'దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు' | Sakshi
Sakshi News home page

'దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు'

Published Tue, Dec 1 2015 10:30 AM

'దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు'

ముంబయి: అసహనం వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ విషయంలో మరో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తొలిసారి స్పందించారు. ఆయన ఆమిర్ ఖాన్ కు బాసటగా నిలిచారు. ఏ ఒక్కరికి ప్రత్యేకంగా దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. దేశభక్తి అనేది తనకు తానుగా మదిలో ఉంచుకోవాల్సిన భావన అని చెప్పారు.

'దేశానికి మంచి జరగాలని ఆలోచించడం.. మంచి చేయడం తప్ప నీవు నీ దేశభక్తిని ఏ మార్గం ద్వారాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. దేశానికి లబ్ది చూకూరేలా మాత్రమే నీవు పనిచేయాలి. నేను చక్కటి మనసుతో ఆలోచించి దేశం కోసం పనిచేస్తే నా దేశానికి ప్రయోజనం చేకూరుతుంది. అలా కాకుండా నేను అవినీతిపరుడినైతే నా దేశానికి హానీ కలుగుతుంది' అంటూ షారుక్ అన్నారు.

ట్విట్టర్ ఇతర సామాజిక మాధ్యమాలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని చెప్పేందుకు అనుకూలంగా ఉన్నాయని, అయితే, సాధారణంగా చేసే వ్యాఖ్యలు కూడా సంచలనాలుగా మారుతున్నాయని చెప్పారు. తనకు అవగాహన ఉన్న అంశాలపైనే మాట్లాడతానని ఆయన చెప్పారు.

Advertisement
 
Advertisement