Supreme Court: చట్టసభల్లో అవినీతీ... విచారణార్హమే | Sakshi
Sakshi News home page

Supreme Court: చట్టసభల్లో అవినీతీ... విచారణార్హమే

Published Tue, Mar 5 2024 4:44 AM

Supreme Court ruling on immunity for legislators facing bribery charges - Sakshi

సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు

1998 నాటి ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు కొట్టివేత

చట్టసభల్లో మాట్లాడడానికి, ఓటేయడానికి లంచాలా?!

ఆరి్టకల్‌ 105(2), 194(2) కలి్పంచే రక్షణ వాటికి వర్తించదు

వాటి వర్తింపునకు రెండు నిబంధనలు విధించిన ధర్మాసనం

ప్రజాప్రతినిధుల అవినీతి ప్రజాస్వామ్యానికే ముప్పంటూ ఆగ్రహం

సాక్షి, న్యూఢిల్లీ: అవినీతికి పాల్పడే ప్రజాప్రతినిధులు రాజ్యాంగ రక్షణ మాటున దాక్కోలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టసభల్లో ఓటేయడానికి, మాట్లాడడానికి లంచం తీసుకొనే ఎంపీలు, ఎమ్మెల్యేలు విచారణ నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో వారికి విచారణ నుంచి రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుందంటూ 1998లో జేఎంఎం లంచం కేసులో ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెలు వరించిన తీర్పును కొట్టేసింది!

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ సారథ్యంలోని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం సోమవారం ఏకగ్రీవంగా చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. చట్టసభల్లోపల ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రత్యేక అధికారాలను కట్టబెడుతున్న రాజ్యాంగంలోని ఆరి్టకల్‌ 105(2), ఆరి్టకల్‌ 194(2) ఇలాంటి ఆరోపణలకు వర్తించబోవని స్పష్టం చేసింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయంటూ ధర్మాసనం స్పష్టత ఇవ్వడం విశేషం.

‘‘పార్లమెంటులోనూ, శాసనమండలి, శాసనసభల్లోనూ, సంబంధిత కమిటీల్లోనూ ఏం అంశం మీదైనా సభ్యులు ఒత్తిళ్లకు అతీతంగా స్వేచ్ఛగా చర్చించగలిగే వాతావరణం నెలకొల్పడమే ఆరి్టకల్‌ 105, 194 ఉద్దేశం. అంతే తప్ప ఓటేయడానికి, సభలో ప్రసంగించడానికి లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై విచారణ నుంచి కాపాడటం కాదు. లేదంటే ఆ వాటి అసలు ఉద్దేశమే నెరవేరకుండా పోతుంది. లంచం తీసుకునే ప్రజాప్రతినిధి నేరానికి పాల్పడ్డట్టే. వారికి ఎలాంటి రక్షణా కలి్పంచలేం’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.

ప్రజాప్రతినిధుల అవినీతి దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య పునాదులనే పెకిలించి వేస్తుందంటూ ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ ఆకాంక్షలను, ఆదర్శాలతో పాటు ప్రజా జీవితంలో విశ్వసనీయతను కూడా దెబ్బ తీస్తుందని ఆవేదన వెలిబుచి్చంది. ‘‘ఆరి్టకల్‌ 105(2), 194(2) కింద సభ్యుడు కోరే రక్షణ సదరు అంశంపై సభ సమష్టి పనితీరుకు, సభ్యునిగా తాను నెరవేర్చాల్సిన విధులకు పూర్తిగా అనుగుణంగా ఉండాల్సిందే’’ అంటూ రెండు కీలక నిబంధనలను తాజా తీర్పులో పొందుపరిచింది. వాటిని తృప్తి పరిచినప్పుడే సభలో వారు చేసే ప్రసంగానికి, వేసే ఓటుకు చట్టపరమైన విచారణ నుంచి రక్షణ ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ధర్మాసనం తరఫున సీజేఐ 135 పేజీల తీర్పు రాశారు.
 
రాజ్యసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యరి్థకి ఓటేసేందుకు జేఎఎం ఎమ్మెల్యే సీతా సొరెన్‌ లంచం తీసుకున్నారన్న కేసుపై సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్‌ ఏఎస్‌ బొపన్న, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ జేబీ పార్డీవాలా, జస్టిస్‌ సంజయ్‌కుమార్, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపి 2023 అక్టోబరులో తీర్పు రిజర్వు చేసింది. సోమవారం తీర్పు వెలువరించింది. ‘‘ఒక ప్రజాప్రతినిధి చట్టసభలో ఓటేసేందుకు లంచం స్వీకరించిన, స్వీకరించేందుకు అంగీకరించిన క్షణంలోనే నేరానికి పాల్పడ్డట్టు లెక్క.

అంతిమంగా ఓటేశారా, లేదా అన్నదానితో నిమిత్తం లేదు. లంచం స్వీకరించినప్పుడే నేరం జరిగిపోయింది’’ అని స్పష్టం చేసింది. ‘‘ఓటేయడానికి, మాట్లాడడానికి లంచం తీసుకుంటే రాజ్యాంగం కలి్పంచిన స్వేచ్ఛాయుత వాతావరణం సభలో కొనసాగకుండా పోతోంది. అలాంటి నేరాలకు సభ్యుడు రాజ్యాంగపరమైన మినహాయింపులు కోరజాలడు. ఆరి్టకల్‌ 105, 194 రక్షణలు వర్తించబోవు’’ అని స్పష్టం చేసింది. ‘‘ఇలాంటి సందర్భాల్లో కూడా సభ్యుడుకి విచారణ నుంచి మినహాయింపు ఇస్తున్న 1998 నాటి పీవీ నరసింహారావు కేసు తీర్పును పునఃపరిశీలించడం తప్పనిసరి. లేదంటే న్యాయస్థానం తప్పిదానికి పాల్పడ్డట్టే అవుతుంది’’ అని అభిప్రాయపడింది.

కేసు పూర్వాపరాలివీ...
జార్ఖండ్‌లో 2012లో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆ సందర్భంగా ఓటేసేందుకు ఓ స్వతంత్ర అభ్యర్థి నుంచి జేఎంఎం ఎమ్మెల్యే సీతా సొరెన్‌ లంచం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. కానీ తాను తమ పార్టీ అభ్యరి్థకే ఓటేశానని పోలింగ్‌ అనంతరం ఆమె తెలిపారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించినా ఆమె సొంత పార్టీ అభ్యరి్థకే ఓటేశారు. అయితే సొరెన్‌ తన నుంచి లంచం తీసుకున్నారంటూ సదరు స్వతంత్ర అభ్యర్థి పోలీసుల్ని ఆశ్రయించడంతో ఆమెపై ఛార్జిషీటు దాఖలు చేయడంతో పాటు క్రిమినల్‌ విచారణ చర్యలు చేపట్టారు.

ఆరి్టకల్‌ 194(2) కింద తనకు రక్షణ ఉంటుంది గనుక ఈ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలంటూ సీతా సొరెన్‌ జార్ఖండ్‌ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ప్రతికూల నిర్ణయం రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2014 సెపె్టంబరులో కేసు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందుకు వెళ్లింది. అనంతరం 2019 మార్చిలో నాటి సీజేఐ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును విచారించింది.

1998 నాటి పీవీ నరసింహారావు కేసులో ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం వెలువరించిన తీర్పును ఈ కేసు విచారణ సందర్భంగా జార్ఖండ్‌ హైకోర్టు ఉటంకించినందున విచారణను విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని నిర్ణయించింది. తదనంతరం సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారించింది. 1998 నాటి కేసులో సీతా సొరెన్‌ మామ శిబు సొరెన్‌కు ఇదే తరహా కేసులో ఊరట లభించిందని ఆమె తరఫు న్యాయవాది ప్రస్తావించారు. ఆ వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. ‘‘1998 నాటి పీవీ కేసు తీర్పుతో విభేదిస్తున్నాం. ఆ తీర్పును కొట్టేస్తూ ఏడుగురు న్యాయమూర్తులం ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చాం’’ అని పేర్కొంది.
 
ఏమిటీ పీవీ కేసు...
1993లో కేంద్రంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో శిబు సొరెన్‌ సహా ఐదుగురు జేఎంఎం ఎంపీలు లంచం తీసుకొని తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఆరి్టకల్‌ 105(2), ఆర్టికల్‌ 194(2) కింద సదరు సభ్యులకు ప్రాసిక్యూషన్‌ నుంచి మినహాయింపు ఉంటుందంటూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3:2 మెజారిటీతో 1998లో తీర్పు వెలువరించింది.

అది పరస్పర విరుద్ధ ఫలితాలకు దారితీసిందని సీజేఐ సారథ్యంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ‘‘లంచం తీసుకుని తదనుగుణంగా ఓటేసిన సభ్యులకు విచారణ నుంచి ఆ తీర్పు రక్షణ కలి్పస్తోంది. కానీ లంచం తీసుకుని కూడా మనస్సాక్షి మేరకు స్వతంత్రంగా ఓటేసిన సభ్యులను శిక్షిస్తోంది. తద్వారా ఈ రెండు పరిస్థితుల మధ్య కృత్రిమ భేదాన్ని సృష్టించింది. ఆ తీర్పుతో విభేదిస్తూ ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు వెలువరించిన మైనారిటీ తీర్పు దీన్ని ఎత్తి చూపింది కూడా’’ అని జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement