0001 నెంబరు.. వెల 8.5 లక్షలు!!

0001 నెంబరు.. వెల 8.5 లక్షలు!!


ఫ్యాన్సీ నెంబరు అంటే చాలు.. ఎంతయినా పెట్టేందుకు రెడీగా ఉంటారు కొంతమంది. అలాగే.. ఛత్తీస్గఢ్లో ఓ పారిశ్రామికవేత్త తనకు కావల్సిన నెంబర్ కోసం ఏకంగా 8.5 లక్షల రూపాయలు చెల్లించారు. అక్కడ కొత్తగా మొదలుపెట్టిన సీహెచ్-01-ఎజడ్ అనే సిరీస్లో తొలిసారిగా 0001 నెంబరు వేలానికి వచ్చింది. అంతే.. సోనాలికా గ్రూపు ఛైర్మన్ ఎల్డీ మిట్టల్ ఆ నెంబరును 8.5 లక్షలు వెచ్చించి గెలుచుకున్నారు. ఇంతకుముందు 2013 మే నెలలో సీహెచ్-01-ఏటీ సిరీస్లో 0001 నెంబరుకు 9.1 లక్షలు పలికింది. దాని తర్వాత ఇదే అత్యంత ఎక్కువ మొత్తం.



సోనాలికా గ్రూపు ప్రధాన కంపెనీ అయిన ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ కోసం కొత్తగా కొన్న మెర్సిడెస్ ఎస్ సిరీస్ కారు కోసం ఈ నెంబరును ఆయన వేలంలో పాడుకున్నారు. ఈ సంవత్సరం మొదట్లోనే మిట్టల్ ఫోర్బ్స్ కోటీశ్వరుల జాబితాలోకి చేరుకున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top