ఆ వార్తలన్ని రూమర్లే: సమంత
తాను అనారోగ్యానికి గురైనట్టు వస్తున్న వార్తలన్ని రూమార్లేనని సినీతార సమంత తెలిపింది.
తాను అనారోగ్యానికి గురైనట్టు వస్తున్న వార్తలన్ని రూమార్లేనని సినీతార సమంత తెలిపింది. కొద్ది రోజుల నుంచి సమంత తీవ్ర అనారోగ్యానికి గురైందని మీడియాలో వార్తలు షికారు చేస్తున్న సంగతిత తెలిసిందే. తాను తీవ్ర అనారోగ్యానికి గురికాలేదు అని రూమర్లను సమంత ఖండించింది.
ఇటీవల తాను షూటింగ్ లో పాల్గొన్న వివరాలను ట్విటర్ లో పోస్ట్ చేసింది. 'సాధారణంగా తాను ట్విటర్ సందేశాలు పోస్ట్ చేయను. కాని తన ఆరోగ్యంపై గాసిప్స్ రావడంతో స్పందిస్తున్నాను' అని వెల్లడించారు.
'ఇలాంటి వార్తలకు పుల్ స్టాప్ పెట్టిండి. డిసెంబర్ 20 వరకు వినాయక్, జూనియర్ ఎన్టీఆర్ చిత్ర షూటింగ్ కు హాజరయ్యాను. డిసెంబర్ 23 నుంచి జనవరి 4 వరకు సూర్య, లింగుస్వామి చిత్ర షూటింగ్ లో పాల్గొననున్నాను' అని సమంత ట్విటర్ ద్వారా తెలిపింది. తన ఆరోగ్యం బాగానే ఉంది అని ట్విటర్ ద్వారా సమంత స్పష్టం చేసింది.