శేషాచలం ఎన్కౌంటర్పై భగ్గుమన్న తమిళనాడు | tence situation in tamilanadu over encounter | Sakshi
Sakshi News home page

శేషాచలం ఎన్కౌంటర్పై భగ్గుమన్న తమిళనాడు

Published Tue, Apr 7 2015 7:43 PM | Last Updated on Sat, Sep 2 2017 11:59 PM

తమిళనాడులో ఏపీ సీఎం చంద్రబాబు దిష్టి బొమ్మను దగ్థం చేస్తోన్న నిరసనకారులు

తమిళనాడులో ఏపీ సీఎం చంద్రబాబు దిష్టి బొమ్మను దగ్థం చేస్తోన్న నిరసనకారులు

శేషాచలం అడవుల్లో చోటుచేసుకున్న ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్ అగ్గి.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల వాతావరణాన్ని వేడెక్కించింది.

శేషాచలం అడవుల్లో చోటుచేసుకున్న ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్ అగ్గి.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల వాతావరణాన్ని వేడెక్కించింది.  20 మంది తమిళులను ఆంధ్రా పోలీసులు పొట్టనపెట్టుకున్నారని ఆరోపిస్తూ అనేక సంస్థలు పలు చోట్ల ఆందోళనలు నిర్వహిస్తుండటంతో తమిళనాడు వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఏపీ సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన నిరసనకారులు.. బాబు ఫొటోలు, దిష్టి బొమ్మలను దగ్థం చేశారు

ఇప్పటికే చెన్నైలోని కోయంబేడు అంతర్ రాష్ట్ర బస్ స్టేషన్లో ఏపీకి చెందిన తొమ్మిది బస్సులపై దుండగులు దాడిచేశారు. నెల్లూరు సరిహద్దులో మరో బస్సుపై పెట్రోల్ బాంబుతో దాడికి యత్నించారు.  దీంతో ఉద్రిక్తతలు చల్లారేవరకు ఇరురాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిపివేయాలని అధికారులు భావిస్తున్నారు. మరికొద్ది గంటల్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement