దాడి చేసిన సర్పంచ్‌పై కేసు పెట్టాలి

దాడి చేసిన సర్పంచ్‌పై కేసు పెట్టాలి


సంగారెడ్డి అర్బన్: తనకు అనుకూలంగా ఓ కేసు విషయమై తప్పుడు సాక్ష్యం చెప్పాలని గ్రామ సర్పంచ్ ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటనపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సదాశివపేట మండలం మెలిగిరిపేట గ్రామ సర్పంచ్ బాల్‌రాజ్ సదాశివపేటకు చెందిన తుల్జారాంను తప్పుడు సాక్ష్యం చెప్పాలని కోరాడు. దానికి అతను నిరాకరించడంతో బాల్‌రాజ్ తన అనుచరులతో దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ విషయం తెలిసిన స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి తుల్జారాంను రక్షించారు.



తనపై  దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్ డా.ఎ.శరత్‌కు తుల్జారాం ఫిర్యాదు చేయగా, ఈ విషయమై జేసీ శరత్ స్పందిస్తూ ఈ విషయమై తాను జిల్లా ఎస్పీతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. అలాగే వ్యక్తిగతంగా ఎస్పీని కలవాలని సూచించారు. సోమవారం ప్రజావిజ్ఞప్తుల దినంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు వచ్చిన అర్జీదారులు కలెక్టర్ రాహుల్ బొజ్జా, జేసీ శరత్, సంబంధిత అధికారులకు ఫిర్యాదులు అందజేశారు.



హత్నూర మండలం పల్పనూర్ గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలి.

మనూర్ మండలం కసర్‌గుత్తి గ్రామానికి చెందిన శాంతాబాయి వికలాంగుల పింఛన్ కోసం, శంకరంపేట(ఆర్)కు చెందిన రాములు వికలాంగుల కోటాలో ట్రైసైకిల్ మంజూరుకు వినతి.

మెదక్ మండలం చెట్ల తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన కాట్రోత్ గోపాల్ గిరిజన సంక్షేమ శాఖ ద్వారా బోర్ మోటారు మంజూరుకు డిమాండ్.

కొండపాక గ్రామానికి చెందిన ఎంగయ్య తన భూమి రికార్డుల ప్రకారం సరిచేయాలని కోరారు.

న్యాల్‌కల్ మండలం తుజాల్‌పూర్‌కి చెందిన మణెమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు రుణం ఇప్పించాలని కోరారు.

ఝరాసంగం మండలం కుప్పనగర్ గ్రామపరిధిలోని సర్వే నెంబర్ 62 ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని కంకర క్రషర్ మిషన్ నడుపుతున్నందున చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.

మెదక్ మండలం ఔసలిపల్లి గ్రామానికి చెందిన శంకరమ్మ, సోని, సుజాత, కళావతి, లక్ష్మీలకు చెందిన భూమిని ఇతరులు ఆక్రమించుకున్నారని, తమకు చెందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అనావృష్టి వల్ల రైతులకు తగిన దిగుబడి రానందు వల్ల పూర్తి స్థాయిలో రైతులు బ్యాంక్ రె న్యువల్ చేయడానికి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉండి బ్యాంక్ లోన్స్ రెన్యువల్స్ చేయలేకపోతున్నారని, రెన్యువల్ చేయలేని రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలని తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు రాఘవేందర్‌రెడ్డి, నాయకులు రంగాగౌడ్, పాపయ్యలు జిల్లా జాయింట్ కలెక్టర్ శరత్‌ను కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top