Breaking News

Vishwanath Karthikey అమ్మమాటతో శిఖరాలకు, అరుదైన రికార్డు

Published on Wed, 05/28/2025 - 10:03

సాధారణంగా స్కూల్‌ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఎత్తయిన శిఖరాల గురించి చదువుకుంటుంటారు.. అయితే నగరానికి చెందిన పడకంటి విశ్వనాథ కార్తికే ఆ చిన్న ప్రాయంలోనే వివిధ ఖండాల్లోని, ప్రపంచంలోనే ఎత్తయిన పర్వత శిఖరాలను అధిరోహించడం ప్రారంభించాడు. ఈ అద్భుత ప్రయాణంలో విశ్వనాథ కార్తికే (Vishwanath Karthikey) తన 16 ఏళ్ల వయసులోనే 7 ఖండాల్లోని ఎత్తయిన పర్వతాలను (7 సమ్మిట్స్‌) అధిరోహించి చరిత్ర సృష్టించాడు. కార్తికే దేశంలో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగానే కాకుంగా ప్రపంచంలో రెండో అతిచిన్న వయసు్కడిగా చరిత్ర సృష్టించాడు. – సాక్షి, సిటీబ్యూరో  

బాల్యం నుంచే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతారోహణ ప్రారంభించిన కార్తికే ఈ ఏడాది జనవరిలోనే దక్షిణ అమెరికాలోని అకోంకాగువా పర్వతాన్ని (6,961 మీ/22,838 అడుగులు) ఎక్కి తన ఆరవ ఎత్తయిన పర్వతారోహణను పూర్తి చేశాడు. ప్రస్తుతం తన పర్వతారోహణ ప్రయాణంలో కీలక లక్ష్యమైన మౌంట్‌ ఎవరెస్ట్‌ (8,848 మీ/29,029 అడుగులు)ను అధిరోహించి రికార్డు సృష్టించాడు. గతంలో అకోంకాగువా (దక్షిణ అమెరికా)తో పాటు ప్రపంచంలో ఎత్తయిన పర్వతాలైన డెనాలీ (ఉత్తర అమెరికా), కిలిమంజారో (ఆఫ్రికా), ఎల్బ్రస్‌ (యూరప్‌), విన్సన్‌ మాసిఫ్‌ (అంటార్కిటికా), కోసియస్‌కో (ఆస్ట్రేలియా)ను అధిరోహించాడు. 

చదవండి: పాపులర్‌ యూ ట్యూబర్‌ సీక్రెట్‌ వెడ్డింగ్‌ : స్టూడెంట్స్‌కి సర్‌ప్రైజ్‌

అమ్మ మాటే ప్రేరణ..
ఈ సాధన వెనుక ఉన్న శ్రమ, కృషి మాటల్లో చెప్పలేనిది. ‘ఈ ప్రయాణం నన్ను శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా పరీక్షించింది. ఎవరెస్ట్‌ శిఖరంపై నిలిచిన ఆ క్షణం, నా కల నిజమవుతున్న అనుభూతి ఇచ్చింది’ అని విశ్వనాథ్‌ కార్తికే తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. ఈ విజయం వెనుక తన కుటుంబం, తల్లిదండ్రులు పడకంటి రాజేంద్ర ప్రసాద్, లక్ష్మి తన వెన్నుతట్టి ప్రోత్సహించారని పేర్కొన్నారు. ‘నీకు నచ్చింది చేస్తే.. జీవితం ఆనందంగా ఉంటుంది’ అని తల్లి చెప్పిన మాటలే ఆత్మస్థైర్యాన్నిచ్చాయని అన్నాడు. 

చదవండి: వోగ్ బ్యూటీ అవార్డ్స్‌: సమంతా స్టన్నింగ్‌ లుక్‌, ఫ్యాన్స్‌ ఫిదా

ఈ తరానికి స్పూర్తి..  
ఈ పయనంలో విశ్వనాథ్‌కు శిక్షణ ఇచ్చిన కోచ్‌లు భరత్, లెఫ్టినెంట్‌ రోమిల్‌ బారాథ్వల్‌ (ఇండియన్‌ ఆర్మీ రిటైర్డ్‌) పాత్ర కీలకం. రోమిల్‌ స్వయంగా ఒక ప్రఖ్యాత పర్వతారోహకుడు. వీరి మార్గదర్శకత్వం విశ్వనాథ్‌కి పర్వతారోహణలో నైపుణ్యం, మానసిన దృఢత్వాన్ని అందించాయి. లక్ష్యాలను ఎంచుకుని, కష్టపడి సాధించగలిగే అనేకమంది యువతకు ప్రేరణగా నిలిచారు. పర్వతాలను అధిరోహించడం అంత సులభం కాదు. ఇది శరీరానికే కాదు, మనసుకు కూడా పరీక్షే. కానీ తాను 16 ఏళ్ల వయసులో ఈ ప్రయాణం పూర్తి చేయడం విశేషం. 

Videos

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి సర్కార్ విస్మరిస్తోంది

మళ్లీ సింగం గెటప్ తో సూర్య..

మహానాడులో ఎన్టీఆర్ ఆత్మ ప్లేట్ మారుస్తుందని బాలయ్యకు ముందే తెలుసా?

రవితేజ తో అదిదా సర్ ప్రైజ్ అంటున్న కేతికా శర్మ..

కూటమిపై కన్నెర్ర

సింధు నీళ్ల కోసం కాళ్ళ బేరానికి పాకిస్తాన్

ఏపీలో పేదల రేషన్ కష్టాలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన

దేశద్రోహుల లిస్టులో సన్నీ యాదవ్ ..?

ఫైనల్స్ కి చేరేదెవరు?

Photos

+5

జనంపై బాబు పగ.. ఏపీలో ‘రేషన్‌’ కష్టాలు (ఫొటోస్)

+5

దక్షిణాదిన ఈ జలపాతాలు చూశారా?

+5

పెళ్లి వేడుకలా హీరోయిన్ శ్రీలీల బర్త్‌ డే (ఫొటోలు)

+5

మిస్‌ వరల్డ్ 2025 గ్రాండ్‌ ఫినాలేలో టాలీవుడ్‌ స్టార్స్‌ సందడి (ఫొటోలు)

+5

మిస్ వరల్డ్-2025 ఫైనల్స్ సందడి.. ర్యాంప్ వాక్‌తో మెరిసిన అందగత్తెలు (ఫొటోలు)

+5

ట్రెడిషనల్‌ లుక్‌లో ముద్దుగుమ్మలా‌ వర్ష (ఫొటోలు)

+5

నాగచైతన్య కౌగిలిలో శోభిత.. పుట్టినరోజు స్పెషల్ (ఫొటోలు)

+5

ఉత్తమ నటిగా గద్దర్ అవార్డ్.. ఫ్యామిలీతో నివేదా సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

విశాఖ, విజయవాడలో దంచికొట్టిన వర్షం (ఫొటోలు)

+5

‘భైరవం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)