దేశంలో వీధి కుక్కలు ఎన్ని? కుక్క కాటు కేసులు ఎక్కడ అధికం?

Street Dog Attack to man who Will be Responsible - Sakshi

పలు రిపోర్టుల ప్రకారం దేశంలో కోటికిపైగా పెంపుడు కుక్కలు ఉన్నాయి. వీధి కుక్కల జనాభా దాదాపు 3.5 కోట్లు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం 2019లో దేశంలో కుక్కకాటు కేసులు 4,146 నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 27.52 లక్షల కేసులు నమోదయ్యాయి, తమిళనాడు (20.7 లక్షలు), మహారాష్ట్ర (15.75 లక్షలు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

వీధికుక్కలు కొన్ని సందర్భాల్లో మనుషులను కరుస్తుంటాయి. ఇది రేబిస్‌ వ్యాధికి దారితీస్తుంది. చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. వీధికుక్కల బెడదను నియంత్రించడంలో ప్రభుత్వాలు సమర్థవంతమైన చర్యలను అమలు చేయడంలో విఫలమయ్యాయనే ఆరోపణలు వినిపిస్తుంటాయి. 

చట్టం ప్రకారం 2001 నుండి భారతదేశంలో కుక్కలను చంపడాన్ని నిషేధించారు. అయితే 2008లో ముంబయి హైకోర్టు నిర్ణయాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం సస్పెండ్ చేసింది. మునిసిపాలిటీలకు వీధి కుక్కలను చంపడానికి అనుమతినిచ్చింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఏ (జీ) వన్యప్రాణులను రక్షించడం, అన్ని జీవుల పట్ల కరుణ కలిగి ఉండటం భారతదేశంలోని ప్రతి పౌరుడి ప్రాథమిక విధి. స్థానికులు తమ నివాస ప్రాంతాల్లోని వీధి కుక్కలకు ఆహారం పెట్టేందుకు అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు గత ఏడాది సమర్థించింది.  
ఇది కూడా చదవండి: ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top