Dec 23rd: AP పొలిటికల్‌ అప్‌డేట్స్‌

AP Elections Political News Updates Headlines Dec 23rd In Telugu - Sakshi

AP Elections Political Latest Updates Telugu

8:40PM, శనివారం, Dec 23, 2023

వ్యూహం చిత్ర వ్యూహకర్త ఆర్జీవీకి అభినందనలు: మంత్రి ఆర్‌కే రోజా

  • బెజవాడ గడ్డ మీద పుట్టిన ముద్దుబిడ్డ ఆర్జీవీ 
  • శివ నుంచి కంపెనీ వరకూ బెజవాడ నుంచి ముంబై వరకూ తన సత్తాను చూపిన వ్యక్తి వర్మ 
  • ఆర్జీవీ అంటేనే ఒక సంచలనం 
  • వ్యూహం టైటిల్ ప్రకటించగానే సైకిల్ పార్టీ షేకైపోయింది 
  • ఆర్జీవీ డైరెక్టర్ అనగానే పచ్చ పార్టీ నేతల ప్యాంట్లు తడిచిపోయాయి 
  • చంద్రబాబు కుట్రలు కుతంత్రాలకు జగన్‌మోహన్‌రెడ్డికి మధ్య జరిగిన సంఘర్షణే ఈ వ్యూహం చిత్రం
  • ఎందుకూ పనికిరాని పప్పు లోకేష్ గాడు కూడా పవన్ సీఎంగా పనికిరాడని చెప్పాడు
  • రాజమండ్రి సెంట్రల్ జైలు కెళ్లి బాబుకి మద్దతు పలికి తనతో పాటు తన వర్గానికి కూడా పవన్ వెన్నుపోటు పొడిచారు
  • వైఎస్సార్‌ను లేకుండా చేశారు
  • వైఎస్ కుటుంబాన్ని లేకుండా చేయాలని చూశారు
  • చంద్రబాబు ఎన్నో కుట్రలు చేశాడు 
  • తండ్రికి మించి తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి
  • ప్రజల కోసం తలొంచకుండా పోరాడిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి
  • ఎలాగైనా వ్యూహం సినిమాను ఆపాలనుకుంటున్నారు 
  • వ్యూహం సినిమాను ఆపలేరు..2024లో జగనన్న విజయాన్ని ఆపలేరు

7:20PM,శనివారం, Dec 23, 2023

వైఎస్సార్‌సీపీ గెలుపు కోసమే పనిచేస్తాం: ఐపాక్‌  ప్రకటన

  • 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం పనిచేస్తాం
  • ఏపీ ప్రజల అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌కు మా వంతు తోడ్పాటు అందిస్తాం
  • ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీతో కలిసి పనిచేస్తున్నాం. 
  • 2024 ఎన్నికల్లో​ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గెలుపుకోసమే మేము పనిచేస్తాం

6:38PM, శనివారం, Dec 23, 2023

 ఒక పీకే ఏమీ పీకలేకపోయాడు.. మళ్లీ ఇంకో పీకీ వచ్చాడు: మంత్రి జోగి రమేష్‌

  • ఎంత మంది పీకేలు వచ్చినా పీకేది ఏమీ లేదు..
  • 2019 లో చంద్రబాబుని పీకేశారు.. 2024 లో జనసేన, టీడీపీని మొత్తం పీకేస్తారు..
  • చంద్రబాబుకే భవిష్యత్ గ్యారెంటీ లేదు.. ప్రజలకి ఏమీ గ్యారెంటీ ఇస్తాడు

6:36PM, శనివారం, Dec 23, 2023

పీకే, చంద్రబాబు సమావేశంపై పేర్ని నాని సెటైర్లు

  • చంద్రబాబుకి సిగ్గు శరం లేదు.. ప్రశాంత్ కిషోర్ గురించి ఏం మాట్లాడారో మర్చిపోయారా?
  • బీహార్ వాడికి ఇక్కడేం పని అన్నది మర్చిపోయారా..
  • మేము ఛీ కొడితే బయటకి పోయిన వాడిని బ్రతిమలాడి తెచ్చుకున్నారు.. 
  • పవన్‌పై నమ్మకం లేదు, పార్టీ కార్యకర్తలపై నమ్మకం లేదు..
  • రాబిన్ శర్మ, ప్రశాంత్ కిషోర్, సునీల్ కొనుగోలు ఇలా ఎవరిని తెచ్చుకున్నా అవ్వదు..
  • జనం గుండెల్లో జగన్ ఉన్నారు..జనం గుండెల్లో ఉన్నంత వరకు ఎవరూ వచ్చినా ఏమీ చెయ్యలేరు..
  • ప్రశాంత్ కిషోర్ మా దగ్గర జితానికే పని చేశాడు. ఇప్పుడు అదే చేస్తాడు

6:33PM, శనివారం, Dec 23, 2023

ఓట్ల నమోదులో టిడిపి చేస్తున్న అవకతవకలపై పిర్యాదు చేశాం: పేర్ని నాని

  • తెలంగాణలో ఓట్లు ఉన్న వాళ్ళకి ఇక్కడ తొలగించాలని కోరాం
  • అక్కడ ఓటు హక్కు వినియోగించి మళ్ళీ ఇక్కడ ఓటు నమోదుకు టిడిపి ప్రయత్నం చేస్తుంది..
  • డబుల్ ఎంట్రీ క్రిమినల్ చర్య.. 
  • దీనికోసం హైదరాబాద్ లో టీడిపి క్యాంపెయిన్ చేస్తుంది.. దానిపై పిర్యాదు చేశాం..
  • రాష్ట్ర యంత్రాంగం మొత్తం ప్రభుత్వ కార్యకలాపాలు మానేసి ఎన్నికల పిర్యదుల్లోనే ఉండాలని టిడిపి తప్పుడు పిర్యాదులు చేస్తుంది..
  • కోనేరు సురేష్ అనే వ్యక్తి ఈ తప్పుడు పిర్యాదులు ఇస్తున్నారు.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరాం..
  • కోనేరు సురేష్ తప్పుడు పిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆచర్యపోయారు..
  • మై పార్టీ ద్యాష్ బోర్డ్ అనే యాప్ లో ఓటర్ లిస్టులో ఫోటోలు,  అడ్రస్‌, కులం అన్ని వివరాలు ఉన్నాయి.. దానిపై చర్యలు తీసుకోవాలని కోరాం.
  • టిడిపి సేకరిస్తున్న వ్యక్తిగత సమాచారం వ్యవహారంపై పిర్యాదు చేశాం.

6:09PM, శనివారం, Dec 23, 2023

ఇది చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనం: మంత్రి అంబటి

  • గతంలో పీకేపై చంద్రబాబు, లోకేష్‌ చేసిన విమర్శలు గుర్తు చేసుకోవాలి
  • చంద్రబాబు, లోకేష్‌ రాజకీయ దిగజారుడుతనానికి ఇదే నిదర్శనం
  • ఎన్ని వ్యూహాలు రచించినా టీడీపీని బతికించటం సాధ్యం కాదు
  • పీకేను బీహార్‌ డెకాయిట్‌ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు
  • చంద్రబాబు నాయుడు ,లోకేష్ అవసరమైతే ఎవరు కాళ్ళైనా పట్టుకుంటారు
  • ఒకప్పుడు డెకాయిట్ అన్న ప్రశాంత్ కిషోర్‌ని ఇప్పుడు ఢిల్లీ వెళ్లి ఆయన కాళ్లు పట్టుకొని తెచ్చుకున్నారు
  • ఆ PK కి వచ్చినా.. ఈ pk వచ్చిన తెలుగుదేశం పార్టీని బ్రతికించే పరిస్థితి లేదు
  • మెటీరియల్‌ మంచిది కాకపోతే మేస్త్రి ఏమి చేయలేడని తెలుగుదేశం కార్యకర్తలు గమనించాలి
  • ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీని పోస్టుమార్టం చేయడానికి మాత్రమే పనికొస్తాడు
  • రాబిన్ సింగ్ పని అయిపోయింది అందుకే కొత్త వ్యూహ కర్త రంగంలోకి దింపారు
  • చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ కొన్నాళ్లు కనపడలేదు
  • ఢిల్లీ వెళ్లి ప్రశాంత్ కిషోర్ కాళ్లు పట్టుకుని బ్రతిమిలాడుకున్నాడని అంటున్నారు
  • వ్యూహకర్తలు మారినంత మాత్రాన ఉపయోగం లేదు

5:24PM, శనివారం, Dec 23, 2023

కేంద్ర ఎన్నికల సంఘం బృందంతో వైఎస్సార్‌సీపీ ప్రతినిధుల భేటీ

  • ఈసీ ప్రతినిధులను కలిసిన మంత్రులు మేరుగ నాగార్జు, జోగి రమేష్‌, ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొఠారు అబ్బయ్య చౌదరి, లేళ్ల అప్పిరెడ్డి
  • ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదు
  • టీడీపీ చేస్తున్న డబుల్‌ ఎంట్రీలపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
  • తెలంగాణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న టీడీపీ సానుభూతిపరుల ఓట్లను ఏపీలో నమోదు చేశారని ఫిర్యాదు

04:44PM, శనివారం,  Dec 23, 2023

విజయవాడ.:
రెండో రోజు కలెక్టర్లు,ఎస్పీలతో ముగిసిన ఈసీఐ బృందం సమావేశం

  • ఎన్నికల సన్నద్దతపై రెండవ రోజు కేంద్ర ఎన్నికల బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు
  • మధ్యాహ్నం నుంచి సమావేశంలో పాల్గొన్న సీఎస్,డీజీపీ, పలు శాఖల ఉన్నతాధికారులు
  • ఐటీ, కస్టమ్స్, రైల్వే తో పాటు పలు కేంద్ర సంస్థల అధికారులతో కొనసాగుతున్న ఇసిఐ బృందం సమావేశం

12.30 PM, శనివారం, Dec 23, 2023
చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

  • చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ 
  • ఐఆర్‌ఆర్‌ కేసులో తీర్పు రిజర్వ్‌ చేసిన ఏపీ హైకోర్టు
  • చంద్రబాబు, లోకేష్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్న సీఐడీ మెమోపై కౌంటర్‌ఫైల్‌
  • లోకేష్‌ వ్యాఖ్యలకు, చంద్రబాబు కేసుకు సంబంధం లేదు: చంద్రబాబు లాయర్లు
  • సీఐడీ మెమోను పరిగణనలోకి తీసుకోవద్దని కోరాం: చంద్రబాబు లాయర్లు

11.26 AM, శనివారం, Dec 23, 2023
ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో కీలక పరిణామం

  • ఏపి హైకోర్టు: IRR కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై కీలక పరిణామం
  • దర్యాప్తు అధికారులకు లోకేష్ రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తున్నారని కోర్టులో మెమో ఫైల్ చేసిన సీఐడీ
  • చంద్రబాబు కేసులు విచారిస్తున్న అధికారులపై లోకేష్ రెడ్ బుక్ చూపించి బెదిరిస్తున్నట్టు కోర్టులో మెమో ద్వారా తెలిపిన సీఐడీ
  • ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దని కోరిన సీఐడీ
  • కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు కు ఏపీ హైకోర్టు ఆదేశం
  • తదుపరి విచారణ నేటికి వాయిదా

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అక్రమ మలుపుల కేసు @ హైకోర్టు

  • CID అభియోగాల్లో ముఖ్యమైన అంశాలు
  • టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు
  • కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే
  • లింగమనేని కుటుంబంతో క్విడ్‌ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్‌ క్యాపిటల్‌లో భూములు
  • స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మూడుసార్లు మార్పు
  • అలైన్‌మెంట్‌ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్‌ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్‌ప్రోకో
  • 2015 జూలై 22, 2017 ఏప్రిల్‌ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్‌రింగ్‌ అలైన్‌మెంట్‌లో మార్పులు
  • ఇన్నర్‌ రింగ్‌రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు
  • అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం
  • ఇన్నర్‌రింగ్‌ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్‌మెంట్‌
  • కరకట్ట కట్టడం.. క్విడ్‌ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని
  • కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం
  • లింగమనేని రమేశ్‌ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం
  • సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు

10.21 AM, శనివారం, Dec 23, 2023
రెండో రోజు ప్రారంభమైన సీఈసీ బృందం సమావేశం

  • విజయవాడ: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రెండో రోజు ప్రారంభమైన సీఈసీ బృందం సమావేశం
  • సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ ఆధ్వర్యంలో కలెక్డర్లు, ఎస్పీలతో సమీక్షిస్తున్న కేంద్ర ఎన్నికల బృందం
  • మొదటి రోజు ఎన్నికల సన్నద్దతపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన 18 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు
  • నేడు సీఈసీ బృందానికి ఎన్నికల సన్నద్దతపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న నంద్యాల, కర్నూలు సత్యసాయి, అనంత, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు
  • జిల్లాల వారీగా ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ సన్నద్ధత, రీపోలింగ్ కేంద్రాల పరిస్ధితి, భద్రతా చర్యలు, బందోబస్తు తదితర వాటిపై సమీక్ష
  • చెక్ పోస్టులు.. తనిఖీ కేంద్రాల ఏర్పాటుపై ఆరా తీస్తోన్న సీఈసీ బృందం
  • సమస్యాత్మక.. సున్నిత ప్రాంతాల్లో భద్రతాపై సమీక్ష
  • ఓటర్ల జాబితాలో అవకతవకలు ఎక్కువగా ఉన్న జిల్లాలపై నిరంతరం పర్యవేక్షణ పెట్టాలని సీఈఓకు కేంద్ర బృందం సూచనలు
  • ఓటర్ల జాబితాలో అవకతవకలను చాలా సీరియస్‌గా తీసుకుంటామని తొలి రోజు సమావేశంలో సీఈసీ బృందం హెచ్చరిక
  • రాజకీయ పార్టీల ఫిర్యాదులపైనా సమీక్షించిన కేంద్ర ఎన్నికల బృందం
  • బోగస్ ఓట్లు, డబుల్ ఎంట్రీలపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపై వివరాలు తెలుసుకున్న కేంద్ర ఎన్నికల బృందం
  • మధ్యాహ్నం సీఎస్, డీజీపీలతో పాటు ఎన్నికలతో సంబంధం ఉండే కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతోనూ భేటీ కానున్న ఈసీ బృందం

8.53 AM, శనివారం, Dec 23, 2023
నోట్ల కట్టలుంటేనే టీడీపీ టికెట్‌

  • ఓటమి ఖాయం అనే భయంతోసొంత డబ్బులు పెట్టేందుకు ససేమిరా
  • కుటుంబీకుల ఒత్తిడితో వ్యూహం మార్చిన బాబు
  • డిపాజిట్‌ చేసినోళ్లకే టికెట్‌ అంటూ షరతు
  • ఆ క్రమంలో సీనియర్లను పక్కన పెడుతున్న వైనం
  • దీంతో బిత్తరపోయిన గద్దె, దేవినేని ఉమా
  • గుడివాడలో రావిని పక్కన పెట్టి వెనిగండ్లకు సీటు

7.33 AM, శనివారం, Dec 23, 2023
అయ్యన్నపాత్రుడు దిగజారుడు ఆరోపణలు

  • విశాఖ గాదిరాజు ప్యాలెస్‌లో మిగులు భూమి ఉందంటూ 2018లోనే యూఎల్‌సీ జాబితా
  • పక్కా సర్వేతో అసలు లెక్కలను తేల్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
  • క్రమబద్ధీకరణకు అవకాశమిస్తూ యజమానికి జేసీ నోటీసులు
  • తద్వారా ఆ స్థలాన్ని క్రమబద్ధీకరించుకునే అవకాశమిచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
  • వాస్తవాలను పట్టించుకోకుండా అయ్యన్నపాత్రుడు దిగజారుడు ఆరోపణలు
  • కుమారుడికి సీటు కోసం చంద్రబాబు మెప్పు పొందడానికి సీఎం కుటుంబంపై దుష్ప్రచారం
  • గాదిరాజు ప్యాలెస్‌ అడిగారనడం అవాస్తవం: గాదిరాజు ప్యాలెస్‌ అధినేత రామకృష్ణరాజు
  • ఇప్పటివరకు నేరుగా అయ్యన్న ముఖమే చూడలేదని స్పష్టీకరణ
     

7.27 AM, శనివారం, Dec 23, 2023
లోకేశ్‌ అరెస్టుకు అనుమతివ్వండి

  • సెక్షన్‌ 41ఏ నోటీసులోని షరతులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారు
  • రెడ్‌ బుక్‌ పేరుతో పోలీసులను, సాక్షులను బెదిరించారు
  • న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా పలు ఆరోపణలు చేశారు
  • ఏసీబీ ప్రత్యేక కోర్టులో సీఐడీ పిటిషన్‌
  • నేరుగా అరెస్టు చేయవచ్చుగా అని సీఐడీని ప్రశ్నించిన కోర్టు
  • కోర్టు అనుమతి కోసం పిటిషన్‌ దాఖలు చేశామన్న సీఐడీ
  • అయితే లోకేశ్‌ ఇంటర్వ్యూలను చూసిన తర్వాత స్పందిస్తామన్న న్యాయస్థానం
  • తదుపరి విచారణ 28వ తేదీకి వాయిదా
  • హైకోర్టులోనూ మెమో దాఖలు చేసిన సీఐడీ

7.11 AM, శనివారం, Dec 23, 2023
‘దొంగ’ నాటకం! 

  • ‘ఫ్యాన్‌’ క్లీన్‌ స్వీప్‌ చేసిన 4 ఉమ్మడి జిల్లాలపై టీడీపీ గురి
  • లక్షలాది ఓట్లు తొలగించాలంటూ బోగస్‌ ఫారం 7 దరఖాస్తులు
  • గంపగుత్తగా దాఖలు చేసిన టీడీపీ ఎన్నికల సెల్‌ కోఆర్డినేటర్‌ కోనేరు సురేష్‌
  • వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఓట్ల తొలగింపు లక్ష్యంగా పావులు
  • కర్నూలు, వైఎస్సార్, నెల్లూరు, విజయనగరం జిల్లాలు టార్గెట్‌
  • 80–90 శాతం దరఖాస్తులు బోగస్‌వేనంటూ ఈసీకి కలెక్టర్ల నివేదిక
  • ఎన్నికల యంత్రాంగం అప్రమత్తతతో ప్రజాస్వామ్యానికి ఊపిరి  

7.04 AM, శనివారం, Dec 23, 2023
‘బ్రో’...ఇదేం పద్ధతి.. వాపోతున్న జనసేన కార్యకర్తలు

  • సీఎం పదవిపై రకరకాలుగా మాట్లాడుతూ గందరగోళానికే పవన్‌కళ్యాణ్‌ మొగ్గు
  • కానీ.. గెలిస్తే చంద్రబాబే సీఎం అని... పవన్‌ కూడా అంగీకరించారని చెప్పిన లోకేశ్‌
  • ఇందులో సందేహాలకు తావు లేదని, 150 సీట్లకు అభ్యర్థులూ రెడీ అని చెప్పిన చినబాబు
  • ఈ విషయంపై ప్రశ్నలకు తప్పించుకునే రీతిలో నాదెండ్ల సమాధానాలు
  • మూడో సారి కూడా మోసమేనా.. అంటూ మండి పడుతున్న జనసేన నేతలు
  • పవన్‌! సీఎం పదవిపై ఆశలు వదిలేశావా?.. అంటూ హరిరామజోగయ్య లేఖ  
  • జనసైనికుల కలలు ఏమవ్వాలంటూ నిలదీత

6.57 AM, శనివారం, Dec 23, 2023
పవన్‌ నియోజకవర్గంపై కన్‌ఫ్యూజన్‌

  • మళ్లీ రెండు నియోజకవర్గాలు కావాలంటోన్న పవన్‌ కళ్యాణ్‌
  • ఇదే విషయాన్ని చంద్రబాబు, లోకేష్‌లకు చెప్పిన పవన్‌ కళ్యాణ్‌
  • గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన పవన్‌
  • గాజువాకలో 16753 ఓట్ల తేడాతో పవన్‌ ఓటమి
  • భీమవరంలో 8357 ఓట్ల తేడాతో పవన్‌ ఓటమి
  • ఈ సారి మళ్లీ గాజువాకలో పోటీ చేస్తానంటోన్న పవన్‌ కళ్యాణ్‌
  • విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల్లో తెలుగుదేశం గెలిచిందని గుర్తు చేస్తోన్న పవన్‌
  • ఈ సారి కలిసి పోటీ చేస్తాం కాబట్టి తనకు గాజువాకలో అవకాశం ఉంటుందంటున్న పవన్‌
  • ఇదే విషయాన్ని రివర్స్‌లో  చెబుతోన్న తెలుగుదేశం నాయకులు
  • తమకు బలమున్న చోట పవన్‌కు అవకాశం ఎందుకు ఇవ్వడమంటోన్న టిడిపి సీనియర్లు
  • తనకు మాటిచ్చారు కాబట్టి గాజువాక ఇవ్వాల్సిందేనంటోన్న పవన్‌
  • పవన్‌కు అదే హామీ ఇచ్చి లోకేష్‌ సభకు రప్పించానని సీనియర్లకు నచ్చజెబుతోన్న చంద్రబాబు
  • గాజువాకలో మరోసారి ఓటమి తప్పదంటున్న టిడిపి సీనియర్లు
  • ఈ సారి రెండో నియోజకవర్గంగా పిఠాపురం అయితే బాగుంటుందన్న పవన్‌
  • పిఠాపురంలో 14,992 ఓట్ల మెజార్టీతో గెలిచిన YSRCP అభ్యర్థి దొరబాబు పెండెం
  • పిఠాపురంలో కాపులు ఎక్కువ ఉన్నారు కాబట్టి తనకు అడ్వాంటేజ్‌ అంటోన్న పవన్‌
  • తెలుగుదేశం అభ్యర్థి వర్మకు ఎసరు పెట్టేందుకు జనసేన ఇన్‌ఛార్జ్‌గా తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌
  • తంగెళ్ల గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేస్తే పవన్‌ పోటీకి అనుకూలంగా ఉంటుందని జనసేన ప్లాన్‌

6.55 AM, శనివారం, Dec 23, 2023
వేడేక్కుతున్న ఆంధ్రప్రదేశ్‌ రాజకీయం

  • అభివృద్ధి, సంక్షేమం మంత్రంతో ముందుకెళ్తోన్న సీఎం జగన్‌
  • సింగిల్‌గా పోటీ చేయలేక దిక్కులు చూస్తోన్న టిడిపి, జనసేన
  • పొత్తుల తక్కెడలో కొట్టుమిట్టాడుతోన్న చంద్రబాబు, పవన్‌
  • నిన్నంతా సీట్ల లెక్కలో తలమునకలయిన బాబు, పవన్‌
  • పవన్‌ లెక్క 50/5, చంద్రబాబు లెక్క 25/2
Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top