బకరా మినిస్టర్‌ననుకున్నావా?
గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌పై నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రిన్సిపాల్‌పై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
కల్హేర్: గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌పై నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మెదక్ జిల్లా కల్హేర్ మండలం సిర్గాపూర్‌లో హరితహారం, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మంత్రి రాపర్తిలో విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభించేందుకు బయలుదేరారు. మార్గమధ్యలోని నల్లవాగు గురుకుల పాఠశాల వద్ద ప్రిన్సిపాల్ మెవాబాయి, విద్యార్థులు మంత్రి కాన్వాయ్‌ని నిలిపారు. పాఠశాలలో మొక్కలు నాటాలని కోరారు.
మంత్రి హరీశ్‌రావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి వాహనం దిగి మొక్కలు నాటేందుకు వెళ్లారు. అయితే, అక్కడ పారా, నీరు అందుబాటులో లేవు. గోతులు కూడా తీసిలేవు. దీంతో మంత్రి ఆగ్రహంతో వెనుదిరుగుతూ ‘బకరా మినిస్టర్ అనుకుంటున్నారా?.. ఇవా ఏర్పాట్లు?’ అంటూ ప్రిన్సిపాల్‌పై మండిపడ్డారు. ప్రిన్సిపాల్ ప్రాధేయపడటంతో మంత్రి స్వయంగా మట్టిని తీసి గుంతలో మొక్కను నాటారు.


