‘బొద్దింకల దోసె’?! షాక్‌ అయిన అమ్మడు

Eight Cockroaches Found In A Dosa At New Delhi’s CP - Sakshi

వామ్మో ఇన్ని బొద్దింకలా..!

సామాన్యంగా బొద్దింకలను చూస్తేనే శరీరం ఝల్లుమంటుంది...అలాంటి బొద్దింక ఆహారంలో కనిపిస్తే..? ఆ భోజనం తినగలమా? ఈ మధ్యకాలంలో మనకు ఎక్కువగా వినిపిస్తున వార్త "ఆహారంలో బొద్దింక". ట్రైన్, రెస్టారెంట్‌, విమానాల్లో ఇలా ఎక్కడ చూసినా ఇవే వార్తలు. తాజాగా ఢిల్లీలో ఇలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది.

న్యూఢిల్లీలోని కనౌట్ ప్లేస్‌లోని ఓ రెస్టారెంట్‌లో మధ్యాహ్న భోజనం కోసం ఓక మహిళ, ఆమె స్నేహితురాలు దోసను ఆర్డర్ చేసారు. సరిగ్గా అలా తినడం మొదలు పెట్టిందో లేదో.. అక్కడ అనుమానాస్పదంగా ఏదో కనిపించింది. ఏంటా అని పరిశీలనగా చూసింది. అంతే.. ఒకటి కాదు రెండు ​కాదు ఎకంగా ఎనిమిది బొద్దింల్ని చూసి ఒక్కసారిగా షాక్‌ అయింది.

ఇవి చదవండి: నిత్యం వీటిని తినడంతో.. కలిగే మార్పులు తెలుసా!

దీంతో ఈ సంఘటనను రికార్డుచేయాలని నిర్ణయించుకుంది. స్నేహితురాలి సాయంతో వీడియో రికార్డ్ చేస్తోంది. ఇంతలోనే హోటల్‌ సిబ్బందిలో ఒకరు ఎంట్రీ ఇచ్చాడు. అకస్మాత్తుగా ప్లేట్‌ను లాగేసుకున్నాడు. ఈ విషయాన్ని ఇషాని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ‘బొద్దింకల’పై ఆరా తీస్తున్నారు.

తనకెదురైన భయంకరమైన అనుభవాన్ని ఇషాని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఈ కేఫ్ లైసెన్స్, శుభ్రతపై అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. రెస్టారెంట్ల పరిశుభ్రత స్థాయి, లైసెన్స్‌లను తనిఖీ చేయడానికి అధికారులు క్రమం తప్పకుండా రెస్టారెంట్‌లను సందర్శించి తగిన చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు నమోదు కావంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ‘ది క్వింట్‌’ షేర్‌ చేసిన ఈ వీడియో ఇపుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Election 2024

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top