వేధిస్తున్నారంటూ ఓ భర్త తన భార్యను, అత్తను నరికి హత్య చేశాడు. ఆ తరువాత పోలీసులకు లొంగిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిదిలో దారుణం జరిగింది. బెంగళూరుకు చెందిన పద్మప్రియకు శర్వానంద్‌కు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యా- భర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. పద్మప్రియకు అంతకు ముందే వివాహం జరిగింది. అయితే ఆ విషయం శర్వానంద్కు చెప్పలేదు. ఆ విషయం తెలిసి అతను వేరుగా ఉంటున్నాడు. పద్మప్రియ, ఆమె తల్లి పరమేశ్వరి శర్వానంద్‌తో తరచూ గొడవపడుతుండటంతో వారు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా వారు వేదిస్తుండటంతో విసిగివేసారిన శర్వానంద్ భార్యను, అత్తను నరికి చంపి పోలీసులకు లొంగిపోయాడు.
Nov 14 2013 6:50 AM | Updated on Mar 21 2024 7:48 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement