people representatives
-
Supreme Court: చట్టసభల్లో అవినీతీ... విచారణార్హమే
సాక్షి, న్యూఢిల్లీ: అవినీతికి పాల్పడే ప్రజాప్రతినిధులు రాజ్యాంగ రక్షణ మాటున దాక్కోలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టసభల్లో ఓటేయడానికి, మాట్లాడడానికి లంచం తీసుకొనే ఎంపీలు, ఎమ్మెల్యేలు విచారణ నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో వారికి విచారణ నుంచి రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుందంటూ 1998లో జేఎంఎం లంచం కేసులో ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెలు వరించిన తీర్పును కొట్టేసింది! ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం సోమవారం ఏకగ్రీవంగా చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. చట్టసభల్లోపల ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రత్యేక అధికారాలను కట్టబెడుతున్న రాజ్యాంగంలోని ఆరి్టకల్ 105(2), ఆరి్టకల్ 194(2) ఇలాంటి ఆరోపణలకు వర్తించబోవని స్పష్టం చేసింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయంటూ ధర్మాసనం స్పష్టత ఇవ్వడం విశేషం. ‘‘పార్లమెంటులోనూ, శాసనమండలి, శాసనసభల్లోనూ, సంబంధిత కమిటీల్లోనూ ఏం అంశం మీదైనా సభ్యులు ఒత్తిళ్లకు అతీతంగా స్వేచ్ఛగా చర్చించగలిగే వాతావరణం నెలకొల్పడమే ఆరి్టకల్ 105, 194 ఉద్దేశం. అంతే తప్ప ఓటేయడానికి, సభలో ప్రసంగించడానికి లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై విచారణ నుంచి కాపాడటం కాదు. లేదంటే ఆ వాటి అసలు ఉద్దేశమే నెరవేరకుండా పోతుంది. లంచం తీసుకునే ప్రజాప్రతినిధి నేరానికి పాల్పడ్డట్టే. వారికి ఎలాంటి రక్షణా కలి్పంచలేం’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాప్రతినిధుల అవినీతి దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య పునాదులనే పెకిలించి వేస్తుందంటూ ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ ఆకాంక్షలను, ఆదర్శాలతో పాటు ప్రజా జీవితంలో విశ్వసనీయతను కూడా దెబ్బ తీస్తుందని ఆవేదన వెలిబుచి్చంది. ‘‘ఆరి్టకల్ 105(2), 194(2) కింద సభ్యుడు కోరే రక్షణ సదరు అంశంపై సభ సమష్టి పనితీరుకు, సభ్యునిగా తాను నెరవేర్చాల్సిన విధులకు పూర్తిగా అనుగుణంగా ఉండాల్సిందే’’ అంటూ రెండు కీలక నిబంధనలను తాజా తీర్పులో పొందుపరిచింది. వాటిని తృప్తి పరిచినప్పుడే సభలో వారు చేసే ప్రసంగానికి, వేసే ఓటుకు చట్టపరమైన విచారణ నుంచి రక్షణ ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ధర్మాసనం తరఫున సీజేఐ 135 పేజీల తీర్పు రాశారు. రాజ్యసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యరి్థకి ఓటేసేందుకు జేఎఎం ఎమ్మెల్యే సీతా సొరెన్ లంచం తీసుకున్నారన్న కేసుపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ సంజయ్‌కుమార్, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపి 2023 అక్టోబరులో తీర్పు రిజర్వు చేసింది. సోమవారం తీర్పు వెలువరించింది. ‘‘ఒక ప్రజాప్రతినిధి చట్టసభలో ఓటేసేందుకు లంచం స్వీకరించిన, స్వీకరించేందుకు అంగీకరించిన క్షణంలోనే నేరానికి పాల్పడ్డట్టు లెక్క. అంతిమంగా ఓటేశారా, లేదా అన్నదానితో నిమిత్తం లేదు. లంచం స్వీకరించినప్పుడే నేరం జరిగిపోయింది’’ అని స్పష్టం చేసింది. ‘‘ఓటేయడానికి, మాట్లాడడానికి లంచం తీసుకుంటే రాజ్యాంగం కలి్పంచిన స్వేచ్ఛాయుత వాతావరణం సభలో కొనసాగకుండా పోతోంది. అలాంటి నేరాలకు సభ్యుడు రాజ్యాంగపరమైన మినహాయింపులు కోరజాలడు. ఆరి్టకల్ 105, 194 రక్షణలు వర్తించబోవు’’ అని స్పష్టం చేసింది. ‘‘ఇలాంటి సందర్భాల్లో కూడా సభ్యుడుకి విచారణ నుంచి మినహాయింపు ఇస్తున్న 1998 నాటి పీవీ నరసింహారావు కేసు తీర్పును పునఃపరిశీలించడం తప్పనిసరి. లేదంటే న్యాయస్థానం తప్పిదానికి పాల్పడ్డట్టే అవుతుంది’’ అని అభిప్రాయపడింది. కేసు పూర్వాపరాలివీ... జార్ఖండ్‌లో 2012లో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆ సందర్భంగా ఓటేసేందుకు ఓ స్వతంత్ర అభ్యర్థి నుంచి జేఎంఎం ఎమ్మెల్యే సీతా సొరెన్ లంచం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. కానీ తాను తమ పార్టీ అభ్యరి్థకే ఓటేశానని పోలింగ్ అనంతరం ఆమె తెలిపారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించినా ఆమె సొంత పార్టీ అభ్యరి్థకే ఓటేశారు. అయితే సొరెన్ తన నుంచి లంచం తీసుకున్నారంటూ సదరు స్వతంత్ర అభ్యర్థి పోలీసుల్ని ఆశ్రయించడంతో ఆమెపై ఛార్జిషీటు దాఖలు చేయడంతో పాటు క్రిమినల్ విచారణ చర్యలు చేపట్టారు. ఆరి్టకల్ 194(2) కింద తనకు రక్షణ ఉంటుంది గనుక ఈ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలంటూ సీతా సొరెన్ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ప్రతికూల నిర్ణయం రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2014 సెపె్టంబరులో కేసు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందుకు వెళ్లింది. అనంతరం 2019 మార్చిలో నాటి సీజేఐ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును విచారించింది. 1998 నాటి పీవీ నరసింహారావు కేసులో ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం వెలువరించిన తీర్పును ఈ కేసు విచారణ సందర్భంగా జార్ఖండ్ హైకోర్టు ఉటంకించినందున విచారణను విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని నిర్ణయించింది. తదనంతరం సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారించింది. 1998 నాటి కేసులో సీతా సొరెన్ మామ శిబు సొరెన్‌కు ఇదే తరహా కేసులో ఊరట లభించిందని ఆమె తరఫు న్యాయవాది ప్రస్తావించారు. ఆ వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. ‘‘1998 నాటి పీవీ కేసు తీర్పుతో విభేదిస్తున్నాం. ఆ తీర్పును కొట్టేస్తూ ఏడుగురు న్యాయమూర్తులం ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చాం’’ అని పేర్కొంది. ఏమిటీ పీవీ కేసు... 1993లో కేంద్రంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో శిబు సొరెన్ సహా ఐదుగురు జేఎంఎం ఎంపీలు లంచం తీసుకొని తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఆరి్టకల్ 105(2), ఆర్టికల్ 194(2) కింద సదరు సభ్యులకు ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు ఉంటుందంటూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3:2 మెజారిటీతో 1998లో తీర్పు వెలువరించింది. అది పరస్పర విరుద్ధ ఫలితాలకు దారితీసిందని సీజేఐ సారథ్యంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ‘‘లంచం తీసుకుని తదనుగుణంగా ఓటేసిన సభ్యులకు విచారణ నుంచి ఆ తీర్పు రక్షణ కలి్పస్తోంది. కానీ లంచం తీసుకుని కూడా మనస్సాక్షి మేరకు స్వతంత్రంగా ఓటేసిన సభ్యులను శిక్షిస్తోంది. తద్వారా ఈ రెండు పరిస్థితుల మధ్య కృత్రిమ భేదాన్ని సృష్టించింది. ఆ తీర్పుతో విభేదిస్తూ ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు వెలువరించిన మైనారిటీ తీర్పు దీన్ని ఎత్తి చూపింది కూడా’’ అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. -
ప్రజా ప్రతినిధుల కోర్టులో చిత్తూరు జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలకు ఊరట
సాక్షి, విజయవాడ: ప్రజా ప్రతినిధుల కోర్టులో చిత్తూరు జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. 2015 టీడీపీ హయాంలో ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో అధికారులపై దాడి చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై విచారణ జరిపిన విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు.. కేసును కొట్టేసింది. చిత్తూరు జిల్లా ఏర్పేడులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలతో సహా మరో 16 మంది వైసీపీ నేతలపై కేసు నమోదైంది. విచారణ చేపట్టిన విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు నేడు తీర్పును వెల్లడించింది. ఇదీ చదవండి: రామోజీ.. ఇంతకన్నా ఛండాలం ఉంటుందా? -
డిజిటల్ డాబు.. ఏదీ జవాబు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : నగదు రహిత లావాదేవీల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలుపుతామని జిల్లా అధికారులు, ప్రజాప్రతి నిధులు హోరెత్తిస్తున్నారు. జిల్లాను డిజిటల్ ఎకానమీ హబ్‌గా మార్చాలనుకుంటున్న ప్రజాప్రతినిధులు తమ స్వగ్రామాల్ని మాత్రం గాలికొదిలేశారు. ఆ గ్రామాల్లో బ్యాంకు శాఖల మాట దేవుడెరుగు.. కనీసం ఒక్క ఏటీఎం సెంటర్ కూడా లేదు. స్వైపింగ్ మెషిన్లు సైతం ఎక్కడా కానరావడం లేదు. ఎమ్మెల్యేల స్వగ్రామాల్లోనే నగదు తీసుకునేందుకు కనీస ఏర్పాట్లు లేవంటే.. మిగిలిన గ్రామాల్లో పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు స్వగ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై ‘సాక్షి’ పరిశీలన జరపగా ఈ విషయాలు వెలుగు చూశాయి. ఆచంట ఎమ్మెల్యే, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ స్వగ్రామమైన పోడూరు మండలం కొమ్ముచిక్కాలలో బ్యాంకుగాని, ఏటీఎం గాని లేవు. ఈ గ్రామ జనాభా దాదాపు 6 వేలు. ఇక్కడి వారంతా దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలోగల కవిటంలోని ఇండియ¯ŒS బ్యాంక్, ఎస్బీఐ శాఖలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వగ్రామం పెదవేగి మండలంలోని దుగ్గిరాల. ఈ గ్రామంలో ఏటీఎం లేదు. నగదు కావాలంటే ప్రజలు ఏలూరు నగరానికి వెళ్లక తప్పని పరిస్థితి. పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు స్వగ్రామం బుట్టాయగూడెం మండలం రాజానగరం. ఈ గ్రామంలో ఏటీఎం లేదు. నగదు కోసం కొయ్యలగూడెంలో ఏటీఎంలకు వెళ్లాలంటే 13 కిలోమీటర్లు.. బుట్టాయగూడెం వెళ్లాలంటే 15 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సొంత ఊరు ఆగర్తిపాలెం. ఈ గ్రామంలో ఏటీఎం లేదు. ఆగర్తిపాలెంతో పాటు ఆగర్రు గ్రామం కూడా దాదాపు కలిసే ఉంటుంది. ఈ రెండు గ్రామాల్లో సుమారు 10 వేలకు పైగా జనాభాతో పాటు 5వేల ఓటర్లు ఉన్నారు. వరి, ఆక్వా సాగు చేసుకుని రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు జీవనోపాధి పొందుతున్నారు. కొంతమంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలు వెళ్లి ఆర్థికంగా స్థిరపడ్డారు. ఇక్కడి వారంతా నగదు కోసం 5కిలోమీటర్లు దూరంలో ఉన్న పూలపల్లి లేదా 7కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలకొల్లుపై ఆధారపడతారు. నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు స్వగ్రామం సరిపల్లి. ఆయన చాలా కాలం క్రితమే నరసాపురం పట్టణానికి వచ్చి స్థిరపడ్డారు. ఆయన స్వగ్రామంలో కనీసం ఒక్క ఏటీఎం కూడా లేకపోవడంతో.. ప్రజలు నగదు కోసం మూడు కిలోమీటర్ల దూరంలోని నరసాపురం రావాల్సిన పరిస్థితి. జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షుడు, టీడీపీ నాయకుడు ముత్యాల వెంకటేశ్వరరావు (రత్నం) నివాస గ్రామమైన కుప్పనపూడిలో ఏటీఎం లేదు. ప్రజల నగదు కోసం ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. రైతులకు అందుబాటులో సొసైటీలను, వాటి బ్రాంచిలను ఏర్పాటు చేసినప్పటికీ ఏటీఎంలు లేకపోవడంతో రైతులు, ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. -

ప్రజావేదికను బహిష్కరించిన ప్రజాప్రతినిధులు
అధికారుల ఆదేశాల మేరకు కొనసాగిన ప్రజావేదిక బహిష్కరణకు పింఛన్ల తొలగింపే కారణం..! ముథోల్ : మండల కేంద్రంలోని స్థానిక మండలపరిషత్తు కార్యాలయ సమావేశం మందిరంలో మంగళవారం నిర్వహించిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రజావేదిక కార్యక్రమాన్ని ముథోల్ మండల ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామస్తులు బహిష్కరించారు. ఉదయం 11 గంటలకు ప్రారం¿¶ ంకావాల్సి ఉండగా ఒంటి గంటకు ప్రారంభించారు. ప్రజావేదిక కార్యక్రమానికి జిల్లా అడిషనల్ పీడీ వెంకటేశ్వర్లు, ఏపీడీ శ్రీనివాస్‌లు, ఎంపీడీవో నూర్ మహ్మద్, ఎస్ఆర్ ప్రభు కొనసాగించారు. అర్హుల పింఛన్ల తొలగింపే... మొదటగా మండలంలోని విఠోలి గ్రామం, ముథోల్ గ్రామపంచాయతీలు 2015–16 సంవత్సరంలో జరిగిన జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనుల వివరాలను సామాజిక తనిఖీ బందం ఎదుట ప్రజావేదికలో సిబ్బంది విన్నవించారు. కార్యక్రమానికి హాజరైన ముథోల్ మండల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ గ్రామస్తులు జోక్యం చేసుకొని 2015 సంవత్సరంలో సామాజిక తనిఖీ బందం తనిఖీలు చేసి అర్హులైన వారి పింఛన్లను రద్దు చేసినట్లు పీడీ దష్టికి తీసుకెళ్లారు. గతంలో సామాజిక తనిఖీ బందం తనిఖీలు చేపట్టి మండల కేంద్రంతో పాటు 20 గ్రామ పంచాయతీ పరిధిలోని ఆయా గ్రామాలలో అర్హులైన వారి పింఛన్లను రద్దు చేసినట్లు ఆరోపణలున్నాయి. తిరిగి గ్రామాల వారీగా ప్రత్యేక బందం వెళ్లి పింఛన్ లబ్ధిదారుల పూర్తి సమాచారాన్ని సేకరించి సామాజిక తనిఖీల్లో వెల్లడించేంత వరకు ప్రజావేదికను బహిష్కరిస్తున్నాం అని ప్రజాప్రతినిధులు వెళ్లిపోయారు. అధికారుల ఆదేశాలతో.. జిల్లా స్థాయి అధికారులు ప్రజావేదిన బుధవారం రోజున పూర్తి వ్యవహారాలతో కొనసాగించాలని అధికారులకు విన్నవించారు. మంగళవారం మాత్రం అధికారులు మాత్రం ఫీల్ట్ అసిస్టెంట్లు, సామాజిక బందంతో ప్రజావేదికను కొనసాగించారు. పై అధికారుల ఆదేశాల మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో కొనసాగించాల్సి వస్తో ందని ఎంపీడీవో తెలిపారు. ఈ సామాజిక తనిఖీ అర్ధరాత్రి వరకు, బుధవారం కూడా కొనసాగనుంది. జరిగింది ఇదే.. సామాజిక తనిఖీ కొనసాగుతుండగా సర్పంచులు, ఎంపీటీసీలు వచ్చి ఫీల్డ్ అసిస్టెంట్లను బయటికి పంపించి ఈ కార్యక్రమం కొనసాగించవద్దని అ«ధికారులకు తెలిపారు. ఏపీడీ జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడారు. తరువాత ఈ సామాజిక తనిఖీ బుధవారం కొనసాగించనున్నట్లు ప్రజాప్రతినిధులకు తెలపడంతో వారు వెళ్లిపోయారు. కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభకాన్నుట్లు ఎంపీడీవో నూర్ మహ్మద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పీల్డ్ అసిస్టెంట్లు, సామాజిక తనిఖీ బందం తదితరులున్నారు. -
లిక్కర్ సిండికేట్‌లో ప్రజాప్రతినిధులపై ఎఫ్ఐఆర్
హైదరాబాద్: ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందేనని హైకోర్టు చెప్పింది. లిక్కర్ సిండికేట్ కేసులో ప్రజాప్రతినిధుల ప్రాసిక్యూషన్ విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అధికారులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవహారంలో ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గరాదని కూడా హైకోర్టు ఆదేశించింది. సెక్షన్ల ప్రకారమే నడుచుకోవాలని చెప్పింది.