ప్రగతిభవన్‌ వద్ద ధర్నాకు సిద్ధమేనా? 

Palvai Sravanti hurls challenge at Kalvakuntla kavith - Sakshi

ఎమ్మెల్సీ కవితకు కాంగ్రెస్‌ నేత పాల్వాయి స్రవంతి సవాల్‌

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌లో 33% మహిళలకు టికెట్ల కేటాయింపు కోసం ప్రగతిభవన్‌ వద్ద ధర్నా చేసేందుకు ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత సిద్ధమేనా అని టీపీసీసీ అధికార ప్రతినిధి, మునుగోడు కాంగ్రెస్‌ నేత పాల్వాయి స్రవంతి సవాల్‌ విసిరారు. కల్వకుంట్ల కవితకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే తన తండ్రిపై పోరాటానికి సిద్ధం కావాలని కాంగ్రెస్‌ మహిళా నేతలు కోరారు.

ఒక పార్టీ అధినేతగా తన తండ్రి కేసీఆర్‌ చేతిలో ఉన్న టికెట్ల కేటాయింపు అవకాశాన్ని వదిలిపెట్టి ఎక్కడో పార్లమెంటులో బిల్లులు గురించి కవిత మాట్లాడటం, జంతర్‌మంతర్‌ దగ్గర బూటకపు పోరాటాలు చేయడం సరికాదని హితవు పలికారు. మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడుతూ...బీఆర్‌ఎస్‌ తరఫున మొత్తం 115 మంది అభ్యర్థులను ప్రకటిస్తే అందులో కేవలం ఏడుగురు మహిళలకే టికెట్లు కేటాయించారని, ఆ పార్టీ మహిళాసాధికారిత గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పారు. ప్రధాని పదవితో సహా రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్, ఏఐసీసీ అధ్యక్షురాలి పదవులను మహిళలకు ఇచి్చన ఘనత కాంగ్రెస్‌ పారీ్టదని గుర్తుంచుకోవాలని కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top