ వేడుక ధూం ధాంగా నిర్వహించింది. అచ్చం మన దేశంలో నిర్వహించినట్లుగా పెళ్లి బరాత్ నిర్వహించి..ఓ లెవెల్‌లో ఆడిపాడి ఎంజాయ్ చేశారు వారంతా.
ఈ వేడుక కోసం అత్యంత రద్దీగా ఉండే వాల్‌స్ట్రీట్ మూసేశారు. ఆ వాల్‌స్ట్రీట్ వీధుల్లో దాదాపు 400 మంది పెళ్లి సముహంతో కోలాహాలంగా ఉంది. అందుకోసం పెళ్లి వారు ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఉంటారో కదూ..!. ఎందుకంటే మన కరెన్సీ ప్రకారం..లక్షలకు పైగానే ఛార్జ్ చేస్తారు. అక్కడ ఓ పక్క డీజే మ్యూజిక్ సందడి..మరోవైపు ఆ బీట్‌లకు అనుగుణంగా డ్యాన్స్‌లతో కన్నులపండుగ ఉంది.
ఈ వేడుక జరిగేలా సహకరిస్తుందా అన్నట్లు వాల్‌స్ట్రీట్ వీధులు వాహానాల రద్దీ లేకుండా నిర్మానుష్యంగా ఉన్నాయి. నెటిజన్లు మాత్రం మన వివాహ సంప్రదాయాలు న్యూయార్క్ వీధుల్లోకి వచ్చేశాయి. పైగా అక్కడ ఉండే స్థానికులు ఫోటోలు తీసుకుంటూ ఈ పెళ్లి వేడుకలో భాగమవ్వడం చూస్తుంటే.. మన సంస్కృతికి ఉన్న గొప్పదనం మరోసారి తేటతెల్లమైంది అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఇంకెందు ఆలస్యం అందుకు సంబంధించిన వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
(చదవండి: పచ్చి క్యాబేజ్ సలాడ్‌లు తింటున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్)
Tags : 1